For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  మన భారతీయ క్రికెటర్ల నవ్వుతెప్పించే చిత్రాలను చూస్తే పొట్టచెక్కలు అవుతుంది

  By R Vishnu Vardhan Reddy
  |

  ఎన్నో అబ్బురపరిచే సంఘటనలు, ఊపిరి ఆగిపోయే క్షణాలను మరియు ఆహ్లాదకరమైన క్షణాలను ఇలాంటి సంఘటనలు ఎన్నింటినో కెమెరా బంధిస్తుంది. కొన్ని సంఘటనలను చూస్తే అయ్యో అనిపిస్తుంది. ఇలాంటి సందర్భాలు సెలెబ్రిటీలు మరియు నటులకు ఎదురయినప్పుడు, ఎప్పుడైనా అలాంటివి కెమెరా కంటికి చిక్కుతాయి. ఆ సన్నివేశాలు ఎంతో అద్భుతంగా ఉండటమే కాకుండా, నవ్వుని కూడా తెప్పిస్తాయి. అటువంటి విషయాలు ఎన్నో ఉన్నాయి.

  ఈ వ్యాసంలో భారతీయ క్రికెటర్ల కు సంబంధించిన కొన్ని దృశ్యాలు కెమెరా కంటికి చిక్కాయి. వాటిని గనుక చూస్తే ఎవ్వరికైనా విపరీతమైన నవ్వు వస్తుంది.

  ఈ చిత్రాలను మొదటిసారి చూసినా కూడా, అవి ప్రతి ఒక్కరి దృష్టిని ఆకర్షిస్తాయి. వాటిని చూసినప్పుడు మనకు విభిన్నమైన అర్ధాలు స్ఫురిస్తాయి.

  గమనిక : ఈ వ్యాసాన్ని కేవలం, ఆనందం మరియు ఆహ్లాదం కోసం మాత్రమే రాయడం జరిగింది. కేవలం నవ్వు తెప్పించాలని ఉద్దేశ్యం మాత్రమే ఇందులో ఉంది. ఈ చిత్రాల వెనుక ఎటువంటి కఠినమైన అర్ధాలు గాని లేదా కించపరిచే అర్ధాలు లేవని మనవి చేస్తున్నాం.

  సరదాగా ఉండటం కోసమే :

  సరదాగా ఉండటం కోసమే :

  మన క్రికెటర్లు ఎప్పుడైతే మైదానంలో ఉండరో, అటువంటి సమయంలో వారు సరదాగా ఇలా సేద తీరుతూ ఉంటారు. ఒకానొక సమయంలో ప్రముఖ క్రికెటర్లు హర్భజన్ సింగ్ మరియు సురేష్ రైనా ఎంతో ప్రఖ్యాతి గాంచిన టైటానిక్ భంగిమను అనుసరించడం జరిగింది. దానిని వారే విడుదల చేసారు. ఆ చిత్రం చాలా వైరల్ గా మారింది.

   ఇషాంత్ శర్మ మరియు ఇర్ఫాన్ పఠాన్ :

  ఇషాంత్ శర్మ మరియు ఇర్ఫాన్ పఠాన్ :

  వీరిద్దరూ మైదానంలో ఉన్న సమయంలో అనుకోని అసందర్భమైన ఈ చిత్రాన్ని తీయడం జరిగింది. వీరికి అవి చాలా వికారమైన క్షణాలు. ఈ చిత్రాన్ని గనుక ఎవరైనా చూస్తే ఖచ్చితంగా వెర్రివాళ్ళు అవుతారు. కానీ, ఆ చిత్రం వెనుక ఉన్న అసలు అర్ధం ఏమిటంటే, సరైన భంగిమలో ఇషాంత్ శర్మ ప్రాక్టీస్ చేయడం కోసమై ఇర్ఫాన్ సహాయం చేస్తున్నాడు.

  ఇండియాలో కనిపించే ఫన్నీ సైన్ బోర్డ్స్

  క్రికెటర్లు నమ్మే మూఢ నమ్మకాలూ :

  క్రికెటర్లు నమ్మే మూఢ నమ్మకాలూ :

  ఇషాంత్ మైదానాన్ని కౌగలించుకుంటాడు. ఈ చిత్రంలో ఇషాంత్ మైదానం పై పడిపోయి ఉన్నట్లు కనిపిస్తుంది. ఈ చిత్రంలో అతడుపెట్టిన వ్యక్తీకరణను చూస్తే, అసలు ఇషాంత్ అలా పడుకొని మెదడులో ఏమి ఆలోచిస్తూ ఉండి ఉండవచ్చు అని ఎవరైనా ఆశ్చర్యపోతారు.

  ఆశిష్ నెహ్రా అద్భుత క్షణం :

  ఆశిష్ నెహ్రా అద్భుత క్షణం :

  ఆశిష్ నెహ్రా కు సంబంధించిన ఈ ప్రత్యేకమైన చిత్రాన్ని, అతడు ఆడుతున్న అంతర్జాతీయ మ్యాచ్ లో తీయడం జరిగింది. ఈ చిత్రాన్ని ఐ.పి.ఎల్ లో వేలంపాటలో భాగం గా మేమీ గ కూడా పెట్టారు. వికెట్ తీసుకున్న తర్వాత అతడు స్పందించిన అద్భుతమైన క్షణాలు అవి. ఇవి చూసిన తర్వాత ఎవరైనా సరే, తదుపరి చిత్రాన్ని చూడటానికి వెళ్ళిపోతారు.

  యువరాజ్ సింగ్ కొంటెగా ప్రవర్తించిన సందర్భం :

  యువరాజ్ సింగ్ కొంటెగా ప్రవర్తించిన సందర్భం :

  ఒక మ్యాచ్ ప్రాక్టీస్ లో భాగంగా యువరాజ్ సింగ్ ఎంత సహజంగా తన హావభావాలను వ్యక్తపరిచారు అనే విషయాన్ని తెలియజేసే చిత్రం ఇది. ఈ నవ్వు తెప్పించే చిత్రాన్ని గనుక ఎవ్వరైనా చూస్తే, ఎవ్వరికైనా నవ్వు రావాల్సిందే. ఈ చిత్రం బ్యాక్ గ్రౌండ్ లో ధోని కూడా ఈ సంఘటనను చూసి ఆనందిస్తున్న క్షణం కనపడుతుంది.

  ఇంటికి బంధువులు వచ్చినప్పుడు ఇండియన్స్ చేసే ఫన్నీ థింగ్స్

  ఎవరు బాస్ గా ఉండాలి అని ధోని నిర్ణయించిన క్షణం :

  ఎవరు బాస్ గా ఉండాలి అని ధోని నిర్ణయించిన క్షణం :

  ఈ చిత్రంలో యువ రాజ్ పై ధోని కూర్చొని ఉన్నాడు. ఈ చిత్రం చూడటానికి చాలా హాస్యం పండించే విధంగా ఉంది. ఈ చిత్రానికి హాస్యాన్ని జోడిస్తూ యువ రాజ్ కూడా ట్విట్టర్ లో పెట్టాడు . ఈ చిత్రానికి సంబంధించి ఎన్నో నవ్వు తెప్పించే చిత్రాలను కొత్తగా తయారుచేయడం జరిగింది. యువ రాజ్ కి ఎవరు బాస్ అనే విషయాన్ని ధోని నిర్ణయించాడు అని చాలామంది ఆ చిత్రాన్ని చూసి హాస్యంతో రాసిన మాటలు ఇవి.

  మీరు మరిన్ని ఆసక్తికరమైన మరియు నవ్వు తెప్పించే చిత్రాలను చూడాలను భావిస్తున్నట్లైతే, మీ యొక్క అభిప్రాయాలను క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి.

  Image Source: Google

  English summary

  Indian-cricket-players-funny-photo-collection

  There are so many funny moments of cricketers that are caught on the camera. These pictures have been captured at the right moment. There is a compilation of the funniest pictures of cricketers caught on camera!
  Story first published: Thursday, February 15, 2018, 17:00 [IST]
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more