Latest Updates
-
స్వీట్, హాట్ తినాలనే కోరికలు విపరీతంగా ఉన్నాయా.. మీ బాడీలో ఈ లోపాలే కారణం.! -
శని దేవుని అభయహస్తం: జూన్ 2027 వరకు ఈ 3 రాశులకు రాజయోగం.. మీరున్నారా ఇందులో? -
కాల్షియం, ఐరన్, ఫైబర్ పుష్కలం..రోజకి ఇది 1 తింటే చాలు కొండలను ఢీకొట్టే శక్తి! -
గ్రహాల అరుదైన కలయిక: ఈ 4 రాశుల వారికి కుబేర యోగం.. మహాలక్ష్మి రాజయోగంతో పట్టిందల్లా బంగారమే! -
బ్రేక్ ఫాస్ట్ కైనా, డిన్నర్ కైనా.. స్టఫ్డ్ పనీర్ కుల్చా చాలా ఈజీగా చేసుకోండిలా..వేళ్లు చప్పరిస్తూ తింటారు! -
మీటింగ్లో కెమెరా ఆన్ చేయాలని మేనేజర్ మొండిపట్టు.. ఉద్యోగిని గెటప్ చూసి మైండ్ బ్లాంక్.! -
రాత్రిపూట అతి ఆలోచనలతో నిద్ర కరువు.. ఈ చిట్కాలతో ఇట్టే కునుకు పట్టేస్తుంది.! -
భార్యాభర్తల మధ్య ఏజ్ గ్యాప్ ఎంత ఉండాలి.. పెళ్లికి ముందు తెలుసుకోవాల్సిన విషయాలు.! -
ఈ ప్రత్యేక మసాలాతో దిండిగల్ వెజ్ బిర్యానీ చేశారంటే..ప్రతి మెతుకు అమృతమే..మిగతావన్నీ మర్చిపోతారు! -
కళ్లకి కాటుక ఎలా పెట్టుకుంటున్నారు.?.. ఇలా అప్లై చేశారంటే కంటి కింద కురుపులు తప్పవు.!
జూన్ 21నే యోగా దినోత్సవం ఎందుకు జరుపుకొంటారో తెలుసా.?
2015 నుంచి ప్రతియేటా జూన్ 21న యోగా దినోత్సవం జరుపుకొంటున్నాం. ప్రతి సంవత్సరం ఒక రోజు యోగాకి అంకితం చేయాలనే ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిపాదన మేరకు ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. మరి అదే రోజు ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటున్నాం.. అందుకు కారణాలేంటి.. ఈ రోజు స్పెషల్ స్టోరీలో..

మన పూర్వీకులు నేర్పిన ఆరోగ్య సూత్రాల మేరకు యోగా ఇప్పుడు చాలా మంది జీవితాల్లో నిత్యకృత్యంగా మారింది. ఇది చాలా అభినందించదగ్గ విషయం. సూర్యోదయ సమయంలో, చల్లని గాలి వీస్తుండగా.. ప్రశాంతమైన మనసుతో యోగాసనాలు వేయడం ద్వారా జీవనశైలి ఎంతో ఆరోగ్యకరంగా మారుతోంది. ఒత్తిడి, అశాంతి, చిరాకు, కోపం ఇవన్నీ తొలగి సంపూర్ణ జీవితాన్ని ఆస్వాదించేందుకు మానవాళి ప్రయత్నిస్తోంది. ప్రతి యేటా వివిధ కార్యక్రమాలతో యోగాపై ప్రజల పట్ల అవగాహన పెరుగుతోంది. స్వయంగా దేశాధినేతలతో సహా ప్రముఖులు, సాధారణ ప్రజలు ఉత్సాహంగా యోగా వేడుకల్లో పాల్గొని చైతన్యం నింపుతున్నారు.
అయితే చాలా మందిలో ఒక సందేహం ఉంటోంది. జూన్ 21నే అంతర్జాతీయ యోగా దినోత్సవం ఎందుకు నిర్వహించుకుంటున్నాం అని. భారతదేశంలో వేల ఏళ్ల కిందటే యోగా పుట్టింది. మన పూర్వీకులు వందేళ్లకి పైగా జీవించడానికి కారణం కూడా వారు చేసే యోగా అభ్యాసాలే. మనిషి ఆరోగ్య చక్రంలో యోగా ప్రాముఖ్యత ఎంతో ఉంది కాబట్టే 2014లో ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ కీలక ప్రతిపాదన తీసుకొచ్చారు. ప్రతి ఏటా ఒకరోజు యోగాకు అంకితం చేయాలనే ప్రతిపాదనకు 177 దేశాలు మద్దతిచ్చాయి.
దీంతో జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవంగా నిర్ణయించాలని ప్రకటించడంతో ఆ మరుసటి ఏడాది నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వచ్చింది. ఈ క్రమంలో జూన్ 21వ తేదీకి ఓ విశిష్టత ఉంది. ఆ తేదీ సంవత్సరంలో అతి పొడవైన రోజు. ఆరోజుకి ఉన్న వైజ్ఞానిక, ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను బట్టి యోగా డేగా నిర్వహించాలని నిర్ణయించారు.
వైజ్ఞానిక కారణం..
ప్రతి యేటా జూన్ 21న భూమి ఉత్తర అర్ధగోళం సూర్యుడి వైపు గరిష్ఠంగా వంగి ఉండటంతో.. ఈ రోజున సూర్యకాంతి భూమిపై ఎక్కువ సమయం పాటు ఉంటుంది. ఫలితంగా ఆరోజు పగటి సమయం ఎక్కువగాను, రాత్రి సమయం తక్కువగాను ఉంటుంది. అందుకే ఆ రోజున అత్యంత పొడవైన రోజుగా పేర్కొంటారు. యోగా శాస్త్రం ప్రకారం.. సూర్యుడిని శక్తి, వెలుగు, ఆరోగ్యానికి మూలంగా చెబుతారు. అందుకే సూర్యుడి శక్తి అత్యధికంగా లభించే ఆ రోజున యోగాకు అనుసంధానిస్తూ యోగా డేగా నిర్ణయించారు.
ఆధ్యాత్మిక కారణాలు
ఆధ్యాత్మిక ఆధారాల ప్రకారం జూన్ 21నుంచే సూర్యుడు ఉత్తరాయణం నుంచి దక్షిణాయనంలోకి పయనిస్తాడు. హిందూ పురాణాల ప్రకారం యోగాను పరిచయం చేసింది శివుడిగా భావిస్తూ ఆయనను ఆదియోగిగా పూజిస్తారు. అందుకే దక్షిణాయనం ప్రారంభమయ్యే ఈ రోజున ఆధ్యాత్మిక సాధనలు, ధ్యానం చేయడానికి ఈ కాలం అత్యంత అనుకూలమైనదిగా భావిస్తూ ఈ రోజును యోగా డేగా జరపాలనే నిర్ణయాన్ని ఐక్యరాజ్యసమితి అంగీకరించింది.

ఈ ఏడాది థీమ్
ఈ క్రమంలో ఈ ఏడాది అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా అధికారిక థీమ్ "ఆరోగ్యకరమైన వృద్ధాప్యం కోసం యోగా" ను ప్రకటించారు. వయసు పైబడిన వారు, వృద్ధులు శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగానే కాకుండా చురుగ్గా ఉండేందుకు యోగా ఎలా దోహదపడుతుందనే అంశంపై అవగాహన కల్పించనున్నారు. అంతేకాకుండా "ఆరోగ్యం, జ్ఞానం, ప్రపంచ శాంతి కోసం యోగా" అనే అనుబంధ థీమ్ సైతం ప్రచారంలో ఉంది.
దేశంలో ఈ ఏడాది అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు నిర్వహించేందుకు వెస్ట్ బెంగాల్‌లోని కోల్‌కతా ముస్తాబవుతోంది. ఇక ఆంధ్రప్రదేశ్‌లో యోగాంధ్ర- 2026 పేరిట కోటి మంది భాగస్వామ్యంతో ప్రత్యేక ప్రచారాలు నిర్వహిస్తూ ప్రజల్లో అవగాహన కల్పించనున్నారు.



Click it and Unblock the Notifications