Latest Updates
-
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.! -
సాంబార్ అమృతంలా కుదరాలంటే.. ఇంట్లోనే ఈ స్పెషల్ సాంబార్ పొడి చేసుకోండి! -
కస్టమర్లకు అలర్ట్.. ఈ నెలలో వరుసగా ఐదు రోజులు బ్యాంకులు బంద్.! -
ఈ రాశుల వారికి రెండో పెళ్లి యోగం..మీది ఉందేమో చూసుకోండి! -
వేళ్లు జుర్రుకుంటూ తినడం పక్కా.. కేవలం 20 నిమిషాల్లో నలుగురికి సరిపోయే మేథీ చమన్ కర్రీ.! -
నిద్రపోయే ముందు ఒక గ్లాసు నీళ్లు తాగితే ఆ ప్రమాదం నుంచి బయటపడొచ్చా? -
మన పూర్వీకుల బలమైన ఆహారం.. రోగాల మాటే ఉండదు.. జొన్న సంగటి ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పొట్టపై స్ట్రెచ్ మార్క్స్‌కి ఖరీదైన ప్రొడక్ట్స్ వద్దు.. ఇంట్లోనే ఇలా చేశారంటే శాశ్వతంగా చారలు మాయం.! -
పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం..కట్ చేస్తే ఫ్యాన్ కి వేలాడుతూ..మౌనిక మృతికి కారణమేంటి? -
పులిసిపోయిన పెరుగుతో ఎన్ని లాభాలో.. ఇన్ని చేయొచ్చని తెలిస్తే ఇకపై అస్సలు పారబోయరు.!
కంప్యూటర్ లా మీ మెదడు పనిచేయాలంటే..తినాల్సిన బెస్ట్ ఫుడ్స్ ఇవే!
వయసు పెరుగుతున్న కొద్దీ మన శరీరంలోనే కాదు, మెదడు పనితీరులోనూ మార్పులు రావడం సహజం. వృద్ధాప్యంలో మతిమరుపు రాకుండా, మానసికంగా చురుకుగా ఉండటానికి క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, నలుగురితో ఆనందంగా గడపడం, రోజుకు తగినంత నిద్రపోవడం చాలా అవసరం. అయితే, వీటన్నింటికంటే సులభమైన, అత్యంత శక్తివంతమైన మార్గం మరొకటి ఉంది. అదే.. సరైన పోషకాహారం.

నిపుణుల ప్రకారం మెదడు ఆరోగ్యానికి ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ బ్రహ్మాస్త్రం లాంటివి. శరీరం స్వయంగా ఉత్పత్తి చేసుకోలేని ఈ కొవ్వులు మెదడు కణాల నిర్మాణానికి, కణ త్వచాలను ఆరోగ్యంగా ఉంచడానికి ఎంతో కీలకం. వీటితో పాటు విటమిన్ బి6, బి9 (ఫోలేట్), బి12 మెదడును క్షీణించకుండా కాపాడతాయి. మెగ్నీషియం పుష్కలంగా ఉండే ఆహారం నాడీ వ్యవస్థను ప్రశాంతంగా ఉంచి, జ్ఞాపకశక్తిని పెంచుతుంది. అలాగే గుండెకు మేలు చేసే ఆహారాలే మెదడుకూ మేలు చేస్తాయని, అవి నాడీ సంబంధిత రుగ్మతలను తగ్గిస్తాయని చెబుతున్నారు.
మెదడుకు శక్తినిచ్చే అద్భుతమైన ఆహారాలు
పిస్తాపప్పులు
యాంటీఆక్సిడెంట్లకు కేరాఫ్ అడ్రస్ పిస్తా పప్పులు. ఇవి మొక్కల ఆధారిత ప్రోటీన్ ను అందించడమే కాకుండా, మెదడు కణాలను అకాల వృద్ధాప్యం, రోగాల బారి నుంచి కాపాడే శక్తివంతమైన ఆయుధంగా పనిచేస్తాయి.
సాల్మన్, ట్రౌట్ చేపలు
చేపలు తినే అలవాటు ఉన్నవారికి సాల్మన్, ట్రౌట్ చేపలు ఒక వరం. ఇందులో మెదడుకు అవసరమైన EPA, DHA అనే ఒమేగా-3లు పుష్కలంగా ఉంటాయి. ఇవి జ్ఞాపకశక్తిని మెరుగుపరచడమే కాకుండా, సెరోటోనిన్, డోపమైన్ వంటి హార్మోన్లను బ్యాలెన్స్ చేసి డిప్రెషన్‌ను దరిచేరనివ్వవు.
అవకాడో
అవకాడో పండ్లలో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వులు నాడీ వ్యవస్థకు చాలా ముఖ్యం. మెదడు నరాల చుట్టూ ఉండే మైలిన్ షీత్(సమాచారాన్ని వేగంగా ప్రసారం చేసే పొర) నిర్మాణానికి అవకాడోలోని ఒమేగా-3లు ఎంతో సహాయపడతాయి.
డార్క్ చాక్లెట్
డార్క్ చాక్లెట్ లోని కోకో పాలిఫెనాల్స్ మెదడులోని ఆక్సిడేటివ్ ఒత్తిడిని, వాపును తగ్గిస్తాయి. మెదడుకు రక్త ప్రసరణను మెరుగుపరిచి, ఆలోచనా శక్తిని, నేర్చుకునే సామర్థ్యాన్ని రెట్టింపు చేస్తాయని అధ్యయనాలు నిరూపించాయి.
వైల్డ్ బ్లూబెర్రీలు
రోజూ బ్లూబెర్రీలు తింటే వయసుతో పాటు వచ్చే మతిమరుపును సులభంగా జయించవచ్చు. ఇవి మెదడు కార్యనిర్వాహక పనితీరును అద్భుతంగా మెరుగుపరుస్తాయని పరిశోధనలు చెబుతున్నాయి.
ఆకుకూరలు, బ్రోకలీ
పాలకూర, కేల్ లాంటి ఆకుకూరల్లో విటమిన్ కె, ల్యూటిన్, ఫోలేట్ ఉంటాయి. అలాగే బ్రోకలీలో ఉండే సల్ఫోరాఫేన్ అనే సమ్మేళనం యాంటీ ఇన్ ఫ్లమేటరీగా పనిచేసి మెదడు కణాలను దెబ్బతినకుండా రక్షిస్తుంది.

గుడ్లు
మెదడు అభివృద్ధికి అత్యవసరమైన విటమిన్లు, ముఖ్యంగా కోలిన్ అనే పోషకం గుడ్లలో దండిగా ఉంటుంది. జీవితాంతం జ్ఞాపకశక్తిని పదిలంగా ఉంచే ఎసిటైల్కోలిన్ ఉత్పత్తికి ఇది చాలా అవసరం.
గుమ్మడి, చియా గింజలు
జింక్, ఐరన్, కాపర్, మెగ్నీషియం, ఒమేగా-3లతో నిండిన ఈ గింజలు మెదడును ఫ్రీ రాడికల్స్ నష్టం నుంచి కాపాడతాయి. చియా గింజలను బాదం వెన్న లేదా పండ్లతో కలిపి అల్పాహారంగా తీసుకోవచ్చు.
బీన్స్,మొక్కజొన్న టోర్టిల్లాలు
బీన్స్ లోని ఐరన్ మెదడుకు ఆక్సిజన్ సరఫరాను పెంచుతుంది. మొక్కజొన్నలో ఉండే ల్యూటిన్ అనే యాంటీఆక్సిడెంట్ ఆక్సీకరణ ఒత్తిడి నుంచి మెదడును రక్షిస్తుంది. మెదడు మన శరీరంలోని 20 శాతం ఆక్సిజన్ ను ఉపయోగిస్తుంది కాబట్టి ల్యూటిన్ లాంటి పోషకాలు చాలా ముఖ్యం.
గ్రీన్ టీ, నీరు అధికంగా ఉండే ఆహారాలు
గ్రీన్ టీలోని కెఫిన్, యాంటీఆక్సిడెంట్లు చురుకుదనాన్ని, ఏకాగ్రతను అమాంతం పెంచుతాయి. వీటన్నింటితో పాటు మెదడు ఎప్పుడూ హైడ్రేటెడ్‌గా ఉండటం ముఖ్యం. తగినంత నీరు త్రాగడంతో పాటు టమోటాలు, దోసకాయ, పుచ్చకాయ వంటి రసవంతమైన పండ్లు, కూరగాయలను మీ డైట్ లో తప్పనిసరిగా చేర్చుకోవడం ద్వారా వయసుతో సంబంధం లేకుండా మీ మెదడును ఆరోగ్యంగా, పదునుగా ఉంచుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
