పునరావృతమయ్యే అంకెల వెనకాల రహస్యం ఏంటి?

By: Deepti
Subscribe to Boldsky

మీకెప్పుడైనా ఏదైనా విషయాలను ఒకే అంకెల వరుసలో చూస్తున్నామని అనిపించిందా? ఇది ఎల్లప్పుడూ జరిగే విషయం ఏం కాదు.

ఇక్కడ, ఈ వ్యాసంలో మనం ఈ అంకెల పునరావృత రహస్యాన్ని తెలుసుకుందాం. ఒకే వరుసలో ఒకే అంకెలను చూడటం అంటే ఏంటో తెలుసుకోండి.

మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం 2017 మీకు ఎలా ఉండబోతోంది ?

ఒకే వరుసలో అంకెలను మళ్ళీ మళ్ళీ చూడటం, వాటి వెనుక అర్థం తెలుసుకుని మీరు హతాశులవుతారు!

మరింత తెలుసుకోండి.

ఒకట్లు (111)

ఒకట్లు (111)

ఈ అంకె పదేపదే పునరావృతం అవుతోందంటే మీరు ‘సరియైన' దారిలో ఉన్నట్టు. ఈ అంకెలతో ఉన్న సంఖ్య అర్థం మీ వద్ద సానుకూల శక్తి మరియు ఫలితాలనిచ్చే నిర్ణయాలు ఉన్నట్టు.

రెండ్లు (222)

రెండ్లు (222)

ఈ అంకెను చూస్తే అర్థం మీరు జీవితంలో అనేక అడ్డంకులు ఎదుర్కోబోతున్నారని. మీ పై మీకు నమ్మకం, మీ నైపుణ్యాలపై అవగాహన మిమ్మల్ని ఈ సమస్యల నుండి బయటపడేస్తాయి.

మూడులు (333)

మూడులు (333)

ఇది చాలా శక్తివంతమైన అంకె. ప్రకృతిని సూచిస్తుంది. ఈ అంకెను పదేపదే చూస్తున్నారంటే మీలోని చెడుశక్తి నుంచి, నష్టాలు కలిగించే శక్తుల నుంచి మీ రక్షణ మీరే చూసుకోగలరు అని.

నాలుగులు (444)

నాలుగులు (444)

ఈ అంకెల అర్థం మీరు అనేక వనరులను సమకూరుస్తున్నారని. మీకు ఆర్థిక లేదా భావోద్వేగ సమస్యలుంటే, మీకు ఇక మంచి లాభదాయక సమయం రాబోతోందని అర్థం.

ఐదులు (555)

ఐదులు (555)

ఈ అంకె అర్థం ఉన్నచోటనే ఉండిపోయే నిరాశాజనక స్థితి. మీ జీవితానికి ముందుకు వెళ్ళే శక్తి ఇవ్వబడుతుందని అర్థం. అద్భుత విషయాలు మీ జీవితంలోకి అడుగుపెట్టబోతున్నాయి.

మీ జాతకం ప్రకారం మీ పేరులో అదృష్టం తెలుసుకోవడం ఎలా

ఆరులు (666)

ఆరులు (666)

ఈ అంకె రాక్షస శక్తులకి, ప్రభావానికి గుర్తు. అన్నిచోట్లా ఈ అంకెల సంఖ్య చూస్తున్నట్లయితే మీకు దుష్టప్రభావం ఏదో జరగబోతోందని అర్థం. కానీ ఇది సాధారణ హెచ్చరికగా కూడా అనుకోవచ్చు. అనగా మీరు మీలోని నిరాశాజనక శక్తి ప్రభావానికి లోనవుతారు కాబట్టి కొంత సమయం విశ్రాంతి తీసుకోండని అర్థం.

ఏడులు (777)

ఏడులు (777)

ఈ అంకెల సంఖ్య చూడటం అంటే మీలో సానుకూల శక్తులు, అవకాశాలకి శకునం లాంటిది. అభివృద్ధి, సానుభూతి వంటి విషయాలు మీకు దగ్గర్లోనే ఉంటాయి,అందుకని వాటిని అందిపుచ్చుకోండి.

ఎనిమిదులు (888)

ఎనిమిదులు (888)

ఈ అంకెల వరుసను చూడటం అరుదైనా, విశ్వంలో రహస్యశక్తులకు అనుసంధానమైనది. ఇది అంతరిక్ష శక్తులు, ఉపశమనం వంటివాటిని సూచిస్తుంది.

తొమ్మిదులు (999)

తొమ్మిదులు (999)

తొమ్మిది అంకెలలో చివరిది అనగా జీవితంలో ఒక అధ్యాయం ముగిసి మరొకటి ప్రారంభమైనట్టు. మీ మార్గాన్ని వదలకుండా, జ్ఞానంతో సాగిపోతే పైన చెప్పిన కొత్త ద్వారాలు తెరుచుకుంటాయి. ఈ అంకె ముఖ్యపాఠాలు నేర్చుకుంటారనటానికి గుర్తు.

English summary

What Is The Mystery Behind Repeating Numbers

Did you know that there is a mystery behind repeating numbers? Check out the hidden meaning behind these.
Story first published: Monday, July 10, 2017, 14:49 [IST]
Subscribe Newsletter