Latest Updates
-
అసలైన అంబూర్ చికెన్ బిర్యానీ సీక్రెట్ ఇదే.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసేయండి! -
రియల్ లైఫ్ బిచ్చగాడు.. వేల కోట్ల ఆస్తి వదిలి ముంబై వీధుల్లో అడుక్కుంటూ..! -
పితృ పక్షాలకు ముందు అరుదైన కలయిక..ఈ 4 రాశుల దశ, దిశ మారనుంది! -
కోల్కతా ఫేమస్ టాంగ్రా డ్రై చిల్లీ చికెన్.. డ్రింక్స్ టైమ్ కి కూడా సూపరో సూపర్..ఎలా చేసుకోవాలంటే.. -
ఇన్ స్టాగ్రామ్ లో అమ్మను బ్లాక్ చేసిన ఇన్ఫ్లుయెన్సర్ ..దొంగచాటుగా కూతురి వీడియోలు చూసి తల్లి.. -
అయ్యంగార్ స్టైల్ కొబ్బరిపాల రసం.. అమృతంలా ఉంటుంది! -
ప్రొటీన్ పుష్కలం, పోషకాలు పదిలం.. బిర్యానీ రుచిని తలదన్నే శనగల పులావ్.! -
ఏళ్ల కష్టానికి ప్రతిఫలం.. రానున్న రోజులు ఈ ఐదు రాశుల వారికి సువర్ణాధ్యాయం.! -
విదేశీయుడి నోట హనుమాన్ చాలీసా.. వీడియో చూస్తే నోరెళ్లబెట్టకుండా ఉండలేరు.! -
మధ్యాహ్నం వంట చేసే టైం లేదా.. ఎనర్జీనిచ్చే కాలీఫ్లవర్ రైస్.. సులభంగా, టేస్టీగా ఇలా చేయండి.!
డౌన్ సిండ్రోమ్ తో బాధపడుతున్న ఒక ఏడేళ్ల బాలిక ప్రతిభను ఏమని పొగడాలి?
డౌన్ సిండ్రోమ్ తో బాధపడుతున్న ఒక ఏడేళ్ల బాలిక ప్రతిభను ఏమని పొగడాలి?
పుట్టుకతో డౌన్ సిండ్రోమ్ కలిగిన ఒక ఏడేళ్ల బాలిక, పిల్లల మోడలింగ్ ను తన వృత్తిగా మలచుకుని విజయపథంలో నడుస్తోంది అంటే మీరు నమ్మగలరా?
ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది చెషైర్ కు చెందిన గ్రేస్ ఇసాబెల్లా వార్టన్. గత సంవత్సరం ఆమె ఒక సంస్థతో కలసి పని చేయడానికి ఒప్పందంపై సంతకం చేసింది మరియు డిస్నీ మరియు సిబీబీస్ ల మోడలింగ్ ఉత్పత్తులు కొన్నింటికి ఇప్పటికే పని చేసింది.
ఈ పాఠశాల వయస్సులోని చిన్నారి, 'బిహైండ్ ది స్కార్స్'గా పిలవబడే ఒక వైవిధ్యతా ప్రచారంలో కూడా నటించింది. ఇంస్టాగ్రామ్ లో ఈమెకు వెయ్యి మందికి పైగా అనుచరులు ఉన్నారు.
ఒక వ్యక్తి జీవితంలోని కనీస ప్రాధమిక అంశాలను గణనీయంగా ప్రభావితం చేసే డౌన్ సిండ్రోమ్ తో జన్మించినప్పటికీ, ఆమె తన తల్లిదండ్రులయిన చెరిల్ మరియు జాన్ వార్టన్ సహాయంతో, డౌన్ సిండ్రోమ్ తన జీవితాన్ని శాసించకుండా తీర్చిదిద్దుకుంది.

కెమెరా ముందు గ్రేస్, తనను తాను ఒక ముగ్ధమనోహరమైన బాలికగా మలచుకుంటుంది. గ్రేస్ గురించి ఆమె తల్లి ఇలా వెల్లడిస్తుంది: "ఆమె చాలా ఆకర్షణీయమైనదని మరియు కెమెరా ముందు పోజులివ్వడాన్ని ప్రేమిస్తుందని ప్రతి ఒక్కరూ అంటారు. ఆమెకు క్యాట్ వాక్ ప్రదర్శనలంటే తగని మక్కువ".
గ్రేస్ తల్లి చిన్నతనం నుండి, గ్రేస్ ఇతరులు ధ్యాస తనపై నిలపాలని కోరుకోవడం మరియు కెమెరా ముందు నిలిచి ఉండటాన్ని ఆమె ప్రేమించడం, గమనించింది. అప్పటి నుండి గ్రేస్ కు వెనుతిరిగి చూడవలసిన అవసరం రాలేదు. ఆమె కెమెరా ముందుకు వచ్చిన ప్రతిసారీ, ఆమెలోని ఆత్మవిశ్వాసం మరియు చిరునవ్వు పుంజుకుంటాయి .
దీనితో పాటుగా, గ్రేస్ తన పాఠశాలలో కూడా మంచి ప్రతిభ కనపరుస్తుంది. తన తరగతిలోని అత్యంత ప్రసిద్ధ విద్యార్థులలో ఆమె ఒకరు.



Click it and Unblock the Notifications
