For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

హంటెడ్ హౌస్ సంకెతాల గురించి మీకు తెలుసా..

|

మీకు దెయ్యాలు, భూతాలపై నమ్మకం ఉన్నా లేకపోయినా కొన్నిసార్లు హఠాత్తుగా వినిపించే శబ్దం తీవ్ర భయాన్ని కలిగిస్తుంది. ఆ భయం వల్లే దెయ్యం కూడా ఉందేమో అన్న ఆందోళన వెంటాడుతుంది. తమ చుట్టూ ఏదో ఉందన్న భ్రమ కూడా దెయ్యాలుగా భావిస్తారు.

Haunted House

అలాంటి భయమైన సన్నివేశాలు ఇది వరకే సినిమాల్లో చాలా వచ్చాయి. కానీ ఎన్ని సినిమాలొచ్చినా డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తీసిన సినిమాల్లో దెయ్యం నిజంగా ఉందేమోనన్న అనుమానం కలుగుతుంది. ఎందుకంటే అతని సినిమాలో అంత సస్పెన్స్ ఉంటుంది. ఆఖరికి క్లైమాక్స్ పూర్తయిన కూడా దెయ్యం ఉందా లేదా అన్న దానికి వర్మ ఇప్పటికీ ఏ సినిమాలో క్లారిటీ ఇవ్వలేదు.

Haunted House

ఈ నేపథ్యంలో ఆత్మలు ఇచ్చే కొన్ని సంకేతాలు దెయ్యాలు ఉన్నాయని నమ్మేలా చేస్తున్నాయి. మరి మిమ్మల్ని దెయ్యం ఫాలో అవుతుందా లేదా అని తెలిపి సంకేతాలేంటో తెలుసుకోవాలని ఉందా? అయితే కింది పాయింట్లను ఫాలో అవ్వండి. దెయ్యం ఉందో లేదో మీరే నిర్ధారించుకోండి.

అడుగుల శబ్దం వస్తున్నట్టయితే..

అడుగుల శబ్దం వస్తున్నట్టయితే..

మీరు నడిచేటపుడు ఉన్నట్టుండి పాదాల అడుగుల శబ్దం అకస్మాత్తుగా వినపడుతుంటే.. అది కూడా కేవలం మీకు మాత్రమే వినపడుతుంటే మీ చుట్టూ దెయ్యం ఉన్నట్టే అని భావించొచ్చు. ఇందుకు గాను మీరు మీ చుట్టుపక్కల వారిని అడిగి ఆ శబ్దం గురించి అడిగి తెలుసుకోవచ్చు. పూర్తిగా మీరు స్పష్టం చేసుకునేంత వరకు మీరు ఎంతమాత్రం ఆందోళన చెందాల్సిన పని అస్సలు అవసరం లేదు. మీరు నిశ్చింతగా నిద్ర పోవచ్చు. ఇదొక్కటే కాకుండా పాదాల అడుగులు పడుతున్నాయని అనుమానం ఏమైనా కలిగితే దీని పట్ల కూడా అప్రమత్తంగా ఉండాలి. వెంటనే వాటిని పరిశీలించాలి.

ఉన్నట్టుండి తలుపుల శబ్ధం..

ఉన్నట్టుండి తలుపుల శబ్ధం..

మీరు ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు, ఎటువంటి గాలి, వర్షం రాని సమయంలో, మీ ఇల్లంతా నిశ్శబ్ధంగా ఉన్న సమయంలో అకస్మాత్తుగా ఉన్నట్టుండి తలుపులు గట్టిగా శబ్ధం వస్తుంటాయి. అంతేకాదు మీ ఇంట్లోని అల్మారాలు వంటివి కూడా పెద్ద శబ్ధం వస్తాయి. ఇది ఏదో ఒకసారి జరిగితే మీరు ఆందోళన చెందాల్సిన పనిలేదు. ఎందుకంటే అప్పుడప్పుడు మీరు తలుపుల వద్ద, అల్మారాల వద్ద లేని సమయంలో కూడా ఉన్నట్టుండి గాలి వచ్చి తలుపులు మూసుకుని లేదా ఏవైనా బోల్టులు లూస్ అయిన కారణంగా గట్టిగా అవి గట్టిగా శబ్ధమొస్తుంటాయి. కానీ మీరు ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రమే ఇలాంటివి పదే పదే జరిగితే మాత్రం మీ ఇంట్లో దెయ్యం ఉందని ఆ సంకేతాలను బట్టి చెప్పొచ్చు.

కుక్క గట్టిగా అరిచినపుడు..

కుక్క గట్టిగా అరిచినపుడు..

ఎప్పుడు ఊరికే ఉండే మీ వీధిలోని కుక్క ఉన్నట్టుండి చాలా గట్టిగా అరిస్తే మనం కంగారు పడాల్సిన పని లేదు. ఎందుకంటే అప్పుడప్పుడు మన వీధిలోకి కొత్త వ్యక్తులు సంచరిస్తుంటారు. వారిని చూసినపుడు కూడా కుక్కలు గట్టిగా అరుస్తాయి. కానీ ఎవరు లేని సమయంలో కూడా కుక్క ఊరికే గట్టిగా అరిస్తే.. ఆ ప్రాంతంలో మీరు అప్పుడు ఏమీ గమనించలేకపోతే దాన్ని కూడా ఆ సంకేతం లాగా భావించొచ్చు. ఎందుకంటే కుక్కకు కాలభైరవుడు అనే పేరుంది. అవి ఎలాంటి దుష్టశక్తులను అయినా వెంటనే గుర్తించగలవు. అందుకనే అవి అలా అరుస్తాయి. దాన్ని బట్టి మీరు దెయ్యం ఉందని నిర్ధారణకు రావచ్చు.

వస్తువులు కదలడం..

వస్తువులు కదలడం..

మీ ఇంట్లో ఉన్నట్టుండి ఏదైనా గ్లాసు కదలడం, పుస్తకాలు గాల్లో ఎగరడం వంటి సంకేతాలు కూడా దెయ్యం ఉందని తెలుపుతాయి. ఇంకో విషయమేమిటంటే గ్లాసులో నీరు ఉన్నట్టుండి ఆవిరైపోవడం లేదా మాయం అయిపోవడం.. మనం ఏదైనా వస్తువులను ఒక చోట పెడితే అవి మరో చోట ఉన్నట్లు గుర్తించినా మీ చుట్టూ దెయ్యం ఉందని సంకేతం.

భయంకరమైన దుర్వాసన..

భయంకరమైన దుర్వాసన..

కొన్ని సమయాల్లో దెయ్యాలు వాటి ఉనికిని చాటుకునేందుకు భయంకరమైన దుర్వాసనను వదులుతుంటాయి. ఆ వాసన ఎవ్వరూ తట్టుకోలేనంతగా ఉంటుంది. ఒకవేళ అకస్మాత్తుగా మీరు ఉన్నట్టుండి అటువంటి దుర్వాసనను పసిగడితే మీ చుట్టుపక్కల దెయ్యం ఉందని అర్థం చేసుకోవచ్చు. కానీ దీనికి ముందు మీరు మీ చుట్టుపక్కల ఏదైనా చనిపోయిందా లేక ఏదైనా కాలిపోయిందా ఇంకా ఏదైనా జరిగిందా అనేది కూడా నిర్ధారించుకోవాలని అంతా విచారించుకున్న తర్వాతే మీరు నిర్ధారణకు రావాలి.

ఉన్నట్టుండి మిమ్మల్ని తోసినట్టు..

ఉన్నట్టుండి మిమ్మల్ని తోసినట్టు..

మీరు ఒంటరిగా ఉన్నప్పుడు లేదా అందరిలో ఉన్నప్పుడు కూడా మిమ్మల్ని ఎవరో ముట్టుకున్నట్టు లేదా మీ భుజాల్ని తట్టినట్టు లేదా మీ జుట్టు లాగినట్టు లేదా మిమ్మల్ని ముందుకు తోసినట్టు అనిపిస్తే మీరు కంగారు పడాల్సిన పనిలేదు. ఎందుకంటే ఈ మధ్యన కొన్ని యాప్ లలో ఫేమస్ అయ్యేందుకు మీ స్నేహితులు మిమ్మల్ని ఆటపట్టించేందుకు ఇలాంటివి చేస్తుంటారు. ఇటీవల కాలంలో ఇలాంటి చాలా ఎక్కువగా అయిపోయాయి. పైగా ఇలాంటి వాటిని వీడియోలు తీసి అందరినీ నవ్వించే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఇలాంటి వాటిని అన్నింటినీ మీరు పూర్తిగా స్పష్టం చేసుకున్నాక కూడా మీకు అలాగే అనిపిస్తే మీ చుట్టూ దెయ్యం ఉందని సంకేతం.

నీడకు భూతానికి తేడా ఏంటంటే..

నీడకు భూతానికి తేడా ఏంటంటే..

నీడకు భూతానికి చాలా తేడా ఉంటుంది. ఎందుకంటే అది మనిషిలా కనిపిస్తుంది. బట్టలు వేసుకున్నట్టు దాని ముఖ భాగాలను గుర్తించగలిగితే మీ చుట్టూ దెయ్యం ఉందని సంకేతం. ఇలాంటి సంఘటనలు పలుచోట్ల హైదరాబాద్ వంటి నగరాలతో పాటు ఇతర చోట్ల వీడియోలు హల్ చల్ చేశాయి. అవెంత వరకు నిజమన్నది మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. కొంతమంది అవి ఫేక్ కొట్టిపడేస్తే.. ఇంకొంతమంది వాటిని చూసి చాలా భయపడ్డారు. కానీ కొందరు మాత్రం ధైర్యంగా ఫొటోలు తీసుకున్నారు. సో బీకేర్ ఫుల్.

English summary

Signs of a Haunted House

If you suddenly hear the sound of footsteps as you walk.. it can only feel as if there is a ghost around you. For this you can ask your neighbors about the noise. There is no need to work out how much you are concerned until you are completely clear. You can sleep for sure. In addition, be alert to any suspicion of footsteps
Story first published: Tuesday, August 27, 2019, 18:58 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more