Latest Updates
-
మిగిలిపోయిన అన్నంతో అద్దిరిపోయే ఆనియన్ రైస్..చిటికెలో చేసుకోండిలా.. -
ఇంట్లో కూరగాయలు లేవా? ఈ టమాటా సాంబార్ ట్రై చేయండి..ఇడ్లీ, దోశ, అన్నంలోకి కేక! -
షుగర్ పేషెంట్లు అన్నం తినొచ్చా?..డాక్టర్ చెప్పిన సీక్రెట్ ఇదే! -
మీ ఫోన్ పదే పదే వేడెక్కుతోందా?..ఈ చిన్న తప్పులు అస్సలు చేయకండి! -
Homemade honey recipe : కేవలం 10 నిమిషాల్లో ఇంట్లోనే స్వచ్ఛమైన తేనె తయారు చేసుకోండిలా! -
జున్ను పాలు లేకుండానే.. అప్పటికప్పుడు ఒరిజినల్ ఫ్యూర్ జున్ను చేసుకోండిలా.. -
Parivartini ekadashi 2026: అరుదైన రాజయోగంతో వృషభ,కర్కాటక,కన్య,మకర,ధనుస్సు రాశులకు మహా అదృష్టం! -
వాతావరణ మార్పులతో షుగర్ లెవెల్స్‌లో హెచ్చుతగ్గులు.. కారణాలేంటి.. ఎలా కంట్రోల్ చేయాలి.? నిపుణుల సలహాలు.! -
శరీరానికి హైడ్రేషన్ అందించే గోండ్ కటీరా డ్రింక్..ఈజీగా ఇంట్లోనే చేసుకోండిలా.. -
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.!
గుండె పదిలం..కిడ్నీలు శుభ్రం..అంతులేని పోషకాలున్న ఈ జ్యూస్ తాగితే బోలెడు బెనిఫిట్స్!
సమ్మర్ లో ఎండల తీవ్రత పెరిగేకొద్దీ మన శరీరం త్వరగా డీహైడ్రేషన్ బారిన పడుతుంది. ఈ సమయంలో ఆరోగ్యంగా ఉండటానికి నీటి శాతం ఎక్కువగా ఉండే ఆహారాన్ని ఎంచుకోవడం చాలా ముఖ్యం. వేసవిలో మన శరీరాన్ని చల్లబరిచి, రోగాల నుంచి రక్షించడంలో బూడిద గుమ్మడికాయ ఒక దివ్యౌషధంలా పనిచేస్తుంది. దీన్ని కూరగా వండుకుని తినడం ఇష్టం లేని వారు, కమ్మని జ్యూస్ రూపంలో తీసుకుంటే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.

పోషకాల గని.. బూడిద గుమ్మడి
బూడిద గుమ్మడికాయ రసం జీర్ణం కావడానికి చాలా తేలికగా ఉంటుంది. ఇందులో దాదాపు 95 శాతం నీరే ఉంటుంది. విటమిన్ C, విటమిన్ B1 (థయామిన్), B2 (రిబోఫ్లేవిన్), నియాసిన్ వంటి విటమిన్లతో పాటు క్యాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, ఫాస్పరస్ వంటి ముఖ్యమైన మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు, ఫైటోన్యూట్రియెంట్లు శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌తో పోరాడి కణాలను రక్షిస్తాయి.
గుమ్మడికాయ రసంతో అద్భుత ప్రయోజనాలు ఇవే
డీహైడ్రేషన్ కు చెక్
ఇందులో 95 శాతం నీరు ఉండటం వల్ల వేసవిలో దాహాన్ని తీర్చి శరీరాన్ని ఎల్లప్పుడూ హైడ్రేటెడ్‌గా ఉంచుతుంది.
శరీరానికి చలువ
ఆయుర్వేదం ప్రకారం బూడిద గుమ్మడికాయ రసం లోపలి నుంచి శరీరాన్ని చల్లబరుస్తుంది. కడుపులో మంట, గ్యాస్ట్రిక్ సమస్యలను ఇట్టే తగ్గిస్తుంది. వాత, పిత్త, కఫ దోషాలను ఇది సమతుల్యం చేస్తుంది.
బరువు తగ్గింపు, జీర్ణక్రియ
ఇది జీర్ణవ్యవస్థను మెరుగుపరచడమే కాకుండా, శరీరానికి తక్షణ శక్తిని అందిస్తుంది. ఆరోగ్యకరమైన రీతిలో బరువు తగ్గాలనుకునే వారికి ఇది ఒక బెస్ట్ డ్రింక్.
డిటాక్సిఫికేషన్
కిడ్నీలు, కాలేయంలో పేరుకుపోయిన మలినాలను బయటకు పంపి వాటిని శుభ్రపరుస్తుంది.
గుండెకు మేలు
ప్రతిరోజూ ఈ రసం తాగడం వల్ల శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ కరుగుతుంది. రక్తనాళాలపై ఒత్తిడి తగ్గి, గుండె పదిలంగా ఉంటుంది.
రోగనిరోధక శక్తి
ఇందులోని విటమిన్-C, B కాంప్లెక్స్ విటమిన్లు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. తరచుగా వచ్చే ఇన్ఫెక్షన్లు, చిన్నపాటి అనారోగ్యాల నుంచి కాపాడతాయి.

బూడిద గుమ్మడికాయ జ్యూస్ ఎలా చేసుకోవాలి
-ముందుగా బూడిద గుమ్మడికాయ తొక్క తీసి, గింజలను పూర్తిగా తొలగించి చిన్న ముక్కలుగా కోసుకోవాలి.
-ఈ ముక్కలను మిక్సీ జార్ లో వేసి.. అందులో కొన్ని పుదీనా ఆకులు, కొద్దిగా మిరియాల పొడి, కొత్తిమీర ఆకులు వేసి మెత్తగా బ్లెండ్ చేయాలి.
-ఈ మిశ్రమాన్ని ఒక పల్చటి కాటన్ వస్త్రం సాయంతో వడకట్టి జ్యూస్‌ను గ్లాసులోకి తీసుకోవాలి.
-రుచి కోసం ఇందులో కొద్దిగా నిమ్మరసం, చిటికెడు ఉప్పు, కావాలనుకుంటే రెండు ఐస్ క్యూబ్స్ కలుపుకోవచ్చు.
-ఈ జ్యూస్ ను తయారుచేసిన వెంటనే తాగడం ఉత్తమం. ప్రతిరోజూ ఉదయం పరగడుపున (ఖాళీ కడుపుతో) ఒక గ్లాసు బూడిద గుమ్మడికాయ రసం తాగితే దానిలోని పోషకాలు శరీరానికి పూర్తిగా అందుతాయి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
