For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

శరీరాన్ని తేళ్ళతో కప్పుకున్న ఈ థాయిలాండ్ తేళ్ల రాణి గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే....

By :r Vishnu Vardhan Reddy
|

కాంచన కేట్కయు థాయిలాండ్ దేశంలోని పట్ఠాయ నగరంలోని మ్యూజియం లో తేళ్ల మధ్యన ఉండి అందరిని ఆశ్చర్యపరిచింది. తన మొహం చుట్టూ డజన్ల కొద్దీ తేళ్లు ఉన్న కనీసం తన కను రెప్ప కూడా వాల్చలేదు. తన నోటిలో మూడు నిమిషాల పాటు తేలుని పెట్టుకొని నోరు మూసుకొని ఉండగలదు. ఇలా ఒక రికార్డు నే సృష్టించింది. అంతేకాకుండా గాజుతో మూసివేయబడ్డ పన్నెండు మీటర్ల చదరపు తొట్టిలో 5000 బతికున్న తేళ్ల మధ్య 33 రోజులు పాటు గడిపింది.

ఇక్కడ మీరు చూస్తున్న ఫోటోలలో థాయిలాండ్ దేశంలో తేళ్ళ రాణిగా పిలవబడే ఈమె తెరిచి ఉన్న నోటి పై ఎలా జంతు వర్గం పాకుతూ ఉందో చూడవచ్చు. అంతేకాకుండా అవి ఆమె ముఖం పై కూడా అలానే పాకుతూ ఉన్నాయి.

Scorpion Queen breaks new world record

Image source

శనివారం రోజున థాయిలాండ్ లోని పట్ఠాయ నగరంలో భయం అనేదే తెలియదు అనేలా కాంచన కేట్కయు ముఖం చుట్టూ విషపూరితమైన జీవులు డజన్ల కొద్దీ సంచరిస్తున్నా, తాను కనురెప్ప అనేదే మూయకుండా వ్యవహరించిన విధానం చూపరులను కట్టిపడేసింది. ఇది నిజామా కాదా అని ఈ ఉదంతాన్ని చూసిన వాళ్ళు సందిగ్ధంలో పడిపోయారంటే అతిశయోక్తి కాదు.

రిప్లేయ్ కు అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న కాంచన నోటి లోపల తేలుని పెట్టుకొని నోరు మూసుకొని 3 నిమిషాల 28 సెకండ్ల పాటు అలానే ఉండి గిన్నిస్ రికార్డునే సృష్టించింది. ఆమె ఎవరో..అలా ఎందుకు చేయాల్సివచ్చిందో మరికాస్త వివరంగా తెలుసుకుందామా..

థాయిలాండ్ లో తేళ్ళ రాణిగా పిలవబడే కాంచన

థాయిలాండ్ లో తేళ్ళ రాణిగా పిలవబడే కాంచన

థాయిలాండ్ లో తేళ్ళ రాణిగా పిలవబడే కాంచన కేట్కయు ముఖం పై తేళ్లు ఎలా పాకుతున్నాయి మరియు నోటిలోపలకి తేళ్ళు ఎలా వెళ్తున్నాయో ఈ ఫోటో లో చూడవచ్చు. శనివారం రోజున థాయిలాండ్ లో పట్ఠాయ నగరంలోని మ్యూజియంలో విషపూరితమైన జీవులు ఆమె ముఖం పై డజన్ల కొద్దీ పాకుతున్నా కనీసం కనురెప్ప కూడా ఆమె వాల్చలేదు. మొత్తం థాయిలాండ్ దేశంలో ఈ ఒక్క మహిళకు మాత్రమే రెండు గిన్నీస్ వరల్డ్ రికార్డులు ఉన్నాయి.

2 వేల జాతుల తేళ్ళు ఈ భూమి పై ఉన్నాయి

2 వేల జాతుల తేళ్ళు ఈ భూమి పై ఉన్నాయి

2 వేల జాతుల తేళ్ళు ఈ భూమి పై ఉన్నాయి. వీటిల్లో 40 అత్యంత విషపూరితమైనవి ఉన్నాయి. వీటికి మనిషిని చంపేసే శక్తి కూడా ఉంది.

ఇవి చిన్న చిన్న క్రిమి కీటకాల దగ్గర నుండి ఎలుకల వరకు వేటినైనా తిని జీవించగలవు. నీళ్లు మరియు ఆహారం లేకుండా కూడా సంవత్సరం పాటు బ్రతకగలవు.

రిప్లేస్ అంబాసిడర్ అయిన కాంచన కేట్కయు తన నోటి లోపల తేలుని 3 నిమిషాల 28 సెకండ్ల పాటు పెట్టుకొని గిన్నీస్ రికార్డు ని సంపాదించింది.

తెలుకు పన్నెండు కళ్ళు ఉన్నా

తెలుకు పన్నెండు కళ్ళు ఉన్నా

తెలుకు పన్నెండు కళ్ళు ఉన్నా వాటికి కంటి చూపు అంత బాగా ఉండదు. వాటికి కావాల్సిన వస్తువుల కోసం అవి ఎక్కువగా వాసన చూడటం పై ఆధారపడుతుంటాయి.

అతినీలలోహిత కిరణాలూ తేళ్ళపై పడినప్పుడు అవి ఎందుకు మరీ ఎక్కువ ఆకుపచ్చ రంగులోకి మారి ధగధగలాడుతాయి అనే విషయమై ఇప్పటికీ శాస్త్రవేత్తలకు అంతుపట్టడంలేదు.

ఇవి ఘణ రూపంలో ఉన్న ఆహారాన్ని తీసుకోలేవు. అందుచేత విషాన్ని ఉపయోగించి వాటికి కావాల్సిన ఆహారాన్ని ద్రవ రూపం లోకి మార్చుకొని సేవిస్తాయి.

నమ్మకద్రోహం చేయడం అంటే

నమ్మకద్రోహం చేయడం అంటే

నమ్మకద్రోహం చేయడం అంటే అది భయాన్ని సూచిస్తున్నట్లు కాదు. తేళ్లు పైకి పాకడం మొదలు పెట్టడంతో కాంచన కేట్కయు తొడుగులు తొడుగుకున్న తన చేతులను పైకి ఉంచింది.

రాత్రి జీవితానికి మరియు క్యాబరే కి ఎంతో ప్రసిద్ధి చెందిన గల్ఫ్ అఫ్ థాయిలాండ్ లో ఉన్న పట్ఠాయ నగరంలో ఈ కార్యక్రమం చేస్తున్న సమయంలో కొన్ని డజన్ల కొద్దీ తేళ్లు ఆమె శరీరంపై పాకడం ప్రారంభించాయి.

English summary

Scorpion Queen breaks new world record

You have often seen that there are many such animals in our home or around the house. Which we see every day Even after this, you are afraid to go to them. In such a case, if girls talk about girls then they are scared of cockroach and lizard too.
Desktop Bottom Promotion