Latest Updates
-
జలుబు వల్ల వచ్చే తీవ్రమైన తలనొప్పిని తగ్గించే బెస్ట్ చిట్కా ఇదే -
నార్త్ ఇండియా స్టైల్ పుట్టగొడుగులు బంగాళదుంప మసాలా..తరతరాలకు గుర్తుండిపోయే రుచి! -
విటమిన్ C, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే ఉసిరి సూప్..చలికాలంలో దీన్ని మించింది లేదు! -
పురుషుల దినోత్సవం స్పెషల్ స్వీట్..నోట్లో వెన్నలా కరిగిపోయే క్రీమీ రబ్రీని ఇంట్లోనే సులభంగా చేసుకోండిలా! -
చాక్లెట్ బ్రౌనీ చీజ్ కేక్ రెసిపీ.. పురుషుల దినోత్సవాన మీ ప్రియమైన వారికి ఇలా స్వీట్ సర్ ప్రైజ్ ఇవ్వండి! -
International men's day: ప్రతి పురుషుడు తప్పనిసరిగా చేయించుకోవాల్సిన టెస్టులు ఇవే! -
పిల్లల ఆట అనుకుంటున్నారా? పెద్దలు ఉయ్యాల ఊగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలివే! -
చలికాలం స్పెషల్ బ్రేక్ ఫాస్ట్..ప్రోటీన్, ఐరన్ పుష్కలంగా ఉండే పెసరపప్పు పాలకూర దోసె చేసుకోండిలా.. -
చలికాలంలో హార్ట్ ఎటాక్ ముప్పు? తప్పక తెలుసుకోవాల్సిన నిజాలు! -
కేరళ స్పెషల్ మలబార్ చికెన్ బిర్యానీ.. బ్యాచిలర్లు కూడా చిటికెలో చేసేయొచ్చు!
నోరూరించే మసాలా కలేజీ..ఈ ఒక్క ట్రిక్ పాటిస్తే ముక్కలు సాఫ్ట్ గా నోట్లో వేస్తే కరిగిపోవడం ఖాయం!
వారాంతాల్లో మీ కుటుంబ సభ్యులకు ఎప్పుడూ చేసే రెగ్యులర్ మటన్ లేదా చికెన్ కర్రీలు కాకుండా ఏదైనా విభిన్నమైన రుచికరమైన వంటకం చేసి పెట్టాలని ఆలోచిస్తున్నారా? అయితే ఈ వీకెండ్ లో మసాలా కలేజీ(మటన్ లివర్ మసాలా) ట్రై చేయండి. కలేజీని సరైన పద్ధతిలో వండితే అది ఎంత మృదువుగా, రుచిగా ఉంటుందో మాటల్లో చెప్పలేం. చపాతీ, నాన్, పరాఠా, బగారా రైస్ లేదా వేడి వేడి అన్నంలోకి ఇది పర్ఫెక్ట్ కాంబినేషన్. రెస్టారెంట్ స్టైల్ రుచిని తలపించేలా ఇంట్లోనే చాలా సులభంగా, త్వరగా మసాలా కలేజీ ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ చూడండి.

మసాలా కలేజీ తయారీకి కావాల్సిన పదార్థాలు
కలేజీ (మటన్ లివర్) - 500 గ్రాములు
నూనె - పావు కప్పు
ఉల్లిపాయలు - 2
అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 టేబుల్ స్పూన్
ధనియాల పొడి - 1 టీస్పూన్
ఎర్ర కారం పొడి - 2 టీస్పూన్లు
పసుపు - పావు టీస్పూన్
పెరుగు - పావు కప్పు
నీళ్లు - 1 కప్పు
గరం మసాలా పొడి - 1 టీస్పూన్
ఉప్పు - 1 టీస్పూన్
కొత్తిమీర - కొద్దిగా
మసాలా కలేజీ తయారీ విధానం
-ముందుగా కలేజీని కొద్దిగా ఉప్పు లేదా పసుపు వేసిన నీటిలో రెండు మూడు సార్లు శుభ్రంగా కడగాలి. ఇలా చేయడం వల్ల దానిలోని నీచు వాసన పూర్తిగా పోతుంది.
-ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక మందపాటి పాన్ లేదా కడాయి పెట్టుకుని అందులో పావు కప్పు నూనె వేడి చేయాలి. నూనె బాగా కాగాక, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి, అవి లేత గోధుమ రంగు (గోల్డెన్ బ్రౌన్) వచ్చే వరకు బాగా వేయించాలి.
-ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేలా ఒక నిమిషం పాటు కలుపుతూ వేయించాలి.
-ఇప్పుడు శుభ్రం చేసి పెట్టుకున్న కలేజీ ముక్కల కడాయిలో వేసి, నూనెలో సుమారు 5 నుండి 7 నిమిషాల పాటు బాగా మగ్గనివ్వాలి. కలేజీ రంగు మారుతున్న సమయంలో అందులో పావు టీస్పూన్ పసుపు, 2 టీస్పూన్ల కారం, 1 టీస్పూన్ ధనియాల పొడి వేసి బాగా కలపాలి. మసాలాలన్నీ కలేజీ ముక్కలకు పట్టేలా మరో రెండు నిమిషాలు ఉడికించాలి.
-తర్వాత మంటను సిమ్ లో పెట్టి కడాయిలో పావు కప్పు పెరుగు వేసి నెమ్మదిగా కలపాలి. పెరుగు వేయడం వల్ల గ్రేవీకి మంచి రుచితో పాటు అద్భుతమైన క్రీమీ టెక్స్చర్ వస్తుంది. ఇప్పుడు అందులోనే ఒక కప్పు నీళ్లు పోసి మూతపెట్టి 10 నుండి 15 నిమిషాల పాటు కలేజీని మెత్తబడే వరకు ఉడికించాలి.
-కలేజీ మెత్తగా ఉడికిన తర్వాత చివరగా అందులో 1 టీస్పూన్ గరం మసాలా, 1 టీస్పూన్ ఉప్పు వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. గ్రేవీ దగ్గరపడి నూనె పైకి తేలుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని, సన్నగా తరిగిన తాజా పచ్చికొత్తిమీర చల్లుకుంటే ఎంతో గుమగుమలాడే మసాలా కలేజీ రెడీ.
-కలేజీ వండేటప్పుడు చాలామంది చేసే సాధారణ పొరపాటు వంట మొదట్లోనే ఉప్పు వేయడం. కానీ ఉప్పు ఎప్పుడూ ఆఖరిలోనే వేయాలి. ఇలా చివరలో ఉప్పు వేయడం వల్ల కలేజీ త్వరగా ఉడకడమే కాకుండా నోట్లో వేస్తే కరిగిపోయేలా చాలా సాఫ్ట్ గా ఉంటుంది. ఉప్పు ముందే వేస్తే కలేజీ గట్టిగా మారి రుచి పాడవుతుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
