For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కొన్ని దేశాల్లో నిషేధిత జాబితాలో ఉన్న విషయాలు

By Super
|

కొన్ని వస్తువుల వాడకం,చట్టపరంగా కొన్ని దేశాల్లో నిషేధం అని వింటే నవ్వొస్తుంది.నిత్యావసరంగా ఉపయోగపడే వాటిని నిషేధిస్తే చాలా చిరాగ్గా అనిపించదూ??ఉదాహరణకి బైక్ మీద వెళ్ళేటప్పుడు హెల్మెట్లు ధరించడం సురక్షితం అలాగే కారులో సీటు బెల్టు ధరించి కూర్చోవడం ఉత్తమం, కానీ కోప దృష్టితో చూడటం లేదా చనిపోవడం కొన్ని దేశాల్లో నిషేధం అంటే వింతగా అనిపించదూ??మనకి ఇవన్నీ అసహజంగా తర్కానికి అందనివిగా,మన స్వతంత్రాన్ని హరించేట్లున్నాయి ఈ నియమాలు అనిపిస్తుంది.


కొన్ని దేశాల్లో నిషేధిత జాబితాలో చిన్న చిన్న వస్తువులని లేదా విషయాలనీ చేర్చడం వెనక ఏదో ఒక కారణం ఉండే ఉంటుంది.మొదటి సారి ఈ రూల్స్ వింటే చాలా అసహజంగా అనిపిస్తాయి.నచ్చినట్లుగా జీవించడానికి హక్కు ఉండాలి అని అనిపిస్తుంది.కానీ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చట్టాలు కూడా ఉండాలి.కొన్ని చట్టాలయితే చాలా అసహజంగా అనిపిస్తాయి, మేము ఈరోజు ఇచ్చిన ఆర్టికిల్ చదివితే మీరు ఆశ్చర్యపోవడం ఖాయం. ఇక ఆలశ్యమెందుకు, ఏ యే దేశాల్లో ఏమేమి నిషేధమో చదివి తెలుసుకోండి.


మిలన్(ఈటలీ)లో కోప దృష్టితో చూడటం :

మిలన్(ఈటలీ)లో కోప దృష్టితో చూడటం :

మీరు కనుక ఇటలీ వెళ్తే ఎప్పుడూ నవ్వుతూనే ఉండండి. వ్యాధిగ్రస్తులని పరామర్శించేటప్పుడు, అంత్యక్రియలప్పుడు మాత్రమే నవ్వకూడదు.మీరు కోప దృష్టితో చూస్తూ పట్టుబడితే జరిమానా ఖాయం.

సింగపూర్‌లో చూయింగ్ గమ్ :

సింగపూర్‌లో చూయింగ్ గమ్ :

చూయింగ్ గమ్ములు కొనడం అమ్మడం సింగపూర్‌లో నేరం.మీరు కనుక చూయింగ్ గమ్‌తో పట్టుబడితే మీకు జరిమానా వడ్డిస్తారు.

ఇటలీలో చప్పుడు చేసే సాండల్స్ లేదా ఫ్లిప్ ఫ్లాప్స్:

ఇటలీలో చప్పుడు చేసే సాండల్స్ లేదా ఫ్లిప్ ఫ్లాప్స్:

మీరు నడిచేటప్పుడు శబ్దం చేసే ఫ్లిప్ ఫ్లాప్స్ లేదా సాండల్స్ కనుక మీదగ్గరుంటే వాటిని ఇటలీలోని ఒక ద్వీపమైన కాప్రీలో మాత్రం ధరించొద్దు.మీకు జరిమానా విధించే అవకాశం ఉంది.

ఆస్ట్రేలియాలో బల్బులు స్వంతంగా మార్చడం:

ఆస్ట్రేలియాలో బల్బులు స్వంతంగా మార్చడం:

ఆస్ట్రేలియాలోని విక్టోరియాలో మీరు కనుక ఉంటే మీ ఇంట్లో బల్బు మార్చడానికి ఎలెక్ట్రీషియన్‌నే తప్పక పిలవాలి. మీకు కనుక ఎలెక్ట్రీషియన్ లైసెన్స్ లేకుండా మీ అంతట మీరే బల్బు మారిస్తే జరిమానా ఖాయం.మన భారత దేశంలో హై టెన్షన్ విద్యుత్ తీగల మీద కూడా స్వంతంగా పని చేసెస్తూ ఉంటాము కదా,అలా కాదన్నమాట.

ఫ్రాన్స్‌లో రోడ్డు మీద ఉమ్మడం:

ఫ్రాన్స్‌లో రోడ్డు మీద ఉమ్మడం:

ఫ్రాన్స్‌లోని చిన్న పట్టణమయిన కోలెయిన్స్ లో స్వైన్‌ఫ్లూ విస్తరిస్తుందన్న భయంతో రోడ్డు మీద ఉమ్మడాన్ని నిషేధించారు. స్వైన్‌ఫ్లూని కనుగొన్న మొదటి రోజే ఈ నిషేధం అమలులోకి తెచ్చేసారు ఆ చిన్న పట్టణపు మేయరు గారు.

స్పెయిన్‌లో మరణించడం:

స్పెయిన్‌లో మరణించడం:

స్పెయిన్‌లోని ఆండాలూషియన్ అనే పట్టణంలో మరణించడం మీద నిషేదం ఉంది తెలుసా??అంటే అక్కడ ప్రజలు మరణించకూడదన్నమాట.అలాగే బ్రెజిల్లోని బిరిబిటా-మిరిం అనే చిన్న పట్టణంలో కూడా ప్రభుత్వం స్థలం కొని స్మశానం నిర్మించేవరకూ మరణించడం చట్ట విరుద్ధం.ప్రజలు తమ ఆరోగ్యం మీద శ్రద్ధ తీసుకుని ఆరోగ్యంగా జీవించడానికి ఈ చట్టం చేయబడింది.ఇలా చేయడంవల్ల కిక్కిరిసిన స్మశానంలో జాగా కోసం వెంపర్లాడే పరిస్థితి ఉండదని ఈ చట్టం వెనుక్క ఉన్న అంతరార్ధం.

ఆక్వేరియంలో గోల్డ్‌ఫిష్:

ఆక్వేరియంలో గోల్డ్‌ఫిష్:

ఇటలీలో ఉన్న మాంజా అనే పట్టణంలో ఇంట్లో బౌల్‌ల్లో గోల్డ్‌ఫిష్ ని ఉంచుకోవడం నిషేధించబడింది.అలా బౌల్లో పెట్టబడిన చేపకి దృష్టి సరిగ్గా లేక చూడటానికి ఇబ్బంది పడుతుందని ఈ నిషేధం.

కార్‌లో ముద్దాడడం:

కార్‌లో ముద్దాడడం:

ఇటలీలోని ఎబోలీ అనే పట్టణంలో కదులుతున్న వాహనంలో మీకు ప్రియమైన వారిని ముద్దాడడం నిషిద్ధం. కదులుతున్న వాహనం ప్రమాదానికి గురయ్యే ప్రమాదం ఉంది కాబట్టి ఈ నియమం.ఒకవేళ ఎవరైనా కదులుతున్న వాహనంలో తమ వారిని ముద్దాడుతూ కనపడ్డారంటే కొన్ని వందల డాలర్ల జరిమానా విధిస్తారు.

డెన్మార్క్‌లో మీ కిష్టమైన పేరు మీ పిల్లలకి పెట్టుకోలేరు:

డెన్మార్క్‌లో మీ కిష్టమైన పేరు మీ పిల్లలకి పెట్టుకోలేరు:

మీకిష్టమైన పేరుని మీ పిల్లలకి పెట్టుకోలేరు మీరు కనుక డెన్మార్క్‌లో ఉంటే.ప్రభుత్వం ఆమోదించిన ఏడూ వేల పిల్లల పేర్ల జాబితా నుండే పేరు ఎంచుకోవాల్సి ఉంటుందక్కడ.

English summary

the weird things that are banned in many countries

It is sometimes so funny to hear that a thing which can be legal and authentic can be banned in many countries. Since humans seek freedom to do anything in life, putting a ban on essential things can be quite annoying actually.
Desktop Bottom Promotion