For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

డిసెంబర్ నెలలో మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూడండి...

|

తమ భవిష్యత్తు గురించి తెలుసుకోవాలనే కుతుహాలం ప్రతి ఒక్కరికీ ఉంటుంది. అందుకే చాలా మంది మనలో దిన ఫలాలు, వారఫలాలు, మాస ఫలాలను తెలుసుకోవడానికి ఎంతో ఆసక్తి చూపుతుంటారు. వారి రాశి చక్రాలకు సంబంధించిన గ్రహాలను బట్టి మార్పులను గమనించి ఏయే రాశి వారికి ఎలా ఉంటుందో అంచనా వేస్తారు. ఇలా రాశి ఫలాల అంచనా వేయడం వల్ల తమకు వస్తున్న సమస్యలను, వాటిని అధిగమించేందుకు పరిష్కార మార్గాలను అన్వేషించవచ్చు.

December 2019

మనకు రాబోయే అడ్డంకులను అధిగమించేందుకు, అందుకు అనుగుణంగా వ్యవహరించవచ్చు. కాబట్టి డిసెంబర్ 2019 రాశి ఫలాలను చూడటం ద్వారా మీ భవిష్యత్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోండి..! ఇలాంటి అంచనాలన్నీ వేద జ్యోతిష శాస్త్రంపై ఆధారపడి ఉంటాయి. మీ జీవితానికి సంబంధించి ఉద్యోగం, వ్యాపారం, సంపద, విద్య మరియు ఆరోగ్యం వంటి వివిధ అంశాలను గురించి తెలుసుకోండి . మరి ఆలస్యం చేయకుండా డిసెంబర్ మాసంలో ఏయే రాశుల వారికి అత్యంత అనుకూలంగా ఉండబోతుందో ఇప్పుడు చూద్దాం...

మేష రాశి : మార్చి 21 - 19 ఏప్రిల్

మేష రాశి : మార్చి 21 - 19 ఏప్రిల్

ఈ రాశి వారికి ఈ నెలలో ఆర్థిక విషయంలో ప్రతికూలంగా ఉంది. అందువల్ల లాభనష్టాల విషయంలో అదనపు జాగ్రత్త వహించాలి. మీరు ఒకరికి రుణాలు ఇచ్చినా లేదా ధనం తీసుకున్నా రెండు సందర్భాల్లోనూ దాని వల్లే మీకే ఇబ్బంది కలుగుతుంది. మీరు ఈ నెలలో ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొనే అవకాశం ఉన్నందున విశ్రాంతి కోసం ఎక్కువగా ఖర్చు చేయడం మానుకోండి. వివాహ జీవిత విషయానికొస్తే, దంపతుల మధ్య కొన్ని వివాదాలు రావచ్చు. ముఖ్యంగా ప్రారంభ రోజుల్లో ప్రేమ, సాన్నహిత్యం వంటి విషయాలకు సంబంధించి ప్రతిదీ సాధారణంగా ఉంటుంది. మీరు మీ రిలేషన్ షిప్ ను బలపరచుకోవాలి అనుకుంటే, పరిస్థితి అనుకూలంగా ఉండదు. మీరు కొంచెం వెయిట్ చేయాలి. ప్రారంభ వారంలో ఉద్యోగులకు అనుకూలంగానే ఉంటుంది. కానీ నెల మధ్యలో కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. ఆ సమయంలో పని భారం ఎక్కువగా ఉంటుంది. కడుపుకు సంబంధించి కొన్ని సమస్యలను ఎదుర్కోవచ్చు.

అనుకూల పంచభూతం : అగ్ని

అనుకూల గ్రహం : అంగారకుడు

లక్కీ నంబర్లు : 22, 34, 45, 52, 66

లక్కీ డేస్ : బుధవారం, ఆదివారం, మంగళవారం, శుక్రవారం

లక్కీ కలర్స్ : బ్రౌన్, పింక్, వైట్, బ్లూ

వృషభ రాశి : ఏప్రిల్ 20 - మే 20

వృషభ రాశి : ఏప్రిల్ 20 - మే 20

ఈ రాశి వారిలో ఉద్యోగులకు ఈ నెల కార్యాలయంలో పని ఒత్తిడి పెరుగుతుంది. దీంతో వారంతా ఆందోళనకు గురవుతారు. సీనియర్ మీ పని పట్ల సంతృప్తి చెందకపోవచ్చు. మీ పట్ల వారి వైఖరి ప్రతికూలంగా ఉంటుంది. అది మిమ్మల్ని కలవరపెడుతుంది. మీరు వ్యాపారం చేస్తే, మీ భాగస్వామితో ఎలాంటి గొడవలను పెట్టుకోకండి. ఇది మీ పనిపై చెడు ప్రభావాన్ని చూపుతుంది. ఈ నెలలో ఆర్థిక పరంగా కొంత నష్టాలు సహజమే. కాబట్టి మీరు ప్రతి నిర్ణయాన్ని చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. నెల మధ్యలో, మీరు మీ వ్యాపారాన్ని విస్తరించడానికి ఎక్కువగా ఖర్చు చేయవచ్చు. అయితే, మీరు మీ బడ్జెట్‌కు మించి ఎక్కువగా ఖర్చు చేయకూడదు. వివాహ జీవితంలో మీ జీవిత భాగస్వామితో మీ సాన్నిహిత్యం పెరుగుతుంది. అయితే ఈ నెల ప్రారంభంలో కొన్ని ఆరోగ్య సమస్యలు ఉండవచ్చు.

అనుకూల పంచభూతం: భూమి

అనుకూల గ్రహం: శుక్రుడు

లక్కీ నంబర్లు: 12, 27, 33, 49, 51, 66

లక్కీ డేస్: బుధవారం, గురువారం, ఆదివారం, మంగళవారం

లక్కీ కలర్స్ : బ్లూ, పసుపు, తెలుపు, గ్రీన్

మిధున రాశి : మే 21 - జూన్ 20

మిధున రాశి : మే 21 - జూన్ 20

ఈ రాశి వారికి ఈ నెలలో కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. మీరు మీ కుటుంబ సభ్యులతో బయటకు వెళ్ళవచ్చు. మీరు మీ జీవిత భాగస్వామితో ఆనందకరమైన సమయాన్ని కూడా గడుపుతారు. ఇది మీ సంబంధాన్ని మరింత బలపరుస్తుంది. అయితే, శృంగార జీవితంలో, మీ భాగస్వామితో పెరుగుతున్న అపార్థాల వల్ల మీరు ఒత్తిడితో కూడిన పరిస్థితులను ఎదుర్కొంటారు. మీరు చిన్న విషయాలపై తమను తాము అనుమానించడం మానుకోవాలి. లేకపోతే మీరిద్దరూ విడిపోవచ్చు. ఈ నెలలో మీకు ఆర్థికంగా ఎలాంటి అవరోధాలు ఉండవు. ఈ నెలలో కొత్త వాహనం కొనుగోలు చేసే అవకాశం కూడా ఉంది. మీరు కార్యాలయంలో బాగా అభివృద్ధి చెందుతారు. మీ సానుకూల ఆలోచన మరియు కృషితో విజయం సాధిస్తారు. ఉద్యోగులు మరియు వ్యాపారస్తులకు సానుకూల ఫలితాలు వస్తాయి. ఈనెలలో మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి.

అనుకూల పంచభూతం : గాలి

అనుకూల గ్రహం: బుధుడు

లక్కీ నంబర్లు : 2, 8, 22, 39, 47, 51

లక్కీ డేస్ : మంగళవారం, సోమవారం, శనివారం, బుధవారం

లక్కీ కలర్స్: లైట్ గ్రీన్, స్కై బ్లూ, క్రీమ్, వైట్

కర్కాటక రాశి : జూన్ 21 - జూలై 22

కర్కాటక రాశి : జూన్ 21 - జూలై 22

ఈ రాశి వారు ఈ నెలలో ముఖ్యమైన నిర్ణయాలు చాలా జాగ్రత్తగా తీసుకుంటారు, ఇది మీకు ఆశించిన ఫలితాన్ని ఇస్తుంది. మానసికంగా, మీరు చాలా బలంగా ఉంటారు. మీ అన్ని ప్రయత్నాలలో విజయం సాధిస్తారు. మీరు మీడియా, కళ మరియు దిగుమతి-ఎగుమతి నేపథ్యం నుండి వచ్చినట్లయితే, ఈ నెలలో మీరు చాలా లాభాలను పొందవచ్చు. ఇది కాకుండా, మీరు ఏదైనా కొత్త వ్యాపారాన్ని ప్రారంభించినట్లయితే, మీరు మంచి లాభాలు పొందవచ్చు. ఉద్యోగులు తమ సీనియర్లతో మంచి సంబంధాలు పెట్టుకోవాలి. ఏదైనా చర్చ సమయంలో, మీరు ఆత్మవిశ్వాసంతో ఉండాలి. అతిగా మాట్లాడటం మానుకోవాలి. ఈ నెలలో ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. మీరు ఏదైనా కొత్త ఆస్తికి సంబంధించి షాపింగ్ చేయవచ్చు. వివాహ జీవితంలో సమస్యలు పరిష్కారమయ్యే అవకాశం ఉంది. మీ ఇద్దరి మధ్య అవగాహన పెరుగుతుంది. ఆరోగ్య విషయాలలో అజాగ్రత్తగా ఉండడం మానుకోండి.

అనుకూల పంచ భూతం : నీరు

అనుకూల గ్రహం: చంద్రుడు

లక్కీ నంబర్లు: 6, 9, 20, 33, 49, 56

లక్కీ డేస్ : సోమవారం, శుక్రవారం, మంగళవారం, గురువారం

లక్కీ కలర్స్: పసుపు, పింక్, బ్లూ, గ్రీన్

సింహ రాశి : జులై 23 - ఆగస్టు 22

సింహ రాశి : జులై 23 - ఆగస్టు 22

ఈ రాశి వారి ఉద్యోగులు ఈ నెలలో కార్యాలయంలో ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోవచ్చు. మానసిక ఒత్తిడి కారణంగా, మీరు మీ పనిపై దృష్టి పెట్టలేకపోవచ్చు. మీరు మీ పనులను సకాలంలో నిర్వహించక పోవడం వల్ల సమస్యలు పెరుగుతాయి. ఈ నెల మధ్యలో మీకు కొద్దిగా ఉపశమనం లభిస్తుంది. మీరు చేసే ఏ ప్రయత్నంలోనైనా విజయం సాధించడం చాలా సంతోషంగా ఉంటుంది. మీ ఆదాయం పెరిగే అవకాశం ఉంది. మీ పనిని విస్తరించడానికి వ్యాపారవేత్తలు కొంత పెద్ద డబ్బు ఖర్చు చేయవచ్చు. వ్యక్తిగత జీవితంలో కొన్ని సమస్యలు ఎదురుకావచ్చు. మీ వివాహ జీవితంలోనూ పరిస్థితులు ప్రతికూలంగా ఉంటాయి. ఇది మీ ఇద్దరి మధ్య దూరాన్ని కలిగిస్తుంది. ఈ నెల చివరిలో, మీరు పాత స్నేహితులతో కలిసి విహారయాత్రకు వెళ్ళవచ్చు. ఇది మీ ఒత్తిడిని చాలా వరకు తగ్గిస్తుంది.

అనుకూల పంచభూతం: అగ్ని

అనుకూల గ్రహం: సూర్యుడు

లక్కీ నంబర్లు: 1, 8, 11, 26, 37, 44

లక్కీ డేస్ : ఆదివారం, మంగళవారం, శుక్రవారం, గురువారం, బుధవారం

లక్కీ కలర్స్: లైట్ ఎల్లో, క్రీమ్, స్కై బ్లూ, గ్రీన్, మెరూన్

కన్య రాశి : ఆగస్టు 23 - సెప్టెంబర్ 22

కన్య రాశి : ఆగస్టు 23 - సెప్టెంబర్ 22

ఈ రాశి వారు ఈ నెలలో పని విషయంలో చాలా ఉత్సాహంగా ఉంటారు. ఉద్యోగులు ఈ నెలలో పెద్ద విజయాన్ని సాధించవచ్చు. ప్రమోషన్ తో పాటు వేతనం పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. మీరు పనికి సంబంధించి విదేశాలకు వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది. ఈ నెలలో వ్యాపారులకు కూడా అనుకూలంగా ఉంటుంది. కుటుంబ జీవితంలో ఆనందం మరియు శాంతి ఉంటుంది. మీ తల్లిదండ్రులు మీ గురించి చాలా గర్వంగా భావిస్తారు. ఈ నెలలో పెండింగులో ఉన్న అన్ని పనులను పూర్తి చేయడానికి మీ వంతు ప్రయత్నం చేస్తారు. నెల మధ్యలో మీకు చాలా అదృష్టంగా ఉంటుంది. మీ దీర్ఘకాల ప్రయత్నాలలో మీరు విజయం సాధించవచ్చు. ఇది మాత్రమే కాదు, ఈ కాలంలో మీరు సామాజిక పనిలో పాల్గొనవచ్చు. ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. మీరు ఈ నెలలో మంచి ఆరోగ్యాన్ని పొందుతారు.

అనుకూల పంచభూతం: భూమి

అనుకూల గ్రహం: బుధుడు

లక్కీ నంబర్లు: 4, 9, 18, 25

లక్కీ డేస్ : మంగళవారం, శుక్రవారం, శనివారం, సోమవారం

లక్కీ కలర్స్: బ్రౌన్, ఎల్లో, డార్క్ రెడ్, బ్లూ

తుల రాశి: సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

తుల రాశి: సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

ఈ రాశి వారికి ఈ నెలలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అయితే నెల ప్రారంభంలో మీకు కష్టాలు ఎదురవుతాయి. అయితే మీరు సంయమనంతో ఉండాలి. ముఖ్యంగా కుటుంబ విషయాలలో న్యాయంగా ఉండాలి. సరైన నిర్ణయాలు తీసుకోవాలి. కుటుంబ సభ్యుల మధ్య కొన్ని తేడాలు సహజమే. కోపం, అహం వంటి ప్రతికూల భావోద్వేగాలకు దూరంగా ఉండాలని మీకు పెద్దలు సలహా ఇస్తారు. మీరు వ్యాపారం చేస్తే ఈ నెల మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. చట్టపరమైన విషయాన్ని పరిష్కరించడం ద్వారా మీకు ఉపశమనం లభిస్తుంది. ఈ నెల విద్యార్థులకు కూడా మంచిది. మీరు మీ అధ్యయనాలపై పూర్తి శ్రద్ధ చూపుతారు. కొత్తదాన్ని నేర్చుకోవడానికి కూడా ప్రయత్నిస్తారు. వివాహ జీవితంలో ఒడిదుడుకులు ఉండచ్చు. శృంగార జీవితం గురించి మాట్లాడుతుంటే, మీరు భాగస్వామి కోసం చూస్తున్నట్లయితే, ఈ నెలలో మీరు ఎవరినైనా ఆకర్షించవచ్చు. ఆర్థిక విషయంలో ఈ నెలలో జాగ్రత్తగా ఉండండి. ఎక్కువ సేపు ఖాళీ కడుపుతో ఉండటం వల్ల కొన్ని ఇబ్బందులు తలెత్తవచ్చు. కాబట్టి ఆరోగ్య విషయాలు గందరగోళంలో పడతాయి.

అనుకూల పంచభూతం : గాలి

అనుకూల గ్రహం: శుక్రుడు

లక్కీ నంబర్లు : 7, 10, 12, 24, 35, 44, 58

లక్కీ డేస్ : సోమవారం, బుధవారం, మంగళవారం, ఆదివారం

లక్కీ కలర్స్: ఆరెంజ్, పర్పుల్, బ్రౌన్, డార్క్ రెడ్

వృశ్చికం: అక్టోబర్ 23 - నవంబర్ 21

వృశ్చికం: అక్టోబర్ 23 - నవంబర్ 21

ఈ రాశి వారు ఈ నెలలో స్నేహితులతో కలిసి ఆనందించడానికి గొప్ప అవకాశం పొందవచ్చు. ప్రేమికులకు ఈ నెలలో ప్రత్యేకంగా ఉంటుంది. మీరు ఒంటరిగా ఉంటే, మీరు తొలి చూపులోనే ప్రేమలో పడే వారిని కలవొచ్చు. వివాహిత జంటలకు కూడా ఈ నెల శృంగార భరితంగా ఉంటుంది. పని విషయంలో ఉన్నతాధికారుల నుండి మద్దతు లేకపోవడం వల్ల కష్టంగా ఉంటుంది. అలాంటి పరిస్థితి ఎక్కువ కాలం ఉండదు. అయితే, మీ కృషి గురించి త్వరలో మీ సీనియర్లకు తెలుస్తుంది. అది వారి హృదయాలను గెలుచుకుంటుంది. వ్యాపారులకు కూడా సమయం సరైనది. మీరు ఈ నెల మంచి లాభం ఆశించవచ్చు. ఆర్థిక రంగంలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. మీ ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యంగా ఉండకండి.

అనుకూల పంచభూతం : నీరు

అనుకూల గ్రహాలు: అంగారక మరియు ఫ్లూటో

లక్కీ నంబర్లు : 2, 15, 26, 37, 49, 56

లక్కీ డేస్ : ఆదివారం, శనివారం, గురువారం, మంగళవారం

లక్కీ కలర్స్ : ఎల్లో, మెరూన్, డార్క్ గ్రీన్, బ్లూ

ధనుస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ధనుస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ఈ రాశి వారు ఈ నెలలో కొత్త పనిని మొదలు పెట్టాలనుకుంటే, మీ మనసు నుండి అన్ని ప్రతికూల ఆలోచనలను తొలగించండి. ముందుగా మీ విశ్వాసాన్ని బలోపేతం చేసుకోండి. మీరు కచ్చితంగా విజయం సాధిస్తారు కాబట్టి కష్టపడండి. పని విషయంలో మీకు కొన్ని మంచి అవకాశాలు లభిస్తాయి. మీ లక్ష్యాన్ని చేరుకోవడానికి చాలా పని ఒత్తిడి ఉండవచ్చు. కానీ మీరు మీ అన్ని ప్రయత్నాలలో విజయం సాధించగలుగుతారు. అయితే, ఒత్తిడి పెరగడం మిమ్మల్ని చికాకు పెడుతుంది. మీ కోపాన్ని పెంచుతుంది. మీ ప్రవర్తనను నియంత్రించమని మీకు సలహా ఇస్తారు. కుటుంబసభ్యులతో కొన్ని వివాదాల కారణంగా, ఇంటి వాతావరణం సరిగ్గా ఉండదు. మీరు ప్రశాంతమైన మనస్సుతో ప్రతి ఒక్కరి ముందు మీ వైపు ఉంచడం మంచిది. మీ కుటుంబం మీ దృష్టి కోణాన్ని కచ్చితంగా అర్థం చేసుకుంటుంది. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. నెల ప్రారంభంలో మంచి ప్రయోజనాలను పొందవచ్చు, కానీ తరువాత ఖర్చులు పెరిగి మీ ఆందోళనను పెంచుతాయి. ఈ నెల మీరు శారీరకంగా మరియు మానసికంగా బాధపడతారు.

అనుకూల పంచభూతం: అగ్ని

అనుకూల గ్రహం: బృహస్పతి

లక్కీ నంబర్లు : 2, 8, 13, 18, 29, 33, 45

లక్కీ డేస్: శుక్రవారం, బుధవారం, సోమవారం, ఆదివారం

లక్కీ కలర్స్: ఎరుపు, ఆకుపచ్చ, పింక్, నీలం, వైట్

మకర రాశి : డిసెంబర్ 22- జనవరి 19

మకర రాశి : డిసెంబర్ 22- జనవరి 19

ఈ రాశి వారికి ఈ నెల చాలా ముఖ్యమైనది. మీరు చాలా తీవ్రమైన సమస్యలను పరిష్కరించగలుగుతారు. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవచ్చు, ఇది మీకు అనుకూలంగా ఉంటుంది. పని విషయంలో మీరు మంచి పురోగతి సాధిస్తారు. మీ కృషి యొక్క సరైన ఫలితాలను పొందుతారు. మీరు అదే విధంగా పనిచేస్తే, మీ ప్రమోషన్ పొందుతారు. అలాగే విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారులకు కూడా ఈనెల అనుకూలంగా ఉంటుంది. మీ పని చాలా వేగంగా ముందుకు సాగుతుంది. కుటుంబంలో ఆనందం మరియు శాంతి ఉంటుంది. కుటుంబ సభ్యులతో మీ సంబంధాలు మెరుగుపడతాయి. మీరు మీ జీవిత భాగస్వామికి ఆశ్చర్యం కలిగించవచ్చు. మీ పిల్లల వైపు నుండి ఆనందం కూడా ఉంటుంది. మీరు విద్యార్థి అయితే, మీరు ఈ నెలలో పరధ్యానంలో ఉన్నట్లు అనిపించవచ్చు.

అనుకూల పంచభూతం: భూమి

అనుకూల గ్రహం: శని

లక్కీ నంబర్లు : 2, 6, 16, 20, 36, 41, 55

లక్కీ డేస్ : శుక్రవారం, బుధవారం, శనివారం, సోమవారం

లక్కీ కలర్స్: పసుపు, మెరూన్, క్రీమ్, పర్పుల్, ఆరెంజ్

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

ఈ రాశి వారికి ఈ నెలలో కొత్త వ్యక్తి మీ జీవితంలోకి రావచ్చు. వారు మీకు మానసికంగా చాలా బాగా కనెక్ట్ అవుతారు. మీ శృంగార జీవితంలో ప్రేమ, ఉత్సాహం, అభిరుచి మరియు ఆనందం ఉంటుంది. మీ సంబంధం బలంగా ఉంటుంది. మీ భాగస్వామి కూడా పెళ్లికి మిమ్మల్ని ప్రతిపాదించవచ్చు. అవివాహితుల కోసం ఈ నెలలో చాలా మంచి వివాహ ప్రతిపాదనలు రావచ్చు. కెరీర్‌లో పురోగతి కూడా ఆశిస్తారు. మీరు ఉద్యోగం మరియు వ్యాపారంలో సరైన ఫలితాలను పొందుతారు. ఉద్యోగులకు వారి సీనియర్ల నుండి పూర్తి మద్దతు లభిస్తుంది. వ్యాపారులు ఈ నెలలో అనేక చిన్న పర్యటనలు చేయాల్సి రావొచ్చు. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. ఆర్థిక పరంగా ఈ నెల అనుకూలంగా ఉంటుంది. ఈ కాలంలో మీరు కూడా పెద్ద పెట్టుబడి పెట్టవచ్చు. మీరు మంచి ఆరోగ్యాన్ని ఆస్వాదించాలనుకుంటే, మీరు అధిక పనిభారం తీసుకోకుండా ఉండాలి.

అనుకూల పంచభూతం : గాలి

అనుకూల గ్రహాలు: యురేనస్ మరియు శని

లక్కీ నంబర్లు : 3, 4, 7, 14, 17, 28, 31, 49, 57

లక్కీ డేస్ : ఆదివారం, శుక్రవారం, బుధవారం, శనివారం

లక్కీ కలర్స్: స్కై బ్లూ, పింక్, బ్లూ, ఎల్లో, డార్క్ రెడ్

మీన రాశి: ఫిబ్రవరి 19 - మార్చి 20

మీన రాశి: ఫిబ్రవరి 19 - మార్చి 20

ఈ రాశి వారు ఈ నెలలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరినైనా గుడ్డిగా నమ్మకూడదు. కొత్త నియామకం కారణంగా ఉద్యోగులు కూడా ఈ నెలలో చాలా ఒత్తిడిని ఎదుర్కొంటారు. మీరు సంతోషకరమైన వైవాహిక జీవితాన్ని పొందాలనుకుంటే, మీరు మీ జీవిత భాగస్వామి భావాలను అర్థం చేసుకోవాలి. చిన్న విషయాలపై గొడవలు పెట్టుకోవడం మీ ఇద్దరికీ మంచిది కాదు. ప్రేమగల జంటలకు సమయం సాధారణంగా ఉంటుంది. ఈ కాలంలో మీ సంబంధాన్ని ముందుకు తీసుకెళ్లాలని, దాని గురించి మీ కుటుంబ సభ్యులతో మాట్లాడాలని, మీరు ఇద్దరూ నిర్ణయించుకోవచ్చు. ఈ నెలలో ఆర్థిక పరిస్థితులు బాగుండవు. మీరు పెద్ద ప్రణాళికలో పని చేస్తుంటే, మీ నిర్ణయం ఆలోచనాత్మకంగా తీసుకోండి. ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండండి.

అనుకూల మూలకం: నీరు

అనుకూల గ్రహాలు: నెప్ట్యూన్, బృహస్పతి

లక్కీ నంబర్లు : 5, 16, 25, 34, 46, 58

లక్కీ డేస్ : బుధవారం, సోమవారం, శనివారం, ఆదివారం

లక్కీ కలర్స్: వైట్, పింక్, స్కై బ్లూ, బ్రౌన్

English summary

December 2019 Monthly Horosocope in Telugu

Soon we are going to say goodbye to 2019 and welcome the year 2020. As the last month of the year will pass, read your monthly horoscope to know how it will be.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more