For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

టిక్ టాక్ లో ట్రెండింగ్ గా మారిన గ్రావిటీ ఛాలెంజ్.. అది ఎందుకు అంతలా ట్రెండింగ్ అయ్యిందో తెలుసా..

|

గతంలో చాలా మంది సెలబ్రిటీలు సరదా కోసం కొన్ని ఛాలెంజేస్ ను స్వీకరించేవారు. ఇవి కాస్త సోషల్ మీడియాలో ట్రెండింగ్ అయిపోయి తెగ హల్ చల్ చేస్తుండేవి. గతంలో బర్డ్ బాక్స్ ఛాలెంజ్ లేదా బాటిల్ క్యాప్ ఛాలెంజ్ అయినా, సామాన్య ప్రజల నుండి సెలబ్రిటీల వరకు ఈ ఛాలెంజ్ ను స్వీకరించి వాటిని వారి సోషల్ మీడియా పోస్టులలో పోస్టు చేసేవారు.

What Is The Gravity Challenge And Why Is It Trending?

అలా తాజాగా మరో ఛాలెంజ్ ప్రస్తుతం తెగ వైరల్ అయిపోయింది. అదేంటంటే గ్రావిటీ (గురుత్వాకర్షణ) ఛాలెంజ్. గ్రావిటీ ఛాలెంజ్ అంటే ఏమిటి? ఇందుకు ఇది ఇంతలా ట్రెండింగ్ అయ్యిందో తెలుసుకోవాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే..

గ్రావిటీ ఛాలెంజ్

గ్రావిటీ ఛాలెంజ్ అంటే గురుత్వాకర్షణ నియమాన్ని ప్రదర్శించడం మరియు దృశ్యమాన గాగ్ ను ఉపయోగించి ఇది ఎలా పని చేస్తుందో ప్రపంచానికి చూపించడం. ఎవరైనా వ్యక్తులు ఒక చైర్ లో కూర్చోని ఉన్న సమయంలో వారి స్నేహితులు వచ్చి వారిపైకి నీళ్లు పోస్తారు. ఆ సమయంలో వారు కదలకుండా కూర్చోవాలన్నమాట. దాన్ని వీడియో తీసి సోషల్ మీడియా యాప్ లలో పోస్టు చేస్తున్నారు. ఇవి కాస్త తెగ వైరల్ అయిపోతున్నాయి.

వైరల్ అయిన ఛాలెంజ్

ఈ ఛాలెంజ్ తొలుత టిక్ టాక్ లో ‘గ్రావిటీ‘ మరియు ‘గ్రావిటీ ఛాలెంజ్‘ అనే హ్యాష్ ట్యాగ్ లతో ప్రారంభమైంది. అక్కడి నుండి దానిని నెటిజన్లు అందుకున్నారు. అంతే అప్పటి నుండి ఎవరుపడితే వారు ఈ ఛాలెంజ్ ను స్వీకరించడం ప్రారంభించారు. వారి వీడియోలను పోస్ట్ చేయడం ప్రారంభించారు.దీంతో ఈ గ్రావిటీ ఛాలెంజ్ తెగ వైరల్ అయిపోయింది.

మీరు కూడా ట్రై చేయొచ్చు..

ఈ టిక్ టాక్ వీడియోల వల్ల ఇంటర్నెట్ లో గ్రావిటీ ఛాలెంజ్ యొక్క అనేక సంస్కరణలు/వివరణలు వెల్లువలా వస్తున్నాయి. చాలా మందికి తెలిసే ఉంటుంది. 2006లో ఓ రాక్ పాట ‘‘గ్రావిటీ నాకు వ్యతిరేకంగా పనిచేస్తోంది‘‘ అనే ఒక పాట వచ్చింది. ఇప్పుడు ఈ సవాలును స్వీకరించిన వారు అది తప్పు అని నిరూపిస్తున్నారు. మీరు కూడా ఈ ‘‘గ్రావిటీ ఛాలెంజ్‘‘ ను ప్రయత్నించాలి అనుకుంటున్నారా? అయితే ఈ వీడియోలను చూడండి..

గతంలో ఐస్ బకెట్ ఛాలెంజ్..

గతంలో ఐస్ బకెట్ ఛాలెంజ్..

ఈ ఛాలెంజ్ లు ఇప్పుడే వచ్చినవి కాదు. కొన్నేళ్ల కిందట కూడా ఇలాంటి ఛాలెంజ్ లు తెగ వైరల్ అయ్యాయి. అందులో 2014లో ఐస్ బకెట్ ఛాలెంజ్ బాగా వైరల్ అయ్యింది. ఆ సమయంలో దక్షిణ భారతదేశంలో మొట్టమొదటి సారిగా అందాల భామ హన్సిక మోత్వానీ ఈ ఛాలెంజ్ ను స్వీకరించింది. ఈ వీడియోను ఆమె ట్విట్టర్ ద్వారా షేర్ చేసుకోవడంతో ఆమె అభిమానులు కూడా ఈ ఛాలెంజ్ ను స్వీకరించేలా చేసింది.

24 గంటల్లో ..

24 గంటల్లో ..

అప్పట్లో ఈ ఐస్ బకెట్ ఛాలెంజ్ వెనుక ఒక కారణం ఉంది. అమియోట్రోఫిక్ లాటరల్ స్క్లెరోసిస్ కు వ్యతిరేకంగా అందరికీ అవగాహన కల్పించడానికి ఇది ఒక చొరవలాగా ఉపయోగపడింది. ఈ వ్యాధి నయం చేయడానికి మరియు అందరికీ అవగాహన కల్పించి నిధులను విస్తరించడంలో ఇది బాగా సహాయపడింది. అప్పట్లో ఇది ఎలా జరిగిందంటే ఎవరైనా ముగ్గురు స్నేహితులను 24 గంటల్లో ఈ ఛాలెంజ్ ను స్వీకరించమని సవాల్ చేస్తారు. నామినేటెడ్ అయిన వ్యక్తులు ఈ సవాలుకు అంగీకరించకపోతే వారు ఎల్ ఎస్ ఎస్ అనే సంస్థకు 100 డాలర్ల విరాళం ఇస్తారు. ఈ ఐస్ బకెట్ ఛాలెంజ్ సోషల్ మీడియాను మరియు ఇంటర్నెట్ మొత్తాన్ని తుఫానుగా తీసుకుంది.

జుకర్ బర్గ్ ఛాలెంజ్ ను స్వీకరించిన బిల్ గేట్స్..

ఇలా చాలా మంది ప్రముఖులు అప్పట్లో ఈ ఛాలెంజ్ ను స్వీకరించారు. అందులో ముఖ్యంగా జుకర్ బర్గ్ విసిరిన సవాలును మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ వెంటనే స్వీకరించారు. ఆ సవాలును విజయవంతంగా పూర్తి చేశారు. తన వీడియోను సైతం సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. వారితో పాటు ఎంతో మంది ప్రముఖులు ఈ ఛాలెంజ్ ను స్వీకరించారు. అలా ఆ సంస్థకు 13.3 మిలియన్ల మేర విరాళాలు వచ్చినట్లు నివేదికలు చెబుతున్నాయి.

రైస్ బ్యాగ్ ఛాలెంజ్..

రైస్ బ్యాగ్ ఛాలెంజ్..

దాని తర్వాత మరో ఛాలెంజ్ కూడా వచ్చింది. కానీ ఇది అందరూ అనుకున్నతంగా వైరల్ కాలేదు. కానీ దాదాపు విజయవంతం అయ్యింది. అదేంంటేంటే రైస్ బ్యాగ్ ఛాలెంజ్ ఈ ఛాలెంజ్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం ప్రపంచంలో దారిద్య్రరేఖకు దిగువగా ఉన్న ప్రజలకు వారికి పౌష్టికాహారం అందించడం. అలాగే ఆకలిని అంతం చేసే ప్రయత్నాలను చేయడం అన్నమాట. ఆకలికి వ్యతిరేకంగా ఆహారం, సమాజం మరియు సుస్థిరత అనే మూడు లక్ష్యాలను సాధించడానికి ఈ ఛాలెంజ్ అమెరికాలో ప్రారంభమైంది. కానీ అది అంతగా వైరల్ కాలేదు. సంక్షోభాల నుండి ఉపశమనం పొందడం మరియు కమ్యూనిటీలను శక్తివంతం చేయడం ద్వారా ఆకలికి వ్యతిరేకంగా ఈ ఛాలెంజ్ ప్రపంచంపై ప్రభావం చూపడానికి పని చేస్తుంది అనే ఆ సంస్థ సభ్యులు చెప్పారు. అయితే మన దక్షిణ భారతదేశంలో మాత్రం కొందరు ప్రముఖులు ఈ ఛాలెంజ్ ను స్వీకరించారు. పేదలకు విరాళాలు ఇచ్చారు.

English summary

What Is The Gravity Challenge And Why Is It Trending?

The challenge first started on TikTok with the hashtags 'gravity' and 'gravity challenge' and the netizens took it from there. You will see several versions/interpretations of the gravity challenge on the internet today.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more