Latest Updates
-
గ్రహాల అరుదైన కలయిక: ఈ 4 రాశుల వారికి కుబేర యోగం.. మహాలక్ష్మి రాజయోగంతో పట్టిందల్లా బంగారమే! -
బ్రేక్ ఫాస్ట్ కైనా, డిన్నర్ కైనా.. స్టఫ్డ్ పనీర్ కుల్చా చాలా ఈజీగా చేసుకోండిలా..వేళ్లు చప్పరిస్తూ తింటారు! -
మీటింగ్లో కెమెరా ఆన్ చేయాలని మేనేజర్ మొండిపట్టు.. ఉద్యోగిని గెటప్ చూసి మైండ్ బ్లాంక్.! -
రాత్రిపూట అతి ఆలోచనలతో నిద్ర కరువు.. ఈ చిట్కాలతో ఇట్టే కునుకు పట్టేస్తుంది.! -
భార్యాభర్తల మధ్య ఏజ్ గ్యాప్ ఎంత ఉండాలి.. పెళ్లికి ముందు తెలుసుకోవాల్సిన విషయాలు.! -
ఈ ప్రత్యేక మసాలాతో దిండిగల్ వెజ్ బిర్యానీ చేశారంటే..ప్రతి మెతుకు అమృతమే..మిగతావన్నీ మర్చిపోతారు! -
కళ్లకి కాటుక ఎలా పెట్టుకుంటున్నారు.?.. ఇలా అప్లై చేశారంటే కంటి కింద కురుపులు తప్పవు.! -
అసలు రోజుకు ఎంత ప్రోటీన్ తినాలి? మన శరీరానికి ఎంత అవసరం? -
ఆవకాయ, నిమ్మకాయ బోర్ కొట్టిందా? అయితే ఈ వెరైటీ బంగాళదుంప ఊరగాయ ట్రై చేయండి! -
మైదా లేకుండా సమోసాలను మించిన రుచితో ఉల్లి కచోరీ.. ఇలా చేస్తే ఎన్ని తిన్నా బోర్ కొట్టదు.!
ఆమె తెచ్చిన రోజే ఆమెకు భారమైంది.. మాతృదినోత్సవం వెనుక తెలియని నిజాలు!
సృష్టికి జీవం పోసినది రెండక్షరాల ప్రేమ..నీ గర్భగుడిలో పురుడోసుకున్నదే మానవ చిరునామా.. అమ్మని మించి దైవమున్నదా..? ఈ మాటలు వినగానే మనసులో ఏదో తెలియని భావోద్వేగం ఉప్పొంగుతుంది. ఎన్ని బంధాలున్నా అమ్మ ప్రేమకు సాటిరావు. అలాంటి అమ్మకు మనసారా కృతజ్ఞతలు చెప్పుకునేందుకు పుట్టిందే మదర్స్ డే. అయితే ఈ రోజు వెనుక ఒక కూతురి తొమ్మిదేళ్ల పోరాటం, అంతేస్థాయిలో ఒక విషాదం దాగి ఉందన్న విషయం చాలామందికి తెలియదు.

తల్లి కోరికే.. కూతురి లక్ష్యంగా..
అమెరికాకు చెందిన అన్ రీవ్స్ జార్విస్ అనే మహిళ ఒక సంఘ సంస్కర్త. 1858లో మదర్స్ డే వర్క్ క్లబ్ స్థాపించి, మహిళలకు ఆరోగ్యం, పిల్లల పెంపకంపై అవగాహన కల్పించేది. అమెరికన్ సివిల్ వార్ సమయంలో గాయపడిన సైనికులకు ఎనలేని సేవ చేసింది.
ఒకరోజు ఆమె చర్చిలో మాట్లాడుతూ..మానవాళికి నిస్వార్థ సేవ చేస్తున్న తల్లుల గౌరవార్థం ఒక ప్రత్యేకమైన రోజు ఉంటే ఎంత బాగుంటుంది? భవిష్యత్తులో ఎవరైనా ఆ రోజును తీసుకొస్తారని ఆశిస్తున్నాను అని మనసులోని మాట బయటపెట్టింది. అప్పుడు పన్నెండేళ్లు ఉన్న ఆమె కూతురు అన్నా జార్విస్ ఆ మాటలను గుండెల్లో ముద్రించుకుంది. ఆ ఎవరో తానే కావాలనుకుంది. తల్లి కోరిక కోసం పెళ్లి, పిల్లలు కూడా వద్దనుకుని ఉద్యమించింది.
వెటకారం నుంచి విజయం దాకా..
1905లో తల్లి మరణించాక, అన్నా జార్విస్ తన పోరాటాన్ని ఉధృతం చేసింది. 1908లో మదర్స్ డేను అధికారికంగా గుర్తించాలని ప్రభుత్వాన్ని కోరితే, అమ్మలకే కాదు, అత్తలకు కూడా ఒక రోజు పెట్టాలా? అని అధికారులు వెటకారం చేశారు. అయినా వెనక్కి తగ్గని అన్నా.. ఒక పూల వ్యాపారి సాయంతో తొలిసారిగా మదర్స్ డే నిర్వహించింది. దీనికి వేలాది మంది మద్దతు పలికారు.
అప్పటిదాకా అమెరికాలో సెలవులన్నీ మగవారి విజయాలకే పరిమితం. తల్లుల త్యాగాలకు గుర్తింపు కావాలని ఆమె పత్రికలకు, నాయకులకు కుప్పలుతెప్పలుగా లెటర్స్ రాసింది. చివరకు ఆమె శ్రమ ఫలించి, 1914లో అప్పటి అధ్యక్షుడు వూడ్రో విల్సన్ మే నెల రెండో ఆదివారాన్ని జాతీయ మదర్స్ డేగా ప్రకటించారు.

ప్రేమ పోయి.. వ్యాపారం వచ్చింది
కూతురి నిరీక్షణ ఫలించింది. కానీ ఆ సంతోషం ఎన్నాళ్లో నిలవలేదు. అన్నా జార్విస్ ఉద్దేశం.. ఆ ఒక్కరోజైనా పిల్లలు తమ తల్లుల దగ్గరకు వెళ్లి, వారితో సమయం గడిపి, ప్రేమను పంచాలని. కానీ, ఈ రోజుకు జాతీయ సెలవుదినం హోదా రావడంతో వ్యాపారస్తులు రంగంలోకి దిగారు. అమ్మ దగ్గరకు వెళ్లే బదులు పూల బొకేలు, గ్రీటింగ్ కార్డులు కొరియర్ చేయడం మొదలుపెట్టారు. ఎక్కడ చూసినా మాతృప్రేమ పేరుతో వ్యాపారమే రాజ్యమేలింది.
తాను తెచ్చిన రోజును.. వద్దనుకున్న కూతురు
ఈ వ్యాపార ధోరణి చూసి అన్నా జార్విస్ తట్టుకోలేకపోయింది. మదర్స్ డే పేరుతో వ్యాపారం చేసే సంస్థలపై లెక్కలేనన్ని కేసులు వేసింది. తన ఆస్తినంతా ఆ కేసుల కోసమే ఖర్చు చేసింది. అయినా సమాజంలో మార్పు రాలేదు. చివరకు విసిగిపోయిన ఆమె, ఏ నోటితో అయితే 'మదర్స్ డే' కావాలని అడిగిందో.. అదే నోటితో మాతృదినోత్సవాన్ని క్యాలెండర్ నుంచి తొలగించాలని ప్రభుత్వాన్ని వేడుకుంది. కానీ అప్పటికే ఆ పండుగ మార్కెట్లో ఒక భాగమైపోయింది. పోరాడుతూనే అన్నా కన్నుమూసింది.



Click it and Unblock the Notifications