Latest Updates
-
కోడి కొబ్బరి కారం ఎప్పుడైనా తిన్నారా? జన్మజన్మలకి గుర్తుండిపోయే రుచి..ఎలా చేసుకోవాలంటే.. -
మీ పుట్టిన తేదీ ప్రకారం మీ స్నేహితులు, విరోధులు ఎవరో తెలుసా.. వీరితో కాస్త జాగ్రత్త.! -
76 ఏళ్ల వయస్సులో కూడా ఫిట్ నెస్ లో యువతతో పోటీ..మోదీ నుంచి నేర్చుకోవాల్సిన రోజువారీ పనులివే -
ప్రియుడిపై విరహంతో పెళ్లయిన రెండు వారాలకే యువతి నిర్వాకం.. మొగుడికి ముచ్చెమటలు.! -
శరీరానికి చలవ చేసే కమ్మని కీరదోసకాయ దోశ..పిల్లల ఈవెనింగ్ స్నాక్ గా సూపర్! -
అల్సర్ తగ్గించి ఆకలిని పెంచే అద్భుతమైన తమిళనాడు వంటకం.. ఒక్కసారి తింటే జన్మలో వదిలిపెట్టరు.! -
గణేష్ నిమజ్జనం 2026: అనంత చతుర్దశి నాడు 4 మహా యోగాలు.. ఈ 5 రాశులకు పట్టిందల్లా బంగారమే! -
పెర్ఫ్యూమ్ స్ప్రే చేసేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా.. మీ డబ్బులు వృథా అయినట్లే.! -
ముంబై రోడ్ సైడ్ తవా పులావ్..మెతుకు కూడా మిగల్చకుండా తినేస్తారు..ఎలా చేసుకోవాలంటే.. -
పనీర్ కర్రీ కూడా పనికిరాదు.. ఈ ఆఫ్ఘానీ సోయా కర్రీ రుచి చూస్తే మళ్లీ మళ్లీ కావాలంటారు!
వంట నూనె తగ్గించండి.. ప్రధాని మోదీ పిలుపు వెనుక మాస్టర్ ప్లాన్ ఇదే!
ప్రధాని నరేంద్ర మోదీ భారతీయులకు ఇచ్చిన ఒక సూచన ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఆదివారం(మే 10,2026) హైదరాబాద్ సభలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ఆయిల్ ఆదా చేయండి, బంగారం కొనడం తగ్గించండి అని ఆయన చెప్పినప్పుడు అందరికీ సులభంగానే అర్థమైంది. ఎందుకంటే అవి రెండూ మనం భారీగా దిగుమతి చేసుకునేవి. కానీ వంట నూనె వాడకాన్ని తగ్గించండి అని ప్రధాని అనడం వెనుక ఆంతర్యం ఏమిటి? నిత్యం వంటగదిలో వాడే నూనె గురించి ప్రధాని ఎందుకు మాట్లాడారు? అని చాలా మందిలో ఆలోచన మొదలైంది. అయితే దీని వెనుక ఒక అద్భుతమైన మాస్టర్ ప్లాన్ ఉందని నిపుణులు చెబుతున్నారు.

ఆర్థిక భారం - విదేశీ మారక ద్రవ్యం
భారతదేశం 2025-26 నాటికి ఏకంగా 19.5 బిలియన్ డాలర్ల విలువైన వంట నూనెలను దిగుమతి చేసుకుంటోంది. మన వంటగదుల్లో వాడే నూనె(Edible Oil) కోసం ఇంత భారీ స్థాయిలో విదేశీ మారక ద్రవ్యం దేశం దాటి వెళుతోంది. ఈ దిగుమతుల బిల్లును తగ్గిస్తే దేశ కరెంట్ అకౌంట్ లోటు తగ్గుతుంది, రూపాయి విలువ బలపడుతుంది. ఒకవైపు ఇరాన్ యుద్ధం కారణంగా ప్రపంచ వాణిజ్యానికి అంతరాయం కలుగుతున్న వేళ, అనవసర దిగుమతులను తగ్గించుకోవడానికి ప్రభుత్వం ఈ సూచన చేస్తోంది.
కళ్ల ముందే ఉన్న ఆరోగ్య ముప్పు
ఇది కేవలం ఆర్థిక సమస్య మాత్రమే కాదు, మన కళ్ల ముందే ఉన్న పెద్ద ఆరోగ్య సమస్య. ఆరోగ్య నిపుణుల ప్రకారం.. నూనె, డీప్ ఫ్రై చేసిన పదార్థాలు, జంక్ ఫుడ్ ఎక్కువగా తినడం వల్ల ఊబకాయం, గుండె జబ్బులు, మధుమేహం వంటి జీవనశైలి వ్యాధులు నిశ్శబ్దంగా మనల్ని ఆవహిస్తున్నాయి.
మితిమీరిన నూనె వాడకం వల్లే నేడు మన దేశంలో ఫ్యాటీ లివర్, అధిక రక్తపోటు వంటి సమస్యలు తీవ్రమవుతున్నాయి. కొబ్బరి పాలు, నువ్వులు, అవిసె గింజలు వంటి సహజ సిద్ధమైన పదార్థాలను వంటల్లో వాడటం ద్వారా నూనె వాడకాన్ని తగ్గించవచ్చు. పోషకాహార నిపుణులు కూడా నూనెను పూర్తిగా మానేయమని చెప్పరు, మితంగా వాడమంటారు. మన శరీరానికి వాస్తవానికి చాలా తక్కువ నూనె అవసరం. ఈ క్రమంలో భారతీయుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని కూడా మోదీ ఈ వ్యాఖ్యలు చేసినట్లు అర్థమవుతోంది.

పరిష్కారం ఏమిటి?
అలాగని రాత్రికి రాత్రే నూనెను పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదు. వంట చేసే విధానం మార్చుకుంటే చాలు. నూనెలో వేయించడానికి బదులుగా ఆవిరి మీద ఉడికించడం, గ్రిల్లింగ్, రోస్టింగ్, ప్రెషర్ కుక్కర్ లో వండటం లేదా ఎయిర్ ఫ్రైయింగ్ వంటి పద్ధతులు పాటిస్తే పోషకాలు అలాగే ఉంటాయి, అనవసరపు కొవ్వు తప్పుతుంది.
మన భారతీయ వంటకాల్లో పెరుగు, టమాటా గ్రేవీలతో చేసే వంటలకు నూనె పెద్దగా అవసరం లేదు. రుచి కోసం నూనెపై ఆధారపడాల్సిన పనిలేదు. బాదం, వాల్‌నట్స్, విత్తనాలు, కొవ్వు ఉండే చేపల ద్వారా శరీరానికి అవసరమైన ఆరోగ్యకరమైన కొవ్వులు అందుతాయి. నిమ్మకాయ, వెల్లుల్లి, మసాలా దినుసులు, పెరుగు వంటివి వంటకాలకు అద్భుతమైన రుచిని ఇస్తాయి.
లక్షలాది కుటుంబాలు తమ వంటగదిలో నూనె వాడకాన్ని కొద్దిగా తగ్గించినా, దేశంపై వేల కోట్ల రూపాయల దిగుమతి భారం తగ్గుతుంది. అటు దేశం ఆర్థికంగా బలపడుతుంది, ఇటు జనాభా ఆరోగ్యంగా ఉంటుంది.



Click it and Unblock the Notifications
