Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
బేబీలు బరువు సంతరించుకోవాలంటే!

చాలా మంది తక్కువ ఎత్తుతో తక్కువ బరువుతో చిన్నతనంలో వుంటారు. అటువంటి పిల్లలకు పరీక్షలు నిర్వహించి తగిన చికిత్స చేయాలి. ఆహార లేమిని అరికట్టాలి. అట్లే శారీరకంగా ధైరాయిడ్ లోపం వంటివి వున్నాయా? అనేది పరీక్షించాలి. దీనికిగాను వైద్యులు, కుటుంబ సభ్యులు కలసి పనిచేయాలి. బిడ్డను మరోమారు ఆరోగ్యకరమైన ఎదుగుదలకు సిద్ధం చేయాలి. ఖచ్చితమైన వ్యాధి లేకుండానే బిడ్డల ఎదుగుదల విఫలమవుతోందని సుమారు ఒక శతాబ్దంగా పోషకాహార నిపుణులు గుర్తిస్తున్నారు. ఈ రకంగా ఎదుగుదల లోపించిన పిల్లలు ఆశించిన రీతిలో బరువు పొందటానికి తగిన కేలరీలు లోపలికి తీసుకోలేరు. తీసుకున్నా వాటిని ఖర్చు చేయలేరు.
శిశువులలోను, బేబీలలోను చేసిన అనేక ఆరోగ్య పరీక్షలు మొదటి సంవత్సరాలలోనే వారికి ఈ విధమైన పరిస్ధితి ఏర్పడుతోందని ఇదే సమయంలో వారి శారీరక, మానసిక అభివృధ్ధి చోటు చేసుకుంటుండటంతో అది కుంటుపడుతోందని తెలుపుతున్నాయి. పుట్టిన తర్వాత ఒక బిడ్డ బ్రెయిన్ మొదటి సంవత్సరంలో ఎంత ఎదుగుదల చూపుతుందో అతని మిగిలిన జీవితంలో కూడా అంతే ఎదుగుదల చూపుతుంది. ఈ వయసులో వుండే పోషకాహారలేమి వారి మానసిక అభివృద్ధిపై శాశ్వతంగా వ్యతిరేక ప్రభావం చూపుతోంది.
చాలామంది పిల్లలు తమ మొదటి నాలుగు నెలల వయసులో రెండు రెట్లు బరువు పెరుగుతారు. ఒక సంవత్సరం వచ్చే సరికి మూడు రెట్లు కూడా పెరుగుతారు. కాని బరువు పెరగలేని పిల్లలు దీనిలో విఫలమవుతారు. ఒక్కొక్క సారి పిల్లలు బరువు ఎక్కడం మొదలు పెట్టి అతి త్వరలోనే తమ బరువు కోల్పోతుంటారు. కొంతకాలం గడిచే సరికి వారి ఎత్తు ఎదగడం కూడా నెమ్మదైపోతుంది. పరిస్ధితి మెరుగుపడుతూంటే, పోషకాహారలేమి కల పిల్లలు, వారి చుట్టుపక్కల పరిస్ధితిపై ఆసక్తి ప్రదర్శించలేరు. ఏ ఒక్కరిపైనా ఏకాగ్రత పెట్టలేరు. చికాకు, కోపం అధికమవుతాయి. వయసుకి తగిన ప్రవర్తన వారిలో ఏర్పడదు.
కనుక పిల్లలకు ప్రారంభ వయసులోనే తల్లితండ్రులు వారి వయసుకు తగిన పోషకాహారం ఇవ్వాలి. వారి సమస్యలను తగిన రీతిలో తగిన వైద్య విధానాలతో పరిష్కరించి వారి శారీరక, మానసిక ఆరోగ్యానికి కృషి చేయాలి.



Click it and Unblock the Notifications