Latest Updates
-
లక్నో ఫేమస్ వెజ్ ధమ్ బిర్యానీ.. హైదరాబాద్ బిర్యానీని మరిపించే రుచి దీనికే సొంతం.! -
వారాంతాల్లో మగవారు చేసే ఈ పొరపాట్లు గుండె జబ్బులకి దారితీస్తాయని తెలుసా.? -
సీజన్ మారుతోంది.. మీ పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే భోజనంలో ఇవి తప్పనిసరి.! -
రెస్టారెంట్లో ఇలాంటి కర్రీ దొరికే ఛాన్సే లేదు.. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇచ్చే జోధ్‌పూర్ పనీర్ మసాలా.! -
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.! -
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.! -
చిత్త నక్షత్రంలోకి బుధ సంచారం.. ఈ పదిరోజుల్లో వీరికి ఒక పెద్ద సంస్థ నుంచి ఊహించని ఆఫర్.! -
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా? -
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మునక్కాడలోని గుజ్జు, చికెన్‌లోని ఘాటు.. ఇలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ట్రై చేశారా.?
హ్యాపీ హనుమాన్ జయంతి..మీ బంధుమిత్రులకు పంపేందుకు బెస్ట్ విషెస్, వాట్సాప్ స్టేటస్ లు ఇవే!
హనుమాన్ జయంతి పర్వదినానికి హిందూ సంప్రదాయంలో, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల సంస్కృతిలో అత్యంత ప్రాముఖ్యత, విశిష్ఠత ఉంది. ఈ రోజు భక్తికి, బలానికి, అంకితభావానికి ప్రతీక అయిన శ్రీ ఆంజనేయ స్వామి వారి జన్మదినాన్ని ఘనంగా జరుపుకుంటారు. హనుమంతుడు శివుని 11వ రుద్రావతారం అని పురాణాలు చెబుతున్నాయి. అంజనా దేవి, కేసరి దంపతులకు వాయుదేవుని ఆశీస్సులతో స్వామి జన్మించాడు.

అష్ట చిరంజీవులలో (ఎప్పటికీ మరణం లేని వారు) హనుమంతుడు ఒకరు. ఆయన సజీవంగా భూమిపై ఉంటూ రామ నామం ఎక్కడ వినిపిస్తే అక్కడ సూక్ష్మ రూపంలో ఉంటాడని భక్తుల ప్రగాఢ విశ్వాసం. దేశవ్యాప్తంగా ఇవాళ(మే 12)హనుమాన్ జయంతి జరుపుకుంటున్న సందర్భంగా మీ బంధువులు, కుటుంబసభ్యులకు పంపడానికి విషెస్, సోషల్ మీడియాలో పెట్టుకోడానికి ఆకట్టుకునే స్టేటస్ మెసేజ్ లు ఇక్కడ చూడండి.
వాట్సాప్, ఫేస్ బుక్ స్టేటస్ లు
-నా బలం, నా ధైర్యం, నా నమ్మకం.. శ్రీ ఆంజనేయ స్వామి. హనుమాన్ జయంతి శుభాకాంక్షలు.
-జై శ్రీరామ్.. అందరికీ పవిత్ర హనుమాన్ జయంతి శుభాకాంక్షలు.
-భయం ఎందుకు దండగ.. మన బజరంగబలి ఉండగా. జై హనుమాన్.
-కష్టాల్లో ఉన్నప్పుడు కన్నీళ్లు కాదు, హనుమాన్ చాలీసా చదువు. హ్యాపీ హనుమాన్ జయంతి.
-ఓం శ్రీ హనుమతే నమః.. ఈ రోజు మీ జీవితంలో అద్భుతాలు జరగాలని కోరుకుంటున్నాను. హ్యాపీ హనుమాన్ జయంతి.
-రామ భక్తుడైన హనుమంతుని కృప మనందరిపై ఉండాలి. జై భజరంగ బలి.
-అంజనీ పుత్రుని వేడుకుందాం.. ఆరోగ్యంగా, ఆనందంగా ఉందాం.
-పవన సుత హనుమాన్ కీ జై. అందరికీ హనుమాన్ జయంతి పండుగ శుభాకాంక్షలు.
-ఏ కష్టమొచ్చినా ఆదుకునే ఆపద్బాంధవుడు మన మారుతి. హనుమాన్ జయంతి శుభాకాంక్షలు.
కుటుంబ సభ్యులకు, స్నేహితులకు హనుమాన్ జయంతి మెసేజ్ లు
-ఈ హనుమాన్ జయంతి మీ జీవితంలో సంతోషాన్ని, శాంతిని, శ్రేయస్సును తీసుకురావాలని ఆకాంక్షిస్తూ.. మీకు, మీ కుటుంబ సభ్యులకు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు.
-ఆంజనేయ స్వామి ధైర్యాన్ని, బలాన్ని, బుద్ధిని ప్రసాదించాలని కోరుకుంటూ.. హనుమాన్ జయంతి పర్వదిన శుభాకాంక్షలు.
-రామ నామ స్మరణతో మీ ఇంటి వాతావరణం పవిత్రంగా మారాలి. హనుమంతుని ఆశీస్సులతో మీ పనులన్నీ నిర్విఘ్నంగా సాగాలి. హ్యాపీ హనుమాన్ జయంతి.
-సూర్యుడిని పండుగ భావించిన ఆ బాలుడి అపరిమితమైన శక్తి, మీ జీవితంలో ఎదురయ్యే కష్టాలను జయించే స్ఫూర్తినివ్వాలి. హ్యాపీ హనుమాన్ జయంతి.
-హనుమంతుని బలం, కరుణ, ప్రేమ మీపై ఎల్లప్పుడూ ప్రసరించాలని కోరుకుంటూ.. హ్యాపీ హనుమాన్ జయంతి.
-చీకటిని తరిమికొట్టే వెలుగులా, మీ కష్టాలను పారద్రోలే శక్తిగా ఆంజనేయుడు మీకు తోడుండాలి.
-మీ కోరికలన్నీ నెరవేరాలి, ఆపదలు తొలగిపోవాలి. అంజనీ పుత్రుని ఆశీస్సులు మెండుగా ఉండాలి.
-హనుమంతుని నిష్కల్మషమైన భక్తి మనందరికీ ఆదర్శం కావాలి. శ్రీరామ భక్తులకు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు.
-బుద్ధి, బలం, యశస్సు, ధైర్యం.. స్వామి ఆశీస్సులతో మీకు అన్నీ లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
-భక్తికి ప్రతిరూపం, శక్తికి మారుపేరు హనుమంతుడు. ఆయన దయ మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండాలి. హ్యాపీ హనుమాన్ జయంతి.

భక్తిపూర్వక హనుమాన్ జయంతి కోట్స్
-రామ నామం ఎక్కడ ఉంటుందో, అక్కడ హనుమంతుడు తప్పక ఉంటాడు. హ్యాపీ హనుమాన్ జయంతి.
-భక్తికి బలం తోడైతే, ఆ రూపమే మన ఆంజనేయుడు. హ్యాపీ హనుమాన్ జయంతి.
-నమ్మకం హనుమంతుడిలా ఉండాలి, అప్పుడే ఏ కష్టమైనా సముద్రంలా దాటేయొచ్చు. హ్యాపీ హనుమాన్ జయంతి.
-హనుమంతుడిని స్మరిస్తే భయం దరిచేరదు, ధైర్యం తోడుంటుంది. హ్యాపీ హనుమాన్ జయంతి.
-ఎంతటి శక్తి ఉన్నా, అహంకారం లేని బలమే హనుమంతుని అసలైన తత్వం. హ్యాపీ హనుమాన్ జయంతి.
-సంకల్పం దృఢంగా ఉంటే కొండలైనా పిండి చేయొచ్చు అని నిరూపించిన వాడు హనుమ. హ్యాపీ హనుమాన్ జయంతి.
-నీతికి, నిజాయితీకి, నిస్వార్థ సేవకు నిలువెత్తు రూపం మారుతి. హ్యాపీ హనుమాన్ జయంతి.
-దేవునిపై భక్తిలో దాస్యం, శత్రువుల పాలిట శక్తిలో అనంతం..అదే మన బజరంగబలి.
స్వీట్ హనుమాన్ జయంతి విషెస్
-మీకు, మీ కుటుంబానికి హనుమాన్ జయంతి శుభాకాంక్షలు
-పవనసుతుని ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉండాలి.
-జై శ్రీరామ్.. హనుమాన్ జయంతి పండుగ శుభాకాంక్షలు.
బ-జరంగబలి దయతో మీ కష్టాలన్నీ తొలగిపోవాలి.
-ధైర్యానికి మారుపేరు ఆంజనేయుడు. హ్యాపీ హనుమాన్ జయంతి.
శ్రీరామ భక్తుని కరుణ మీకు సర్వదా రక్షగా నిలవాలి.
-సంకట మోచనుడి ఆశీస్సులతో మీ ఇంట ఆనందం వెల్లివిరియాలి.
-మారుతి కరుణాకటాక్షాలు మీపై ఎల్లప్పుడూ ఉండాలి.
శక్తివంతమైన శ్లోకాలు,చాలీసా లైన్స్
-మనోజవం మారుత తుల్యవేగం.. హనుమాన్ జయంతి శుభాకాంక్షలు.
-జై హనుమాన్ జ్ఞాన గుణ సాగర.. జై కపీశ తిహు లోక ఉజాగర.
-రామదూతమతులిత బలధామం.. అంజనీపుత్ర పవనసుత నామం.
-భూత పిశాచ నికట నహి ఆవై..మహావీర జబ నామ సునావై.. జై శ్రీరామ్.
-విద్యవాన్ గుణీ అతి చాతుర.. రామ కాజ కరిబే కో ఆతుర..హనుమాన్ జయంతి శుభాకాంక్షలు.
-బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగతా.. అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్ స్మరణాత్ భవేత్..హనుమాన్ జయంతి శుభాకాంక్షలు.
-యత్ర యత్ర రఘునాథ కీర్తనం.. తత్ర తత్ర కృతమస్తకాంజలిం.. మారుతికి నమస్కారం.



Click it and Unblock the Notifications
