పాజిటివ్ ఆలోచ‌న‌లు క‌లిగి ఉన్న‌వారేం చేస్తారంటే...

Posted By: sujeeth kumar
Subscribe to Boldsky

హ్యాపీగా, పాజిటివ్ గా ఉండేందుకు కొన్ని విష‌యాల‌ను ప‌ట్టించుకోవ‌ద్దు. అలా చేస్తే చుట్టూ ప్ర‌తికూల ప్ర‌భావం పెరుగుతుంది.

పాజిటివ్ దృక్ప‌థం ఉన్న‌వాళ్లు కొన్ని ప‌నులు అస్స‌లు చేయ‌రు. ఇలా చేయ‌డం మూలానే వారు నెగెటివ్ ఆలోచ‌న‌ల నుంచి దూరంగా ఉండ‌గ‌లుగుతారు.

జీవితంలో పాజిటివ్ భావ‌న‌ల‌తో ఉండాలంటే కొన్ని ర‌కాల ప‌నుల‌ను చేయ‌కుండా ఉండాలి. అవేమిటో మీకు మేము చెప్ప‌బోతున్నాం.

పాజిటివ్ ఆలోచ‌న‌ల‌తో ఉండేవారు ఎలా ఉంటారో చూద్దాం..

ప‌గ ప్ర‌తీకారం పెట్టుకోరు..

ప‌గ ప్ర‌తీకారం పెట్టుకోరు..

ప‌గ‌లు, ప్ర‌తీకారం పెట్టుకోవ‌డం వ‌ల్ల బాధ, దుఖ‌మే మిగులుతుంది. దీనికి బ‌దులుగా వాటిని మ‌ర్చిపోయి జీవితంలో ముందుకు సాగాలి. త‌ద్వారా ప్ర‌తికూల ఛాయ‌లు ద‌రిచేర‌నీయ‌కుండా ఉండ‌గ‌లుగుతాం.

తొంద‌ర‌ప‌డి నిర్ణ‌యం తీసుకోరు...

తొంద‌ర‌ప‌డి నిర్ణ‌యం తీసుకోరు...

పాజిటివ్ ఆలోచ‌న‌లు క‌లిగిన‌వారు ఏ విష‌యానికైనా తొంద‌ర‌ప‌డి నిర్ణ‌యం తీసుకోరు. ఎలాంటి సందిగ్ధ సంద‌ర్భ‌మైనా నిదానంగా వేచిచూస్తారు త‌ప్ప అన‌వ‌స‌ర హైరానా ప‌డ‌రు. ప‌త‌నం ఉంటుంద‌ని ఊహించ‌రు. ఒక వ్య‌క్తి న‌మ్మ‌క ద్రోహి అని నిర్ధారించుకునేందుకు అత‌డి గురించి బాగా వాక‌బు చేస్తారు.

నిజాన్ని నిర్భ‌యంగా ఎదుర్కొంటారు...

నిజాన్ని నిర్భ‌యంగా ఎదుర్కొంటారు...

సానుకూల ఆలోచ‌న‌లు క‌లిగిన‌వారు నిజాన్ని నిర్భ‌యంగా ఎదుర్కోవాల్సి ఉంటుంద‌న్న విష‌యం వారికి తెలిసి ఉంటుంది. అబ‌ద్ధాల‌తో వారు జీవించ‌లేరు. త‌ప్పించుకునే మార్గాల‌ను అన్వేషించ‌డం వ‌ల్ల స‌మ‌స్య‌కు ప‌రిష్కారం దొర‌క‌దు అని వారికి తెలుసు.

స‌మ‌స్య‌ల‌ను స‌మ‌స్య‌ల్లా చూడ‌రు

స‌మ‌స్య‌ల‌ను స‌మ‌స్య‌ల్లా చూడ‌రు

స‌మ‌స్య‌ల‌ను స‌వాళ్లుగా చూస్తారు. వ‌చ్చే ప్ర‌తి ఆటంకం ఒక అవ‌కాశంగా భావిస్తారు. ప్ర‌తి దాన్ని స‌వాలుగా తీసుకొని జీవితాన్ని మెరుగుప‌ర్చుకోవాల‌ని చూస్తారు.

ఎప్ప‌టికీ బోర్ కొట్ట‌రు

ఎప్ప‌టికీ బోర్ కొట్ట‌రు

ప్ర‌తి దానికి విస్మ‌యం చెందుతారు. ప్ర‌పంచాన్ని ప‌రిశోధించేందుకు ప్ర‌య‌త్నిస్తారు. పాజిటివ్ ఆలోచ‌న‌లు క‌లిగిన‌వారికి క్యూరియాసిటీ ఎక్కువ‌. వాళ్ల చుట్టూ ఉన్న‌వారిని బిజిగా ఉంచుతారు. ర‌క‌ర‌కాల ప్ర‌శ్న‌ల‌తో వారిని ఆక‌ట్టుకుంటారు.

నెగెటివ్ ఆలోచ‌న‌లు ద‌రిచేర‌నివ్వ‌రు..

నెగెటివ్ ఆలోచ‌న‌లు ద‌రిచేర‌నివ్వ‌రు..

నెగెటివ్ ఆలోచ‌న‌లు, ప‌నులను ద‌రిచేర‌నివ్వ‌రు. ఏదైనా ప్ర‌తికూల ఛాయలు మ‌దిలోకి వ‌స్తే దాన్ని వెంట‌నే తుడిచేసే పాజిటివ్ ఆలోచ‌న‌లు చేస్తారు.

ఇత‌రుల‌తో పోల్చి చూసుకోరు!

ఇత‌రుల‌తో పోల్చి చూసుకోరు!

పాజిటివ్ గా ఉన్న‌వాళ్లు ప్ర‌తి ఒక్క‌రూ విభిన్నంగా ఉంటార‌నే విష‌యాన్ని అర్థం చేసుకొని త‌మ సొంత అభివృద్ధిపై దృష్టి పెడ‌తారు. అంతే త‌ప్ప ఇత‌రుల‌తో పోల్చి చూసుకోరు. వారిపై వారికి పూర్తి న‌మ్మ‌కం ఉంటుంది. ఏం చేయాలో, ఎప్పుడు చేయాలో వారికి బాగా తెలుసు. ఇత‌రులు ఎలా చేస్తారో అన్న దానిపై దృష్టి పెట్ట‌రు.

చెడ్డ‌వాళ్లు వారిచుట్టూ ఉండ‌రు!

చెడ్డ‌వాళ్లు వారిచుట్టూ ఉండ‌రు!

చెడ్డ వాళ్లు పాజిటివ్ ఆలోచ‌న‌లు క‌లిగిఉన్న‌వారి చుట్టుప‌క్క‌ల క‌నిపించ‌రు. నెగెటివ్‌గా ఉన్న‌వారి నీడ కూడా తాక‌నీయ‌రు. దీనికి బ‌దులుగా ఇత‌ర పాజిటివ్ ఆలోచ‌న‌లు క‌లిగిన‌వారితో స‌ఖ్య‌త పెంచుకుంటారు. వారి నుంచి ఆద‌ర్శాల‌ను గ్ర‌హిస్తారు.

ఇలాంటి మ‌రిన్ని స్పూర్తిదాయ‌క క‌థ‌నాలు చ‌దివేందుకు ఆస‌క్తి ఉందా.. అయితే మా సెక్ష‌న్‌ను ప‌రిశీలిస్తూ ఉండండి.

English summary

This Is What Positive People Avoid Doing

Do you know that there are certain things that positive people completely avoid doing? These are the things that will help them stay away from negativity and stay happy.
Story first published: Wednesday, February 7, 2018, 13:00 [IST]