Latest Updates
-
రోజుకు 2 స్పూన్లు చాలు..చలికాలంలో ఉక్కులాంటి బలాన్నిచ్చే డ్రై ఫ్రూట్స్,సీడ్స్ పౌడర్ ఎలా చేసుకోవాలంటే.. -
క్యాన్సర్ ముప్పును 80 శాతం తగ్గించే ఒకే ఒక్క పండు ఇదే -
అద్దిరిపోయే రుచితో కీమా చికెన్ సల్నా.. ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ కావాలంటారు! -
మిగిలిపోయిన అన్నంతో అద్భుతమైన టమాటా వెల్లుల్లి రైస్..బ్యాచిలర్స్ కు పండగే పండగ -
ముల్లంగి ఆకులతో ఇలా పకోడీ చేసి చూడండి..లొట్టలేసుకుంటూ తింటారు! -
భారతదేశంలో తొలి సూర్యోదయం ఎక్కడ కనిపిస్తుందో తెలుసా? -
ఉల్లి, వెల్లుల్లి లేకుండానే అద్భుతమైన రుచి..హిమాచల్ ప్రదేశ్ స్పెషల్ మటర్ పనీర్ మీ ఇంట్లోనే చేసుకోండిలా.. -
పొట్ట ఉబ్బరం, గ్యాస్ట్రిక్ నొప్పి ఉన్నప్పుడు.. ఇవి తీసుకుంటే చిటికెలో రిలీఫ్ -
రెస్టారెంట్ స్టైల్ చికెన్ వెల్లుల్లి రైస్.. తక్కువ సమయంలోనే అద్భుతమైన రుచి -
టిక్కెట్ లేకుండా ప్రయాణం..చెకింగ్ కి భయపడి డోర్ లాక్..కదులుతున్న రైలు బయట వేలాడిన టీటీఈ!
ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ఓటమి..వెంటనే 50 వీధి దీపాలు తొలగింపు..వీడియో చూడండి
ఎన్నికల సమయంలో అభ్యర్థులు ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడం, హామీలు ఇవ్వడం మనం చూస్తుంటాం. కానీ ఎన్నికల ఫలితాలు వెలువడిన కొన్ని గంటల్లోనే ఆ సదుపాయాలను వెనక్కి తీసుకుంటే ఎలా ఉంటుంది? స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓ బీజేపీ అభ్యర్థి ఓటమి పాలైన కేవలం మూడు గంటల్లోనే, పలు గ్రామాలు, తండాల్లో ఏర్పాటు చేసిన దాదాపు 50 వీధి దీపాలను తొలగించడం ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతోంది.
అభివృద్ధికి, ఎన్నికల్లో గెలుపుకి సంబంధం ఉండదు అని ఇటీవల ఓ కార్యక్రమంలో ఏపీ మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి చెప్పిన మాటలు గుర్తుకొస్తాయి. ఒక గ్రామాన్ని తాను అభివృద్ధి చేయకముందు తనకు ఆ గ్రామంలో మంచి మెజార్టీ వచ్చిందని, అభివృద్ధి చేశాక తనకు ఆ గ్రామంలో ఓట్లు పడలేదని ఆయన ఒక సందర్భంలో చెప్పారు.

రాజస్థాన్ రాష్ట్రంలో తాజాగా పంచాయత్ సమితి, జిల్లా పరిషత్ ఎన్నికలు జరిగాయి. ఈ క్రమంలో టోంక్ జిల్లాలోని పీప్లూ పంచాయతీ సమితి వార్డు-2లో జరిగిన స్థానిక ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థినిగా ప్రియాంక శర్మ బరిలోకి దిగారు. ఈమె నివాయి నియోజకవర్గ ఎమ్మెల్యే రామ్ సహాయ్ వర్మ పీఏ అలోక్ శర్మ భార్య. కాగా ఈ వార్డు పరిధిలోని పలు నివాస ప్రాంతాలు రాత్రి వేళల్లో చీకట్లో మగ్గుతూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయని గుర్తించిన ప్రియాంక శర్మ..అక్టోబర్ 24న ఈ సమస్య పరిష్కారానికి చొరవ తీసుకున్నారు. గ్రామస్థుల కథనం ప్రకారం ఆమె ఆయా గ్రామాలు, తండాల్లో సుమారు 50 వీధి దీపాలను ఏర్పాటు చేయించారు.

అయితే నవంబర్ 21న ఈ ఎన్నికల ఫలితాలు వెలువడగా.. ప్రియాంక శర్మ 751 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. ఫలితాలు ప్రకటించిన సరిగ్గా మూడు గంటల తర్వాత విద్యుత్ శాఖ సిబ్బంది అక్కడికి చేరుకుని, ఆ 50 వీధి దీపాలను తొలగించారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఆ వీధి దీపాలకు ఎలాంటి అనుమతి లేకుండా అనధికారిక విద్యుత్ కనెక్షన్లు ఇచ్చారని, నిబంధనల ప్రకారమే వాటిని తొలగించామని విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు.
అసలు అక్టోబర్ 24న ఈ వీధి దీపాలను ఏర్పాటు చేసినప్పుడే విద్యుత్ శాఖ ఎందుకు అభ్యంతరం వ్యక్తం చేయలేదని, దాదాపు నెల రోజుల పాటు లేని అభ్యంతరం, సరిగ్గా ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే ఎందుకు వచ్చిందని స్థానికులు నిలదీస్తున్నారు. మరోవైపు, విద్యుత్ శాఖ అధికారులు మాత్రం తమ చర్యను గట్టిగా సమర్థించుకుంటున్నారు. అంతేకాకుండా ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణ కూడా ప్రారంభించినట్లు అధికారులు వెల్లడించారు.
ఎన్నికల్లో ఓటమికి ప్రతీకారంగానే కావాలని వీధి దీపాలను తొలగించారంటూ పలువురు ఆరోపణలు చేస్తున్నారు. అయితే అభ్యర్థి ఓటమి కారణంగానే లైట్లను తొలగించాలని ఆదేశాలు జారీ అయినట్లు ఇప్పటివరకు ఎలాంటి స్పష్టమైన ఆధారాలు లభించలేదు.



Click it and Unblock the Notifications
