Latest Updates
-
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.!
కెమెరా కాలినా .. చిత్రాలు మురిపించాయి!
ఫొటోగ్రాఫర్లు ఫొటోలు తీసేటప్పుడు వింత అనుభవాలు ఎదురవుతుంటాయి. ఒక్కోసారి ఎంతో సాహసానికి ఒడిగడితే కానీ అద్భుతమైన ఛాయాచిత్రాలను తీయలేరు. అలాంటి యదార్థ ఘటనే ఇప్పుడు మీరు చదవబోతున్నారు.

ఫొటోగ్రాఫర్లు ఫొటోలు తీసేటప్పుడు వింత అనుభవాలు ఎదురవుతుంటాయి. ఒక్కోసారి ఎంతో సాహసానికి ఒడిగడితే కానీ అద్భుతమైన ఛాయాచిత్రాలను తీయలేరు. అలాంటి యదార్థ ఘటనే ఇప్పుడు మీరు చదవబోతున్నారు.
మరోమ్ అనే ప్రఖ్యాత ఫొటోగ్రాఫర్ గత నెల హవాయి ద్వీపాలకు వెళ్లాడు. రెండు వారాలు వరుసగా షూటింగ్ చేస్తూ గడిపాడు. ఇస్రాయల్ దేశానికి చెందిన ఇతడు మామూలుగా ఫొటోలు తీయడు. డ్రోన్‌ను ఉపయోగించి మరీ అద్భుతమైన ఫొటోలను తీస్తాడని పేరు.
ఈసారి అలాగే చేయబోయాడు. హవాయి ద్వీపం అగ్నిపర్వతాలకు పెట్టింది పేరు. అక్కడ లావా చిమ్ముతుంటే దాన్ని చిత్రీకరించాలనున్నాడు. అనుకున్నదే తడవు ఆ పనిలో పడ్డాడు.

1500 డాలర్ల విలువ చేసే డీజేఐ సంస్థకు చెందిన ఫాంటమ్ 4 కెమెరా డ్రోన్‌తో ఫొటోలు తీయనారంభించాడు. లావా చిమ్మే ప్రదేశానికి కెమెరాను దగ్గరగా పోనిచ్చాడు. ప్రమాదవశాత్తు కెమెరా ముందు భాగం కాస్త కాలిపోయింది. అయితేనేమీ లాగా ఎగచిమ్మే అద్భుతమైన చిత్తరవులను తీయగలిగాడు.
హవాయిలో ఉన్న అతి పెద్ద ద్వీపంలో కిలాయు అనే అగ్నిపర్వతం దగ్గరకు చేరుకోవడానికి అతడు 8 కిలోమీటర్లు ప్రయాణించాడు. అక్కడికి చేరాక పగటి పూట, చంద్రకాంతిలో, సూర్యస్తమయంలో మూడు గంటలపాటు ఏకధాటిగా బయట ఉన్న నేషనల్ పార్కులో కూర్చొని ఫొటోలు తీసుకుంటూ కూర్చునేవాడు.
అలా చేస్తున్నప్పుడు మరోమ్ తన కెమెరా కుడి భాగంలో ఉన్న ఫ్రేమ్ నల్లబడటాన్ని గమనించాడు. ఇంటికొచ్చి చూస్తే డ్రోన్ కెమెరాకున్న ప్లాస్టిక్ భాగం లావా వేడికి కరిగిపోయిందని కనుగొన్నాడు.
ఇది మామూలే కదా!దీంట్లో వింతేముంది అని మనం అనుకోవచ్చు. మరోమ్ మాత్రం తాను తీసిన అద్భుతమైన చిత్రాల విలువతో పోలిస్తే కెమెరాలో ఒక భాగం పాడు కావడం పెద్ద విశేషమేమీ కాదని అన్నాడు.

అదృష్టవశాత్తు ఆ కెమెరా చుట్టుపక్కల ప్లాస్టిక్ కాస్త కరిగిపోయినా అద్భుతంగా పనిచేస్తుంది. డ్రోన్ కూడా బాగానే నడుస్తుంది. బాగా ఎగరడమే కాదు, తిరిగి వాడుకునేందుకు అనుకూలంగా ఉందని అన్నాడు.
నాకు తెలిసి డ్రోన్ భాగాల్లోకెల్లా నలుపు ప్లాస్టిక్ చాలా సున్నితం. అందుకే లావా వేడికి కరిగిపోయినట్టు భావిస్తున్నాను. అని మరోమ్ అన్నాడు.
డీజేఐ సంస్థ నేను తీసిన అద్భుతమైన చిత్రాలకు ప్రతిగా డ్రోన్ కెమెరాను ఉచితంగా రిపేరు చేసి ఇస్తుందని అనుకుంటున్నాను. ఇలాంటి సాహసవంతమైన ఫొటొగ్రాఫర్ల గురించి మీడియా కథనాలు వెలువరించడం కొత్తేమీ కాదు. గతంలోనూ ఓ వ్యక్తి లావాని వెదజల్లే ఫొటోలను తీయబోయి విఫలమయ్యాడు.








Click it and Unblock the Notifications