Latest Updates
-
కోడి కొబ్బరి కారం ఎప్పుడైనా తిన్నారా? జన్మజన్మలకి గుర్తుండిపోయే రుచి..ఎలా చేసుకోవాలంటే.. -
మీ పుట్టిన తేదీ ప్రకారం మీ స్నేహితులు, విరోధులు ఎవరో తెలుసా.. వీరితో కాస్త జాగ్రత్త.! -
76 ఏళ్ల వయస్సులో కూడా ఫిట్ నెస్ లో యువతతో పోటీ..మోదీ నుంచి నేర్చుకోవాల్సిన రోజువారీ పనులివే -
ప్రియుడిపై విరహంతో పెళ్లయిన రెండు వారాలకే యువతి నిర్వాకం.. మొగుడికి ముచ్చెమటలు.! -
శరీరానికి చలవ చేసే కమ్మని కీరదోసకాయ దోశ..పిల్లల ఈవెనింగ్ స్నాక్ గా సూపర్! -
అల్సర్ తగ్గించి ఆకలిని పెంచే అద్భుతమైన తమిళనాడు వంటకం.. ఒక్కసారి తింటే జన్మలో వదిలిపెట్టరు.! -
గణేష్ నిమజ్జనం 2026: అనంత చతుర్దశి నాడు 4 మహా యోగాలు.. ఈ 5 రాశులకు పట్టిందల్లా బంగారమే! -
పెర్ఫ్యూమ్ స్ప్రే చేసేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా.. మీ డబ్బులు వృథా అయినట్లే.! -
ముంబై రోడ్ సైడ్ తవా పులావ్..మెతుకు కూడా మిగల్చకుండా తినేస్తారు..ఎలా చేసుకోవాలంటే.. -
పనీర్ కర్రీ కూడా పనికిరాదు.. ఈ ఆఫ్ఘానీ సోయా కర్రీ రుచి చూస్తే మళ్లీ మళ్లీ కావాలంటారు!
బరువు తగ్గాలనుకుంటున్నారా? అయితే ఉదయాన్నే ఈ ప్రోటీన్ రిచ్ పరాఠా ట్రై చేయండి..సొరకాయ రైతాతో కేక!
ఉరుకుల పరుగుల జీవితంలో ఉదయం బ్రేక్ ఫాస్ట్ చాలా ముఖ్యం. రోజంతా ఉత్సాహంగా ఉండాలంటే ప్రోటీన్లు, ఫైబర్ పుష్కలంగా ఉండే ఆహారం తీసుకోవాలి. రోజూ తినే ఇడ్లీ, దోశలకు భిన్నంగా ఏదైనా కొత్తగా, ఆరోగ్యకరంగా తినాలని ఉందా? బరువు తగ్గాలని ప్రయత్నిస్తున్నారా? అయితే మీకు పెసరపప్పు పరాఠా బెస్ట్ ఆప్షన్. ఇది తక్షణ శక్తిని ఇవ్వడమే కాకుండా, కడుపు నిండిన భావనను కలిగించి అతిగా తినకుండా చేస్తుంది. దీనికి తోడు చల్లని, రుచికరమైన సొరకాయ రైతా జతచేస్తే ఆ రుచే వేరు.

పెసరపప్పు పరాఠా తయారీకి కావాల్సిన పదార్థాలు
-వెల్లుల్లి రెబ్బలు
-పచ్చిమిర్చి
-అల్లం ముక్క
-పెసరపప్పు
-బొంబాయి రవ్వ లేదా శనగపిండి
-ఉప్పు
-పసుపు
-కారం
-కసూరి మేతి
-వాము
-గరం మసాలా
-ఉల్లిపాయ
-కొత్తిమీర
-ఇంగువ
-నూనె
-గోధుమపిండి
పెసరపప్పు పరాఠా తయారీ విధానం
-ముందుగా ఒక కప్పు పెసరపప్పును తీసుకుని, నీటిలో రెండు మూడు సార్లు శుభ్రంగా కడగాలి. మీకు సమయం తక్కువగా ఉంటే గోరువెచ్చని నీటిలో ఒక గంట పాటు నానబెట్టండి. వీలైతే రాత్రంతా సాధారణ నీటిలో నానబెట్టుకుంటే పరాఠాలు మరింత మృదువుగా, రుచిగా వస్తాయి.
నానిన పెసరపప్పులోని నీటిని పూర్తిగా వడకట్టండి.
-ఇప్పుడు పెసరపప్పును మిక్సీ జార్ లో వేసి, దానికి 6 వెల్లుల్లి రెబ్బలు, 3 పచ్చిమిర్చి, ఒక అంగుళం అల్లం ముక్క, కొద్దిగా నీళ్లు జతచేసి మెత్తని పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి. పరాఠాలు కరకరలాడుతూ రావడానికి ఈ మిశ్రమానికి 2 టేబుల్ స్పూన్ల బొంబాయి రవ్వ లేదా శనగపిండిని కలపండి.
ఇప్పుడు ఈ పప్పు మిశ్రమంలో మీ రుచికి తగినంత ఉప్పు, చిటికెడు పసుపు, కొద్దిగా కారం, కసూరి మేతి, ఒక టీస్పూన్ వాము, ఒక టీస్పూన్ గరం మసాలా వేసి బాగా కలపాలి. ఆ తర్వాత సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయ, కొద్దిగా కొత్తిమీర, చిటికెడు ఇంగువ వేయాలి. దీనికి ఒక కప్పు గోధుమ పిండిని కొద్దికొద్దిగా వేస్తూ చపాతీ పిండిలా మెత్తగా కలుపుకోవాలి. నీళ్లు ఎక్కువగా పోయకూడదు, పప్పులో ఉండే తడి సరిపోతుంది.
కలిపి పెట్టుకున్న పిండి ముద్దపై ఒక టీస్పూన్ నూనె రాసి ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. తర్వాత పిండిలోంచి చిన్న చిన్న ఉండలు తీసుకుని, పొడి పిండి చల్లుకుంటూ మీకు ఇష్టమైన ఆకారంలో పరాఠాల్లా ఒత్తుకోవాలి.
స్టవ్ వెలిగించి, పెనం వేడయ్యాక ఈ పరాఠాను రెండు వైపులా కొద్దిగా నూనె లేదా నెయ్యి రాస్తూ, మీడియం మంటపై ఎర్రగా కాల్చుకోవాలి.

-పెసరపప్పు పరాఠాకు సొరకాయ రైతా అద్భుతమైన కాంబినేషన్. ముందుగా ఒక లేత సొరకాయను తీసుకుని సన్నగా తురుముకోవాలి. ఈ తురుమును వేడి నీటిలో వేసి 4-5 నిమిషాల పాటు ఉడికించాలి.
-ఉడికిన తర్వాత నీటిని పూర్తిగా పిండేసి పక్కన పెట్టుకోండి. ఒక గిన్నెలో తాజా పెరుగు తీసుకుని, ఉండలు లేకుండా గిలకొట్టాలి. ఇందులో ఉడికించిన సొరకాయ తురుము, సన్నగా తరిగిన కొత్తిమీర, పచ్చిమిర్చి ముక్కలు, కొద్దిగా జీలకర్ర పొడి, నల్ల ఉప్పు వేసి బాగా కలపాలి.
-చివరగా ఒక చిన్న పాన్ లో టీస్పూన్ నూనె వేడి చేసి ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, చిటికెడు ఇంగువ వేసి దోరగా వేయించి పోపు పెట్టుకోవాలి. ఈ పోపును రైతాలో కలుపుకుంటే చాలు.
-వేడి వేడి పెసరపప్పు పరాఠాలను, ఈ చల్లని సొరకాయ రైతాలో అద్దుకుని తింటే వచ్చే మజాయే వేరు.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
