For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

టిక్ టాక్ లో మరో గేమ్ అటాక్...! వైరల్ అవుతున్న ‘స్కల్ బ్రేక్‘ ఛాలెంజ్... పూర్తి వివరాలు వీడియోలో..

ఆ యాప్ లో తాజాగా ‘స్కల్ బ్రేకర్‘ ఛాలెంజ్ గేమ్ తెగ వైరల్ అయిపోతోంది. ఈ ఛాలెంజ్ ను ముఖ్యంగా యువత మరియు పిల్లలకు ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

|

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఆ యాప్ బాగా పాపులర్ అవుతోంది. అందులో వచ్చే ఛాలెంజ్ లను చిన్న పిల్లవాడి నుండి పండు ముసలి వారి వరకు స్వీకరించేందుకు ప్రయత్నిస్తున్నారు.

Skull breaker TikTok challenge

అలా గాయాల పాలైన వారు ఎందరో ఉన్నారు. ఇటీవలే బ్లూ వెల్ ఛాలెంజ్, మెమో ఛాలెంజ్ వంటి ప్రమాదకరమైన గేమ్ ల తర్వాత ఆ యాప్ లో తాజాగా 'స్కల్ బ్రేకర్' ఛాలెంజ్ గేమ్ తెగ వైరల్ అయిపోతోంది.

Skull breaker TikTok challenge

ఈ ఛాలెంజ్ ను ముఖ్యంగా యువత మరియు పిల్లలకు ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఈ సవాలును గనుక స్వీకరిస్తే శరీరంలోని ఎముకలు ముఖ్యంగా తలకు సంబంధించిన గాయాలు అయ్యే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.

Skull breaker TikTok challenge

ఈ ఛాలెంజ్ పట్ల తల్లిదండ్రులతో పాటు, ఉపాధ్యాయులు కూడా చాలా అప్రమత్తంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటే ఈ స్కల్ బ్రేకర్ బారి నుండి తప్పించుకోవచ్చు అని సూచిస్తున్నారు. ఇంతకీ 'స్కల్ బ్రేకర్' ఛాలెంజ్ అంటే ఏమిటి? ఈ గేమ్ ఎందుకంత వైరల్ అయ్యింది? నిజంగానే ఇది ప్రమాదకరమా కాదా అనే విషయాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం...

అరచేతిలో ఈ రేఖలు ఉంటే మీరు అత్యంత అదృష్టవంతులవుతారట...!అరచేతిలో ఈ రేఖలు ఉంటే మీరు అత్యంత అదృష్టవంతులవుతారట...!

ట్రిప్పింగ్ జంప్..

‘స్కల్ బ్రేకర్‘ గేమ్ ట్రిప్పింగ్ జంప్ అని కూడా అంటారు. ఈ ప్రమాదకరమైన గేమ్ ను విద్యార్థుల నుండి యువత ఎక్కువగా ఆడుతున్నారు. చాలా మంది ఈ గేమ్ ను సోషల్ మీడియాలో షేర్ చేసి విపరీతంగా ఫాలోయింగ్ పొందుదామని భావిస్తున్నారు.

టిక్ టాక్ లో వైరల్..

ఈ స్కల్ బ్రేకర్ గేమ్ ఛాలెంజ్ కాస్త టిక్ టాక్ యాప్ కు చేరడంతో ఇది మరింత పాపులర్ అయిపోయింది. విపరీతమైన ఫాలోయింగ్ వచ్చింది. అయితే ఈ గేమ్ లో పాల్గొన్న వారిలో చాలా మంది పుర్రెకు సంబంధించిన గాయాలతో పాటు నడుముకు సంబంధించిన గాయాలపాలయ్యారు.

స్కల్ బ్రేకర్ అంటే ఏమిటి?

స్కల్ బ్రేకర్ అనే గేమ్ లో ఎవరైనా ముగ్గురు వ్యక్తులు పక్కపక్కనే నిలబడతారు. ముందుగా కుడి, ఎడమ పక్కన ఉండే వ్యక్తులు గాల్లోకి ఎగురుతారు. వీరిని చూసి మధ్యలోని వ్యక్తి కూడా గాల్లోకి ఎగురుతాడు. సరిగ్గా ఆ సమయలోనే ఇరువైపులా నిలబడి ఉన్న వ్యక్తులు మధ్యలో ఉన్న వ్యక్తిని కాలితో తన్నేస్తారు.

కిక్ జంపింగ్..

కిక్ జంపింగ్..

అంతే వారి కిక్ వల్ల మధ్యలోనే వ్యక్తి నేలపై చాలా వేగంగా పడిపోతాడు.ఇది వ్యక్తి తల మరియు మెడకు తీవ్రమైన గాయం అయ్యే ప్రమాదం పెంచుతుంది. అంతేకాకుండా నేలపై పడిన వ్యక్తికి నడుము, మోకాలి చీలమండకు సంబంధించిన గాయాలు కూడా అయ్యే ప్రమాదాలు ఎక్కువ అని డాక్టర్లు సూచిస్తున్నారు.

పిల్లల పట్ల జాగ్రత్త...

ఈ స్కల్ బ్రేకర్ ఛాలెంజ్ యొక్క వీడియో టిక్ టాక్ తో పాటు వాట్సాప్ తో సహా అనేక సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లలో వైరల్ అయిపోతోంది. కాబట్టి మీ పిల్లలు కూడా ఈ వీడియో చూసి ఇలాంటి స్టంట్లను ప్రయత్నించడానికి ముందు తల్లిదండ్రులు పిల్లలను హెచ్చరించాలి.

ఇప్పటికే అనేక ప్రమాదాలు..

ఇప్పటికే అనేక ప్రమాదాలు..

హాస్యాస్పదంగా ఉన్న ఈ ఛాలెంజ్ ను స్వీకరించేందుకు టీనేజ్ యువత ఇష్టపడుతుంటారు. ఇప్పటికే చాలా మంది పాల్గొన్నారు. ప్రమాదాలకు కూడా గురయ్యారు. తాజాగా స్కల్ బ్రేకర్ ఛాలెంజ్ లో వెనిజులా కుర్రాడు తలకు గాయమైన వీడియో బాగా వైరల్ అయ్యింది.

సూచనలివే...

సూచనలివే...

ఈ స్కల్ బ్రేకర్ ఛాలెంజ్ పట్ల ఇప్పటికే యూరప్, దక్షిణ అమెరికాతో పాటు కొన్ని దేశాల స్కూళ్లలో టీచర్లు తమ విద్యార్థులకు సూచనలు చేశారు. ఈ తరహా వీడియోలు చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.

ఇతర ఛాలెంజ్ లు..

ఇతర ఛాలెంజ్ లు..

ప్రస్తుతం స్కల్ బ్రేకర్ బాగా వైరల్ అయ్యింది కాబట్టి దీని గురించి తెలిసింది. అయితే ఇలాంటి ఛాలెంజ్ లు ఇంకా ఉన్నాయి. అవి ఏంటంటే అవుట్ లెట్ ఛాలెంజ్, బ్రైట్ ఐ ఛాలెంజ్. ఇవి కూడా ప్రమాదకరమని నిపుణులు సూచిస్తున్నారు. టిక్ టాక్ వీడియోలు ఎక్కువగా చేసేవారు, ముఖ్యంగా చిన్నారులు, యువత దీని జోలికి వెళ్లకపోవడమే మంచిది.

English summary

Viral: Skull breaker TikTok challenge

new social media trend called the Skull-breaker challenge has become a reason to worry these days with several people getting injured.
Story first published:Tuesday, February 18, 2020, 11:50 [IST]
Desktop Bottom Promotion