Latest Updates
-
ప్రొటీన్ పుష్కలం, పోషకాలు పదిలం.. బిర్యానీ రుచిని తలదన్నే శనగల పులావ్.! -
ఏళ్ల కష్టానికి ప్రతిఫలం.. రానున్న రోజులు ఈ ఐదు రాశుల వారికి సువర్ణాధ్యాయం.! -
విదేశీయుడి నోట హనుమాన్ చాలీసా.. వీడియో చూస్తే నోరెళ్లబెట్టకుండా ఉండలేరు.! -
మధ్యాహ్నం వంట చేసే టైం లేదా.. ఎనర్జీనిచ్చే కాలీఫ్లవర్ రైస్.. సులభంగా, టేస్టీగా ఇలా చేయండి.! -
వినాయక చవితి రోజు ఎలుక మీ కంట పడిందా.. మీ జీవితంలో జరిగే కీలక మార్పులివే.! -
శాస్త్రం ప్రకారం ఇంట్లో గణపతిని ఏ మూల ప్రతిష్ఠించాలో తెలుసా.. ఈ దిశలో ఉంచడం చాలా ఉత్తమం.! -
వినాయక చవితి స్పెషల్: పండుగ పూట త్వరగా, రుచికరంగా రవ్వ మోదకాలు.. చేయండిలా.! -
గణనాథుడికి పూజలో శనగల ప్రసాదం.. ఈ టిప్స్‌తో పదే నిమిషాల్లో ఈజీగా చేసుకోండి.! -
వినాయక చవితి స్పెషల్..బొజ్జ గణపయ్యకు ఇష్టమైన శనగపిండి లడ్డూలు..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
గణపతి బప్పా మోరియా.. మీ ప్రియమైన వారికి వినాయక చవితి శుభాకాంక్షలు ఇలా తెలియజేయండి.!
త్వరగా ప్రెగ్నెన్సీ రావాలంటే భార్యాభర్తలు తప్పక చేయాల్సిన 5 పనులు
పెళ్లయిన తర్వాత కొందరు దంపతులు త్వరగా ప్రెగ్నెన్సీ అందుకుంటారు. మరికొందరికి ఆలస్యం అవుతుంది. ఇందుకు చాలా కారణాలు ఉండొచ్చు. కొందరిలో ఆరోగ్యపరమైన సమస్యలు ఉండగా.. మరికొందరిలో తాము తెలిసీతెలియక చేసే పొరపాట్ల కారణంగా త్వరగా గర్భం దాల్చలేరు. ఈ క్రమంలో త్వరగా ప్రెగ్నెన్సీ రావాలని ప్రయత్నించే భార్యాభర్తలు ఈ ఐదు పనులు తప్పక చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.

ఉరుకులు పరుగుల జీవితంలో కొందరు పెళ్లయిన తర్వాత పిల్లలు కనాలనే ఆలోచనను వాయిదా వేసుకుంటున్నారు. ఇందుకోసం పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే మరికొందరు పెళ్లయిన వెంటనే సంతానం కోసం ప్రయత్నిస్తుంటారు. కొందరిలో పలు ఆరోగ్య సమస్యల కారణంగా సంతాన ప్రక్రియ ఆలస్యమవుతోంది. అయితే దంపతుల్లో ఏ సమస్యలు లేకున్నా సరైన పద్ధతులు పాటించకపోవడంతో సహజంగా గర్భం దాల్చలేకపోతున్నారు. ఈ మేరకు ఈ సలహాలు పాటించినట్లయితే మీరు సంతానం కోసం చికిత్స తీసుకుంటున్నా.. సహజంగా గర్భం కోసం ప్రయత్నిస్తున్నా ఉపయోగకరంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అవేంటో చూద్దాం..
అండోత్సర్గ సమయం
సంతానం కోసం ప్రయత్నిస్తున్నప్పుడు తప్పనిసరిగా అండం విడుదలయ్యే సమయం తెలుసుకోవాలి. అండం విడుదలకి రెండు రోజుల ముందు, రెండు రోజల తర్వాత దంపతులు శారీరకంగా కలవడం ద్వారా ప్రెగ్నెన్సీ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అండోత్సర్గం సమయం తెలుసుకునేందుకు ఫార్మసీలో కిట్స్, ఇంకా స్కానింగ్ ద్వారా తెలుసుకోవచ్చు.
టైమింగ్స్
అండం విడుదల సమయంలో రాత్రి 10 నుంచి 11 గంటల మధ్య లేదా తెల్లవారుజామున 5 గంటల సమయం ఆ తర్వాత కలిస్తే గర్భం దాల్చే అవకాశాలు ఎక్కువ. ఆ సమయంలో హార్మోన్లు యాక్టివ్‌గా ఉండే ఛాన్స్ ఉన్న కారణంగా అండం, వీర్య కణాలు చురుగ్గా కదులుతాయి.

సరైన నిద్ర
ప్రెగ్నెన్సీకి అవసరమైన ఈస్ట్రోజిన్, ప్రొజెస్టిరాన్, టెస్టోస్టిరాన్ హార్మోన్స్ పనితీరు చురుగ్గా ఉండేందుకు సరైన నిద్ర అవసరం. రోజూ 7 నుంచి 8 గంటలు భార్యాభర్తలు తప్పనిసరిగా రెగ్యులర్‌గా ఒకే టైంలో ఉండేలా చూసుకోవాలి. నిద్ర లేమితో మానసికంగా, శారీరకంగా ఒత్తిడి పెరుగుతుంది.
సరైన బరువు
సంతానం కోసం ప్రయత్నిస్తున్న వారు తప్పనిసరిగా వారి శరీర బరువును అదుపులో ఉంచుకోవాలి. బరువు తక్కువ ఉన్నా, ఎక్కువ ఉన్నా అది హార్మోన్ల పనితీరుపై ప్రభావం చూపిస్తుంది. ఆరోగ్యకరమైన బరువు పాటించేవారికి ప్రెగ్నెన్సీ అవకాశాలు 30 శాతం ఎక్కువగా ఉంటాయి.
పోషకాహారం
ఆరోగ్యకరమైన అండం, వీర్యకణాల విడుదల కోసం భార్యాభర్తలు తప్పనిసరిగా పోషకాహారం, సమతుల్య ఆహారం తీసుకోవాలి. గుడ్లు, చేపలు, పప్పులు, పాలకూర, మెంతికూర, క్యారెట్, టమాటా, బీట్‌రూట్, బాదం, వాల్‌నట్స్ వంటి ఫెర్టిలిటీ ఫుడ్స్ తీసుకోవడం వారి సంతాన అవకాశాలను మెరుగుపరుస్తాయని నిపుణులు సూచిస్తున్నారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
