Latest Updates
-
ఫ్రిజ్‌లో ఏ కూరగాయ ఎంత కాలం నిల్వ ఉంటుంది?.. సరైన స్టోరేజ్ పద్ధతులు ఇవే! -
ఒంట్లో రక్తం పెంచి, బలాన్ని అందించే సూపర్ ఫుడ్ 'జొన్న మెంతి పరాటా’.. ఈజీగా ఇలా చేసేయండి.! -
దానిమ్మ తింటే నిజంగానే టెస్టోస్టెరాన్ పెరుగుతుందా.. పురుషులు తెలుసుకోవాల్సిన లాజిక్ ఇదే.! -
స్పైసీ ఫుడ్ లవర్స్‌కి పండగే.. ముక్కముక్కలో తెలంగాణ ఘాటు తెలిపే 'అంకాపూర్ నాటుకోడి కూర'! -
నకిలీ డిస్కౌంట్లకు నో ఛాన్స్.. ఆన్లైన్ షాపింగ్‌పై కేంద్రం కఠిన నిబంధనలు.! -
శుక్రుడి వక్రగతి మహర్దశ.. ఆ రాశుల వారికి కెరీర్, బిజినెస్‌లో సిరుల పంట.! -
బెంగళూరు వీధుల్లో దొరికే అచ్చమైన మష్రూమ్ దొన్నె బిర్యానీ..మీ ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
తొలిసారి విదేశీ ప్రయాణమా.. ఈ 5 తప్పులు చేస్తే మీ వీసా తిరస్కరణకు గురైనట్లే.! -
మొఘలాయ్ తవా చికెన్.. మసాలా వేశాక ఇలా చేస్తే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
Broccoli Pulao: బ్రకోలి పులావ్ ఇలా చేస్తే..తింటుంటే స్వర్గంలో తేలుతున్నట్లు ఉంటది!
హాట్ హాట్ సమ్మర్‌లో పచ్చి మామిడితో జ్యూస్, ఘాటుఘాటుగా పచ్చడి..
తెలుగు రాష్ట్రాల్లో ఎండలు ముదిరిపోతున్నాయి. వేసవి తాపం ఎలా ఉన్నా.. ఈ సీజన్‌లో మామిడికి ఉన్న క్రేజ్ వేరు. పచ్చి మామిడి నుంచి పళ్ల రసాల వరకూ ఉండే డిమాండ్ అంతా ఇంతా కాదు. ఇక మామిడి కాయలతో కమ్మనైన పప్పు, చారు, నిల్వ పచ్చళ్లు ఆనవాయితీ అయితే.. మామిడి పండ్లతో జ్యూస్‌లు లాగించేస్తాం. కానీ పచ్చి మామిడితో జ్యూస్, రోటి పచ్చడి ఎప్పుడైనా విన్నారా.. ఈ సారి రొటీన్‌గా కాకుండా కొత్తగా ట్రై చేసి చూడండి.. ఇంటిల్లిపాదీ ఫిదా అయిపోవాల్సిందే..

మామిడి కాయతో జ్యూస్ చేయడానికి కావాల్సిన పదార్థాలు
పచ్చిమామిడి- పెద్దవి- 2
పచ్చి కొబ్బరి ముక్కలు- ఒక కప్పు
కొత్తిమీర- ఐదు కాడలు
అల్లం- చిన్న ముక్క
వెల్లుల్లి- 2 రెెబ్బలు
ఐస్ ముక్కలు- సరిపడా
మామిడి కాయతో జ్యూస్ తయారీ విధానం
-ముందుగా కుక్కర్‌లో మామిడి కాయలు మునిగే వరకు నీళ్లు పోసి మూత పెట్టి రెండు విజిల్స్ వచ్చేవరకు స్టవ్ పైన ఉంచాలి. ఉడికిన తర్వాత మామిడి తొక్క తీయాలి. మెత్తగా అయిన గుజ్జుని తీసి మిక్సీలో వేయాలి. దానితో పాటు పచ్చి కొబ్బరి ముక్కలు, కొత్తిమీర, అల్లం, వెల్లుల్లి, కొన్ని నీళ్లు పోసి మెత్తగా గ్రెండ్ చేసుకోవాలి.
-తర్వాత ఆ పేస్ట్‌ని ఒక పల్చటి శుభ్రమైన క్లాత్ ద్వారా వడగట్టి గ్లాస్‌లో పోసుకోవాలి. చివరిగా కొన్ని ఐస్ ముక్కలు వేసి సర్వ్ చేసుకోవడమే.. కొంచెం పుల్లగా, తీయగా, చల్లచల్లని రా మ్యాంగో జ్యూస్ రెడీ..
మామిడి కాయ రోటి పచ్చడికి కావాల్సిన పదార్థాలు
పచ్చి మామిడి- 1
పచ్చిమిర్చి- 3
వెల్లుల్లి రెబ్బలు- 7
కారం- ఒక టేబుల్ స్పూన్
ఉప్పు- తగినంత
ఆవాలు- ఒక టేబుల్ స్పూన్
కరివేపాకు
వంట నూనె- సరిపడా

పచ్చి మామిడికాయ రోటి పచ్చడి తయారీ విధానం
-ముందుగా మామిడికాయను స్టవ్‌పైన ఎర్రగా అయ్యేవరకు కాల్చుకోవాలి. చల్లారిన తర్వాత తొక్కతీసి గుజ్జుని సెపరేట్ చేయాలి. అదేవిధంగా పచ్చిమిర్చి, వెల్లుల్లిని స్టవ్‌పైన కాల్చుకోవాలి. ఇప్పుడు వీటిని రోట్లో వేసి కారం, తగినంత ఉప్పు కలిపి మెత్తగా అయ్యే వరకు రుబ్బుకోవాలి. అనంతరం ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చితో తాలింపు వేసి పచ్చడిలో కలుపుకోవాలి.
-ఈ పచ్చడిని వేడివేడి అన్నంలో కలుపుకొని తింటే ఆ రుచి అమోఘం. సాంప్రదాయ పచ్చళ్లను తలదన్నే ఈ కొత్త వెరైటీ రుచిని ఈ వేసవి అయిపోయేలోపు ఆస్వాదించండి.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
