For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఇంటరాక్టివ్ గా ఉంటే మనల్ని ఎవ్వరూ ఇష్టపడరా? సైలెంట్ గా ఉంటేనే ఇష్టపడతారా?

అంతర్ముఖులు (ఇంట్రోవర్ట్స్) లేదా సైలెంట్ గా ఉండే వ్యక్తులు నిశ్చలంగా ఉంటారు. ప్రశాంతంగా ఉత్తేజభరితమైన వాతావరణంలో సుఖంగా ఉంటారు.

|

ప్రస్తుత కాలంలో ఇంటరాక్టివ్ గా ఉంటే మనల్ని ఎవ్వరూ ఇష్టపడరా అంటే అవుననే సమాధానం ఎక్కువగా వినిపిస్తోంది. ఎందుకంటే బహిర్ముఖులు (ఎక్స్ ట్రావర్ట్) వారి ఉనికిని చాలా తేలికగా చాటుకుంటారు. వారు కొత్త వ్యక్తులతో సులభంగా చేసేస్తారు. కొన్ని సమయాల్లో పరిస్థితులను కూడా అదుపులోకొ తెచ్చుకుని ఆధిపత్యం కూడా చెలాయిస్తారు.

Important Lessons Extroverts Can Always Learn From Introverts

అదే అంతర్ముఖులు (ఇంట్రోవర్ట్స్) లేదా సైలెంట్ గా ఉండే వ్యక్తులు నిశ్చలంగా ఉంటారు. ప్రశాంతంగా ఉత్తేజభరితమైన వాతావరణంలో సుఖంగా ఉంటారు. వారు తమ పరిసరాలను అత్యంత వేగంగా, చాలా ఎక్కువగా గమనిస్తారు. అనంతరం వారిలో వారే అనుభూతి చెందుతారు. కానీ అవేవీ సమాజానికి ముఖ్యమైనవి కావు. మీ స్నేహితులు మిమ్మల్ని విచిత్రమైన వారు అని మీరు అనుకోవచ్చు. అందుకే అంతర్ముఖుల నుండి బహిర్ముఖులు చాలా విషయాలను నేర్చుకోవాలి. అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

1) తక్కువగా మాట్లాడాలి..

1) తక్కువగా మాట్లాడాలి..

సైలెంట్ గా ఉండే వ్యక్తులు తమ చుట్టూ జరిగే సంఘటనలతో లేదా వ్యక్తులతో నేరుగా పాల్గొనరు. ఎప్పుడూ వెనుక భాగంలో ఉంటారు. సంక్షిప్తంగా వింటారు. మంచిని మాత్రమే వింటారు. అంతేకాదు వారి చుట్టూ ఉన్న పరిసరాలను గమనించడానికి ఎక్కువగా ఇష్టపడతారు. బహిర్ముఖులు కూడా దీన్ని ఫాలో అవ్వాలి. వీలైనంత తక్కువగా మాట్లాడాలి. దీని ఇంటరాక్టివ్ అవ్వొద్దని అర్థం కాదు. వాస్తవాలపై వీరు

శ్రద్ధ చూపించాలి. బహిర్ముఖులు శ్రద్ధగా విషయాలను వినడం నేర్చుకోవాలి.

2) మీ సమయం మీకు ముఖ్యం..

2) మీ సమయం మీకు ముఖ్యం..

స్నేహితులు, మరియు ఇతర వ్యక్తులతో కలిసి తిరగడం కంటే కొంత సమయం మీకు మీరు కేటాయించుకోవడం మంచిది. సైలెంట్ గా ఉండే వారు ఈ సమయాన్ని మరింత ఆలోచనలు చేయడానికి, అన్వేషణలు చేయడానికి, వారి మనస్సులను చైతన్యం నింపుకోవడానికి ప్రయత్నిస్తారు. అనవసరమైన వ్యక్తులు మరియు టన్నుల సంఖ్యలో వచ్చే చెడు ఆలోచనల గురించి తమను తాము వేరు చేసుకుంటారు. అద్భుతమైన శక్తిని మరియు అంతర్గత శాంతిని పొందుతారు.

3) సానుకూలతను అన్వేషించండి..

3) సానుకూలతను అన్వేషించండి..

తమతో, అంతర్ముఖులతో సమయం గడపడం ద్వారా తమ స్థాయి సానుకూలతను అన్వేషించండి. ఓపెన్ గా ఉండే మీరు సైలెంట్ గా ఉండే వారి ఈ గుణాన్ని గ్రహించాలి. అంతేకాదు నేర్చుకోవాలి. వీలైతే ఇంట్రోవర్ట్స్ తో కొంత విలువైన సమయాన్ని గడపాలి. అంతర్గత శాంతిని, శక్తిని పొందాలి. ఇది మీకు తిరిగి ఉత్సాహాన్ని తిరిగి ఇవ్వొచ్చు. అంతేకాదు మీరు పుస్తకాలు కూడా చదవొచ్చు. లేదా నడకకు వెళ్లొచ్చు. గందరగోళం నుండి బయటపడటానికి ఇది మీకు అస్సలు సహాయం చేయదు. కానీ మీ కెరీర్ మరియు ఫ్యూచర్ గురించి ఆలోచించడానికి కూడా మీకు సహాయపడుతుంది.

4. ఆలోచించి మాట్లాడాలి..

4. ఆలోచించి మాట్లాడాలి..

అంతర్ముఖులు తమ అభిప్రాయాలను చెప్పే ముందు విషయాలను విశ్లేషించడానికి ఇష్టపడతారు. మంచి మాటలను, పదాలను ఎంచుకుంటారు. అంటే వారి ఆలోచనలను పంచుకుంటారని కాదు. అవి వారి మనసును తాకిన తర్వాత, అవి విలువైనవా కాదా అని విశ్లేషిస్తారు. వారు భరోసా పొందిన తర్వాతే వారు దానిని ఇతర వ్యక్తులతో పంచుకుంటారు. బహిర్మఖులు ఇది కూడా వారి నుండి నేర్చుకోవచ్చు. కాబట్టి ఎవరైనా మాట్లాడటానికి ముందు పరిణామాలను ఆలోచించడం మరియు విశ్లేషించడం మంచిది. లేదంటే తరువాత చింతించాల్సి వస్తుంది.

5) ప్రేరణ పొందాలి..

5) ప్రేరణ పొందాలి..

బహిర్ముఖులు బాహ్య వనరులు నుండి శక్తిని మరియు ప్రేరణను పొందినప్పటికీ, అంతర్ముఖులు లోపలి నుండి ప్రేరణను కనుగొంటారు.

స్నేహితులు, ప్రేరేపిత చర్చలు, ప్రసంగాలు మరియు ఇతరులు వంటి శక్తివంతమైన వనరులు అంతర్ముఖులకు ఉత్సాహంగా అనిపించాల్సిన అవసరం లేదు. ప్రజల నుండి తమను వేరు చేయడం ద్వారా మరియు వారి సొంత ఆలోచనలను అన్వేషించడం ద్వారా వారు ప్రేరణ మరియు ఆలోచనలను సహజ మార్గం పొందే అవకాశం వారికి ఉంది. వారిని ప్రేరేపించడానికి లేదా మార్గనిర్దేశనం చేయడానికి ఎవరూ లేనప్పటికీ, అంతర్ముఖులు మాత్రం సాధారణంగా డీమోటివేట్ చేయబరు. అదేవిధంగా, బహిర్ముఖులు కూడా స్వీయ ప్రేరణ పొందేందుకు ప్రయత్నించాలి.

6) అర్థవంతమైన సంబంధం కలిగి ఉండాలి..

6) అర్థవంతమైన సంబంధం కలిగి ఉండాలి..

అంతర్ముఖులు ప్రజలతో లోతైన మరియు అర్థవంతమైన సంబంధాన్ని కలిగి ఉంటారు. వారు పెద్ద సమూహంలోకి రావడం మరియు ప్రతి ఆలోచనను వారందరితో పంచుకోవడానికి ఇష్టపడరు. వారు స్వార్థపూరితమైన మరియు మ్యానిప్యులేటివ్ వ్యక్తులకు బలి కాకుండా కొందరు సన్నిహితులు మరియు నిజమైన స్నేహితులను కలిగి ఉండటాన్ని ప్రోత్సహిస్తారు.

7) అనవసరం అంశాల జోలికి వెళ్లొద్దు..

7) అనవసరం అంశాల జోలికి వెళ్లొద్దు..

అంతర్ముఖులు అవనసర విషయాల జోలికి వెళ్లరు. లోతైన సంభాషణలో పాల్గొనడానికి మాత్రం ఇష్టపడతారు. బహిర్ముఖులు కూడా ఇలాంటివే చేస్తారు. మీకు స్నేహపూర్వక వ్యక్తి అయితే మీరు ఎంత లోతుగా మాట్లాడిన తప్పు లేదు. కానీ కఠినమైన సమయాల్లో మీకు సహాయం చేసే నిజమైన స్నేహితుల చిన్న గ్రూపును మెయింటెయిన్ మంచిది.

8) గోప్యతను గౌరవించాలి..

8) గోప్యతను గౌరవించాలి..

అంతర్ముఖులు ప్రజల గోప్యత మరియు సరిహద్దులను అడ్డుకునే ఆలోచనను ఇష్టపడరు. ప్రతి ఒక్కరి సరిహద్దులను గౌరవించడం వారికి అత్యంత ఇష్టం. వారు ఉత్తేజకరమైన మరియు సాహసోపేతమైన పని చేయడానికి ఎవరినీ ముందుకు నెట్టరు. అలాగే, వారి సీక్రెట్స్ లిమిట్స్ దాటి ఎవరైనా ప్రవర్తిస్తే వారు అస్సలు ఇష్టపడరు. మీ స్నేహితుడిని నిజంగా ఆసక్తికరంగా మరియు ఉత్తేజకరమైనదిగా ప్రేరేపించడానికి ఇది మంచిది. కానీ ప్రజల సరిహద్దులను గౌరవించడం మంచిది. అంతర్ముఖుల నుండి బహిర్ముఖులు ఓవర్ లెర్నింగ్ చేయాల్సిన పని ఏమీ లేదు. వారి నుండి ఎంత కావాలో అంతే తీసుకోవాలి. అలాగే మంచి లక్షణాలను అలవర్చుకోవాలి. అప్పుడే మీ జీవితానికి మంచిగా ఉంటుంది.

English summary

Important Lessons Extroverts Can Always Learn From Introverts

An introvert loves to focus more on listening than on speaking. In short, they are a good listener and prefer to observe the surrounding around them. Also, they would take a back seat rather than directly engaging with people or events going around them.
Story first published:Thursday, September 12, 2019, 13:52 [IST]
Desktop Bottom Promotion