Latest Updates
-
ఐఫోన్ 18పై మోజు.. భార్యను సర్ప్రైజ్ చేసేందుకు భర్త ఏం చేశాడో తెలిస్తే నోరెళ్లబెడతారు.! -
రాయలసీమ కారం చికెన్: ఈ ఒక్క సీక్రెట్ మసాలాతో చేస్తే టేస్ట్ జబర్దస్త్ -
మంచింగ్కి మస్తుగా ఉండే గోంగూర మటన్ లివర్ ఫ్రై.. బ్యాచ్లర్స్ సైతం ఈజీగా చేసుకోవచ్చు.! -
హైదరాబాద్ లో పోలీస్ పైశాచికత్వం: మహిళను కొట్టి, జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లి..వీడియో చూడండి -
రఫ్ క్యారెక్టర్లో తగ్గేదే లే.. ఈ రాశుల వారు తప్పున్నా సారీ కూడా చెప్పరట.! -
రాజస్థానీ మలై ప్యాజ్.. రోటీ, చపాతీల్లోకి బెస్ట్ సైడ్ డిష్..ఎలా చేసుకోవాలంటే.. -
చుక్క నూనె, ఇసుక లేకుండానే రోస్టెడ్ పల్లీలు.. ఎలా చేసుకోవాలంటే -
వీటిని ఫ్రిజ్లో పెట్టి తింటే క్యాన్సర్ రావడం పక్కా.. పొరపాటున కూడా ఈ పని చేయకండి.! -
అల్లుడిపై ఐదుగురు పిల్లల అత్త వ్యామోహం..కన్న కూతురికే సవతిలా మారి..చివరికి ఏమైందంటే.. -
నల్ల శనగలతో ఇలా చేసుకుని తింటే లెక్కలేనన్ని లాభాలు.. ఫిట్నెస్ ప్రియులకు పర్ఫెక్ట్ బ్రేక్ఫాస్ట్.!
రేప్ కేసులు, మర్డర్ కేసులు..బెంగాల్ అసెంబ్లీలో మైండ్ బ్లాంక్ అయ్యే నిజాలు..చట్టసభకు 190 మంది నేరచరితులు!
పశ్చిమ బెంగాల్ తాజా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను విశ్లేషిస్తే కళ్లు బైర్లు కమ్మే సంచలన నిజాలు వెలుగుచూశాయి. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ADR) విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం.. కొత్త అసెంబ్లీలో నేరచరితులు, కోటీశ్వరుల సంఖ్య మునుపెన్నడూ లేని విధంగా భారీగా పెరిగింది.

బెంగాల్ రాష్ట్రంలో మొత్తం 292 మంది ఎమ్మెల్యేల అఫిడవిట్లను ఏడీఆర్ పరిశీలించగా.. వారిలో ఏకంగా 65 శాతం (190 మంది) తమపై క్రిమినల్ కేసులు ఉన్నాయని స్వయంగా ప్రకటించారు. 2021లో ఈ సంఖ్య 142గా ఉండేది. మరింత ఆందోళనకరమైన విషయం ఏమిటంటే.. వీరిలో 170 మంది (58 శాతం) అత్యంత తీవ్రమైన నేరారోపణలు ఎదుర్కొంటున్నారు. ఏకంగా 14 మందిపై హత్య కేసులు, 54 మందిపై హత్యాయత్నం కేసులు ఉన్నాయి. మరో 63 మందిపై మహిళలపై దాడులకు సంబంధించిన కేసులు ఉండగా, ఇద్దరు ఎమ్మెల్యేలపై అత్యాచార ఆరోపణలు ఉన్నాయి.
నేరాల్లో ఆ పార్టీదే అగ్రస్థానం
బీజేపీ పార్టీ నుంచి గెలిచిన 206 మంది ఎమ్మెల్యేల్లో 152 మందికి నేరచరిత్ర ఉంది. ఆ తర్వాతి స్థానంలో మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన 81 మంది ఎమ్మెల్యేల్లో 34 మంది ఈ జాబితాలో ఉన్నారు. ఇక సీపీఎం, ఇతర చిన్న పార్టీల నుంచి గెలిచిన అభ్యర్థులందరిపైనా కేసులున్నాయి. ఇందుకు పూర్తి భిన్నంగా కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు మాత్రమే ఎలాంటి మచ్చా లేకుండా క్లీన్ రికార్డుతో ఉండటం విశేషం.

పెరుగుతున్న ధన బలం
కొత్త అసెంబ్లీలో కోటీశ్వరుల సంఖ్య కూడా భారీగా పెరిగింది. వెస్ట్ బెంగాల్ అసెంబ్లీకి తాజాగా ఎన్నికైన 292 మందిలో 178 మంది కోటీశ్వరులే. ఎమ్మెల్యేలందరి ఉమ్మడి ఆస్తి ఏకంగా రూ.1091 కోట్లుగా ఉంది. గత ఎన్నికల్లో రూ.2.53 కోట్లుగా ఉన్న సగటు ఆస్తి.. ఇప్పుడు రూ.3.73 కోట్లకు ఎగబాకింది.
పార్టీల వారీగా చూస్తే టీఎంసీ ఎమ్మెల్యేల సగటు ఆస్తి రూ.5.36 కోట్లు కాగా, బీజేపీ ఎమ్మెల్యేల సగటు రూ.2.97 కోట్లుగా ఉంది. అయితే ఆ ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మాత్రం తలా రూ.17.92 కోట్లతో సభలోనే అత్యంత ధనికులుగా నిలిచారు.
చదువులు, వయసు, మహిళల ప్రాతినిధ్యం
చదువుల విషయానికొస్తే 63 శాతం మంది డిగ్రీ లేదా అంతకంటే పై చదువులు చదివారు. ఒక ఎమ్మెల్యే మాత్రం తనకు అక్షరం ముక్క రాదని ప్రకటించుకున్నారు. వయసు చూస్తే.. చట్టసభలో యువతకు దక్కిన ప్రాధాన్యం కేవలం 16 శాతం (25-40 ఏళ్లు). ఎక్కువ మంది 41 నుంచి 60 ఏళ్ల మధ్య వారే.
ముగ్గురు ఎమ్మెల్యేలు 80 ఏళ్లు పైబడిన వారున్నారు. ఇక మహిళా సాధికారత కేవలం మాటలకే పరిమితమైంది. అసెంబ్లీలో మహిళా ఎమ్మెల్యేల సంఖ్య 37కి (13%) పడిపోయింది. గత ఎన్నికల్లో ఇది 14 శాతంగా ఉండేది.



Click it and Unblock the Notifications
