For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చాణుక్యుని ప్రకారం యువత తప్పనిసరిగా గుర్తించుకోవల్సిన విషయాలు

విద్యార్థులకు ఉపయోగపడే కొన్ని ముఖ్యమైన విషయాలను కూడా చెప్పాడు. విద్యార్థిగా పరీక్షల్లో విజయం సాధించడానికి, లక్ష సాధన వైపు దూసుకెళ్లడానికి చాణక్యుడు చెప్పిన విషయాలను ఎంతగానో ఉపయోగపడుతాయి. అవేంటో తెలుసు

|

ఈ కాలం, ఆకాలం..అనే తేడా లేకుండా విద్యార్థులు అన్ని కాలాల్లోనూ ఒకేలా ఉంటారని సలహాదారుగా, వ్యూహకర్తగా, రచయితగా, రాజకీయ నీతి అవపోసన పట్టించుకున్న నిపుణుడిగా పేరుగాంచిన చాణక్యుడు ఏనాడో చెప్పాడు.

అలాగే విద్యార్థులకు ఉపయోగపడే కొన్ని ముఖ్యమైన విషయాలను కూడా చెప్పాడు. విద్యార్థిగా పరీక్షల్లో విజయం సాధించడానికి, లక్ష సాధన వైపు దూసుకెళ్లడానికి చాణక్యుడు చెప్పిన విషయాలను ఎంతగానో ఉపయోగపడుతాయి. అవేంటో తెలుసుకుందాం..

 అందం గురించి పట్టించుకోకూడదు.

అందం గురించి పట్టించుకోకూడదు.

ఎప్పుడు కూడా విద్యార్థులు తమ అందం గురించి పట్టించుకోకూడదు. తాము చూడడానికి ఎలా ఉన్నా, పక్క వారు ఏం మాట్లాడినా దాని గురించి లోతుగా ఆలోచించుకోకూడదు. విద్యార్థులు కళాశాలల్లో కేవలం చదువుకోవడానికి వస్తారు. కాబట్టి వారి శ్రద్ద అంత చదువు పైనా ఉండాలి.

అతిగా నిద్రపోకూడదు

అతిగా నిద్రపోకూడదు

యుక్త వయస్సులో చదువుకుంటారు కాబట్టి, అతిగా నిద్రపోకూడదు. అలా చేస్తే సోమరిగా తయారవుతారు. అది చదువుకు ఆటంకం కలిగిస్తుంది. అలాగని నిద్రలేకుండా ఉండకూడదు. రాత్రి త్వరగా నిద్రించి, ఉదయం 4గంటలకు నిద్రలేచి చదువుకుంటే మంచిది. ఆ సమయంలో మెదడు చురుకుగా పనిచేస్తుంది. కాబట్టి, చదివినదంతా తప్పక గుర్తుంటుంది.

కోపం పనికిరానిది

కోపం పనికిరానిది

యుక్తవయస్సులో ఉన్నవారు ఉడకు రక్తం కలిగి ఉంటారు. వీరికి ఇట్టే కోపం వస్తుంది. కానీ కోపం పనికిరానిది. కోపం ఉన్న చోట శాంతి ఉండదు. శాంతి లేకపోతే చదువుపై ఏకాగ్రత్త కోల్పోతారు.

ఇతర వస్తువల మీద ఆశపడకూడదు.

ఇతర వస్తువల మీద ఆశపడకూడదు.

ఇతర వస్తువల మీద ఆశపడకూడదు. మనది కానిది మన దగ్గర ఉంటే ఎప్పటికైనా ప్రమాదమే. అలాగే మనది కావాలని రాసి ఉంటే ఎన్ని ఆటంకాలు ఎదురైనా మన దరికి రాక తప్పదు. కాబట్టి, ఎవరైనా తమ వస్తువులను ఆశ చూపి ప్రలోభాలకు గురిచేయడానికి ప్రయత్నిస్తారు. ఇలాంటి వాటి నుంచి దూరంగా ఉండాలి.

అబ్బాయిలు, అమ్మాయిలు ఆకర్షణ

అబ్బాయిలు, అమ్మాయిలు ఆకర్షణ

విద్యార్థులలో అబ్బాయిలు, అమ్మాయిలు ఇద్దరు ఉంటారు. అలాంటప్పుడు ఒకరిపై ఒకరికి ఆకర్షణ కలగడం సర్వ సాధారణం. ఆ వయస్సులో ఇలాంటివి సహజం. అది కేవలం ఆకర్షణ మాత్రమే అని గ్రహించాలి. చదువులో ఉన్నత స్థాయికి చేరితే..అందరూ మిమ్మల్ని ఆకర్షించడానికి ప్రయత్నిస్తారనే నిజాన్ని గుర్తు పెట్టుకోవాలి.

కొత్త విషయాలను నేర్చుకునేందుకు ప్రాధాన్యత ఇవ్వాలి

కొత్త విషయాలను నేర్చుకునేందుకు ప్రాధాన్యత ఇవ్వాలి

విద్యార్థులు ఎల్లప్పుడు కొత్త విషయాలను నేర్చుకునేందుకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఒకరి గురించి ఇంకొకరితో మాట్లాడటం..ఒకరి కించపరచడం లాంటివి చేయకూడదు.

ఇంట్లో వండిన ఆహారాన్నే తినాలి.

ఇంట్లో వండిన ఆహారాన్నే తినాలి.

విద్యార్ధులు ఇంట్లో వండిన ఆహారాన్నే తినాలి. దీంతో పోషకాహారం సరిగ్గా అందుతుంది. చదువుల్లో రాణిస్తారు.

డబ్బు విలువ తెలుసుకోవాలి.

డబ్బు విలువ తెలుసుకోవాలి.

విద్య దశలో ఉన్నప్పుడు డబ్బు విలువ తెలుసుకోవాలి. తల్లిదండ్రులు ఇచ్చిన డబ్బుని దుబారాగా ఖర్చు చేయకూడదు. ముఖ్యంగా చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి.

English summary

8 Tips That Every Student Can Adopt For A Flourishing Career: Chanakya Neeti

hanakya himself was trained at Takshila University, and wrote several philosophies regarding students’ life. According to Chanakya, if students follow these tips, they can easily achieve success in their career.
Desktop Bottom Promotion