Who is Harnaaz Sandhu:మిస్ యూనివర్స్ గా మిస్ ఇండియా... 21 ఏళ్ల తర్వాత భారత్ కు విశ్వసుందరి కిరీటం...

2021లో ప్రపంచ సుందరిగా నిలిచిన హర్నాజ్ సంధు ఎవరు.. తన గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం..

మన దేశంలోని పంజాబీ సుందరి..ప్రపంచ సుందరి కిరీటాన్ని కైవసం చేసుకుంది.. దీంతో భారతదేశ అతివల అందం మరోసారి విశ్వవ్యాప్తమైంది. మిస్ యూనివర్స్ కోసం 21 సంవత్సరాలు నిరీక్షించిన మనకు ఎట్టకేలకు అందమైన ముగింపు లభించింది.

Who is Harnaaz Sandhu, Punjabi Actor And Miss India Universe 2021 in Telugu

అందంతో పాటు తెలివితేటలకు సంబంధించిన విషయాలపై మిస్ యూనివర్స్-2021 పోటీల్లో హర్నాజ్ కౌర్ సింధు అద్భుతంగా మాట్లాడి విజేతగా నిలిచింది. దాదాపు 80 దేశాల నుండి వచ్చిన అందమైన అతివలను వెనక్కి నెట్టి విశ్వసుందరి టైటిల్ ను నెగ్గింది.

Who is Harnaaz Sandhu, Punjabi Actor And Miss India Universe 2021 in Telugu

గతంలో ఈ ఘనతను సాధించిన సుస్మితా సేన్(1994), లారా దత్తా(2000)ల సరసన నిలిచింది. హర్నాజ్ తన అందంతోనే కాదు.. అద్భుతమైన ప్రసంగంతో.. తెలివిగా సమాధానాలు చెప్పి అందరినీ ఆకట్టుకుంది. ఈ సందర్భంగా హర్నాజ్ కౌర్ సంధు ఎవరు? ఏ ప్రాంతానికి చెందిన వారు? తన గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

"నాకు అన్ని విధాలుగా సహకరించి.. నాకు మార్గనిర్దేశం చేసి, నన్ను సర్వశక్తిమంతురాలిగా చేసిన నా తల్లిదండ్రులకు మరియు మిస్ ఇండియా ఆర్గనైజేషన్‌కు నేను చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నాను.
నాకు మిస్ యూనివర్స్ కిరీటం దక్కాలని కోరుకున్న, ప్రార్థించిన ప్రతి ఒక్కరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెబుతున్నాను. ఇది నా జీవితంలోని మరచిపోలేని మధురమైన ఘట్టం. 21 సంవత్సరాల తర్వాత భారత్ కు విశ్వసుందరి టైటిల్ తీసుకురావడాన్ని చాలా గర్వంగా ఫీలవుతున్నా'' అని హర్నాజ్ సంధు భావోద్వేగ ప్రసంగం చేశారు.

పంజాబీ సుందరి..

పంజాబీ సుందరి..

హర్నాజ్ కౌర్ సంధు ఛండీగడ్ కు చెందిన ఓ మోడల్. తను ప్రాథమిక విద్య మరియు కళాశాల విద్యను అక్కడే పూర్తి చేశారు. తను ఎన్నో సంవత్సరాల నుండి ఫ్యాషన్ రంగంలో ఉన్నారు. అంతేకాదు ఓ పక్క మోడలింగ్ చేస్తూ.. మరోవైపు సినిమాల్లోనూ నటించారు. తను మహిళల హక్కుల కోసం ప్రియాంక చోప్రా నుండి ప్రేరణ పొందారు. హర్నాజ్ ఖాళీ సమయాల్లో యోగా, డ్యాన్స్, కుకింగ్, గుర్రపు స్వారీ, చెస్ ఆడటం వంటివి చేస్తారట.

హర్నాజ్ విజయం చారిత్రాత్మకం..

హర్నాజ్ విజయం చారిత్రాత్మకం..

2000 సంవత్సరంలో లారా దత్తా భూపతి మిస్ యూనివర్స్ టైటిల్ గెలుచుకున్న 21 సంవత్సరాల తర్వాత హర్నాజ్ ప్రపంచ సుందరి టైటిల్ ను గెలవడం చారిత్రాత్మకం. దీంతో మిస్ యూనివర్స్ టైటిల్ పొందిన మూడో భారతీయురాలిగా రికార్డు నెలకొల్పింది. హర్నాజ్ యుక్త వయసులో ఉన్నప్పటి నుంచే ఫ్యాషన్ పోటీ ప్రపంచంలో పాల్గొనడం ప్రారంభించారు.

ఫెమినా మిస్ ఇండియా..

ఫెమినా మిస్ ఇండియా..

హర్నాజ్ కౌర్ సంధు విశ్వసుందరి కంటే ముందే మిస్ చంఢీగడ్ 2017 మరియు మిస్ మ్యాక్స్ ఎమర్జింగ్ స్టార్ ఇండియా 2018 వంటి టైటిల్స్ ను గెలుచుకున్నారు. అంతేకాదు ఫెమినా మిస్ ఇండియా పంజాబ్ 2019 టైటిల్ ను సైతం కైవసం చేసుకున్నారు. ఆ తర్వాత ఫెమినా మిస్ ఇండియా పోటీలోనూ పాల్గొన్నారు.

నేచర్ లవర్..

నేచర్ లవర్..

మిస్ యూనివర్స్ 2021 విజేత హర్నాజ్ నేచర్ లవర్.. గ్లోబల్ వార్మింగ్ మరియు నేచర్ సేవింగ్స్ గురించి తన చెప్పిన సమాధానాలు ఫ్యాషన్ జడ్జిలను ఆకట్టుకున్నాయి. ఎందుకంటే గ్లోబల్ వార్మింగ్ మరియు వాతావరణ మార్పులపై కూడా ఆమెకు బలమైన అవగాహన, అభిప్రాయాలు ఉన్నాయి.

విద్యార్థి దశలోనే..

విద్యార్థి దశలోనే..

హర్నాజ్ సంధు మోడలింగ్, సినిమాలపై ఆసక్తి ఉన్నందునే.. విద్యార్ధి దశలోనే ఫ్యాషన్ రంగం వైపు వడివడిగా అడుగులు వేశారు. మోడలింగులో రాణించడంతో పాటు కొన్ని పంజాబీ సినిమాల్లో కూడా నటించారు. అంతేకాదు ఆమెకు సోషల్ మీడియాలో ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉన్నారు.

జడ్జిల మనసు గెలుచుకుంటూ..

జడ్జిల మనసు గెలుచుకుంటూ..

70వ మిస్ యూనివర్స్ పోటీల్లో.. దాదాపు 80 దేశాల నుండి అందమైన అతివలు పోటీపడ్డారు. వీరందరినీ ఒక్కొక్కరిగా వెనక్కి నెట్టుకుంటూ.. తన అందంతో అందరినీ ఆకట్టుకుంటూ.. తన మాటలతో జడ్జిల మనసు గెలుచుకుంటూ.. టాప్ లో నిలిచింది మన హర్నాజ్ కౌర్ సింధు..

హర్నాజ్ ఆసక్తికర సమాధానాలు..

హర్నాజ్ ఆసక్తికర సమాధానాలు..

ప్రతిరోజూ మనం ఎదుర్కొంటున్న ఒత్తిడిని ఎలా అధిగమించాలి? యువతులకు మీరు ఏమి సలహా ఇస్తారనే ప్రశ్నలకు హర్నాజ్ కౌర్ సంధు ఈ విధంగా సమాధానమిచ్చారు. ఎవరైనా సరే తమకు తాము ప్రత్యేకమే అనే విషయాన్ని గుర్తించాలి. ముందుగా ఇతరులతో కంపేర్ చేయడం వంటివి మానుకోవాలని సూచించారు. మీ జీవితానికి మీరే లీడర్ అనుకోవాలి.. అందుకే తాను ఇక్కడి దాకా వచ్చాను.. వచ్చినా కూడా తడబడకుండా నిలబడ్డానంటూ హూందాగా జవాబిచ్చారు.

వాతావరణ మార్పులపైనా..

వాతావరణ మార్పులపైనా..

గ్లోబల్ వార్మింగ్ అనేది ఒక బూటకమని చెబుతూ ఉంటారు. దీనికి మీ సమాధానం ఏంటనే ప్రశ్నకు.. తను ఈ విధంగా జవాబిచ్చారు. నేచర్ అంటే తనకు ఎంతో ప్రేమ అని.. అయితే నేచర్ కు సంబంధించి చాలా సమస్యలున్నాయి. వాటి గురించి తెలిసి తన గుండె పిండి అవుతుందని.. ఇదంతా మన బాధ్యతారాహిత్యం వల్లే జరుగుతోందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అయితే మనం చేసే ప్రతి చర్య నేచర్ ను కాపాడగలదని.. అందుకు మన వంతు ప్రయత్నం చేయాలని చెప్పడంతో అందరూ ఫిదా అయిపోయారు.

కళ్లలో నీళ్లు..

కళ్లలో నీళ్లు..

అనంతరం 80 దేశాల నుండి వచ్చిన అందమైన అతివలను కాదని.. తానే విశ్వసుందరి అని ప్రకటించిన వెంటనే తన కళ్లలో నీళ్లు తిరిగాయి. తన తలపై విశ్వసుందరి కిరీటాన్ని పెడుతున్న సమయంలోనూ హర్నాజ్ చాలా భావోద్వేగానికి గురయ్యారు.

ఎన్నో అవమానాలు..

ఎన్నో అవమానాలు..

ఒకప్పుడు హర్నాజ్ ఎంతో సన్నగా ఉండేది.. తన చిన్నప్పుడు గట్టిగా గాలొస్తే ఎగిరిపోతావని తన తోటి విద్యార్థులు ఎగతాళి చేసేవారట. అయితే అలాంటి వాటిని మౌనంగా భరిస్తూ.. ఒంటరిగా ఉండేందుకు ఇష్టపడే అమ్మాయి హర్నాజ్ కౌర్.. తనకు తన కుటుంబం మద్దతుగా నిలవడంతో.. మోడలింగ్ లో రాణిస్తూ.. సినిమాల్లో నటిస్తూ ఏకంగా ప్రపంచ స్థాయి కిరీటాన్ని దక్కించుకునే స్థాయికి ఎదిగింది.

FAQs
2021లో మిస్ యూనివర్స్ విజేత ఎవరు?

2021 సంవత్సరంలో మన భారతదేశానికి చెందిన హర్నాజ్ సంధు ప్రపంచ సుందరి(Miss Universe)కిరీటాన్ని కైవసం చేసుకున్నారు. 21 సంవత్సరాల తర్వాత ఇండియాకు ఈ అవార్డు దక్కడం విశేషం.

హర్నాజ్ సంధు ఎవరు? ఏ ప్రాంతానికి చెందిన వారు?

ప్రపంచ సుందరిగా నిలిచిన హర్నాజ్ కౌర్ సంధు పంజాబీ రాష్ట్రానికి చెందిన వారు. మిస్ యూనివర్స్ 2021 పోటీల్లో దాదాపు 80 దేశాల నుంచి వచ్చిన అందమైన అతివలను వెనక్కి నెట్టి విశ్వ సుందరి కిరీటాన్ని కైవసం చేసుకున్నారు. తను ఓవైపు మోడలింగ్ చేస్తూనే.. పలు సినిమాల్లో కూడా నటించారు. అందుకే ఆమెకు సోషల్ మీడియాలో ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉన్నారు.

BoldSky Lifestyle

Desktop Bottom Promotion