Latest Updates
-
జపనీస్ క్లౌడ్ ఆమ్లెట్ ఎప్పుడైనా తినారా? మెత్తగా, ఉబ్బెత్తుగా రావాలంటే ఈ చిట్కా పాటించండి -
బ్యాగ్ సర్దుకుని బయలుదేరడమే.. ఈ 3 రాశుల వారికి ట్రావెలింగ్ అంటే మహా పిచ్చి! -
విటమిన్లు, ఐరన్ గని..మునగాకు తొక్కు ఇలా చేసి తింటే జీవితంలో హాస్పిటల్ గుమ్మం తొక్కరు!..యమా రుచి కూడా -
పోషకాలు ఫుల్,ఫైవ్ స్టార్ హోటల్ రుచిని తలదన్నే వెల్లుల్లి సోయా రైస్..ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
నోటికి కమ్మగా, కడుపులో చల్లగా.. కీరదోసకాయతో విలేజ్ స్టైల్ మజ్జిగ పులుసు.! -
సూర్యుడు, శని ఎదురెదురుగా.. ఈ 5 రాశులకు అక్టోబర్ 17 వరకు తీవ్ర నష్టం! -
ట్రైనర్ లేకుండా మొదటిసారి యోగాసనాలు వేస్తున్నారా.. ఈ తప్పులు అస్సలు చేయకండి.! -
సర్వ రోగాలకు మూలం కడుపే..పేగుల్లో పేరుకుపోయిన చెత్తను బయటకు పంపే 10 ఫుడ్స్ -
మన పూర్వీకుల ఆరోగ్య రహస్యం గుమ్మడికాయ దప్పళం.. వారానికోసారి తింటే సర్వరోగాలు మాయం.! -
కేవలం 10 నిమిషాల్లో స్వర్గాన్ని చూపించే వెల్లుల్లి కారం ఆమ్లెట్..ఎలా చేసుకోవాలంటే..
ఏ భర్తా భార్యతో అనకూడని ఒకే ఒక మాట.. లేదంటే విడాకులే దారి.!
గొడవలు లేని భార్యాభర్తల బంధం ఉండదు. కానీ ఆ గొడవలను ఎలా పరిష్కరించుకుంటున్నారు.. ఒకరినొకరు ఎలా అర్థం చేసుకుంటున్నారు అనేది ముఖ్యం. కొందరు చిన్న చిన్న వాటికే విడాకుల దాకా వెళ్తుండగా.. మరికొందరు నాలుగు గోడల మధ్యే తమ సమస్యను పరిష్కరించుకుంటున్నారు. అయితే గొడవ ఎంత పెద్దది అయినా ఏ భర్త కూడా తన భార్యతో ఒక మాట ఎట్టి పరిస్థితుల్లోనూ అనకూడదని సైకాలజిస్ట్ ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు.

తల్లిదండ్రులు, తోబుట్టువుల బంధాన్ని దేవుడు ఇస్తాడు. కానీ ఒక్క జీవిత భాగస్వామని ఎంచుకోవడం మాత్రమే మన చేతుల్లో ఉంటుంది. అప్పటివరకూ ఒక ప్రపంచంలో పెరిగిన వ్యక్తి జీవితంలో కొత్త మనిషి రాగానే చాలా మారిపోతాయి. చుట్టూ ఉన్న పరిస్థితులు, కుటుంబ వ్యవహారాలు, ఆర్థిక పరిస్థితులు ఇలా చాలా విషయాల్లో భార్యాభర్తలు చాకచక్యంగా వ్యవహరిస్తూ అన్యోన్యమైన దాంపత్యాన్ని ఆస్వాదించాలి.
ఆ ఒక్క మాట వద్దు
అయితే ఎంతటి అన్యోన్యమైన బంధమైనా ఏదో ఒక సందర్భంలో పొరపొచ్చాలు ఏర్పడుతుంటాయి. అది కాస్త వాగ్వాదానికి దారితీస్తుంది. ఫలితంగా గొడవకి ఆజ్యం పోసినట్లవుతుంది. ఈ క్రమంలో ఒకరిపై ఒకరు మాటల తూటాలు పేల్చుకుంటారు. ఈ సందర్భంలో కోపంతో ఎలాంటి భర్త అయినా ఒక మాట అనకుండా ఉండలేరని.. అదే తర్వాత తీవ్ర పరిణామాలకి దారితీస్తుందని మనస్తత్వ నిపుణులు చెబుతున్నారు. అదే.. 'ఇంట్లో నుంచి వెళ్లిపో.. నీకిష్టం లేకపోతే ఇంట్లో నుంచి వెళ్లిపోవచ్చు.’అని తరచుగా అంటుంటారు.
అభద్రతాభావం
భర్త ఇలాంటి మాటలు మాట్లాడటం ఆ బంధానికి చాలా ప్రమాదకరమని సైకాలజిస్టులు హెచ్చరిస్తున్నారు. 'ఆడపిల్లకి పెళ్లయ్యాక పుట్టిల్లు పరాయిదైపోతుంది. అత్తిల్లే సర్వస్వం అనుకోమంటారు. కానీ అత్తింట్లోనూ ఇది నీ ఇల్లు కాదు.. నీ ఇష్టం వచ్చినట్లు ఉండటానికి’ అనే ఎత్తిపొడుపులు మాటలు పదే పదే వినిపిస్తాయంటున్నారు సైకాలజిస్టులు. ఇలాంటి మాటలు భార్యలో అభద్రతా భావానికి దారితీస్తాయని చెబుతున్నారు.
రీప్లేసబుల్
డవ సమయంలో భర్త మాట్లాడిన మాటలు భార్య మనసుపై తీవ్ర ప్రభావం చూపిస్తాయని.. వారి నాడీ వ్యవస్థపై ప్రతికూల భావం చూపి మనస్తాపానికి గురయ్యేలా చేస్తాయని అంటున్నారు. 'ఇది తన చోటు కాదా.. తన భర్త మనసులో తనకున్న స్థానం ఇదేనా.. తను వెళ్లిపోతే తన ప్లేస్‌లో వేరే మనిషిని అయినా తెచ్చుకునే ధైర్యం వీళ్లకి ఉంది’ అనే ఆలోచనలు భార్య మనసులో కలుగుతాయని చెబుతున్నారు. ఆ క్షణంలో భర్త కోపాన్ని అర్థం చేసుకోలేరని తెలిపారు.
పిల్లలపై ప్రభావం
అందుకే దంపతుల మధ్య ఎలాంటి పొరపొచ్చాలు ఎదురైనా ఆ సమస్యను సున్నితంగా పరిష్కరించుకోవాలని.. మనస్తాపం కలిగించే మాటలు మాట్లాడి గొడవని మరింత తీవ్రతరం చేసుకోవద్దని సైకాలజిస్టుల సలహా.. భార్యాభర్తల మధ్య గొడవ సాధ్యమయ్యేవరకు నాలుగు గోడల మధ్యే పరిష్కారం కావాలని.. ఈ విషయాలు ఇంట్లో పిల్లల వరకు చేరితే వారి సున్నితమైన మనసుపై ప్రభావం చూపి చదువు, కెరీర్‌పై దృష్టి సారించలేని హెచ్చరిస్తున్నారు.



Click it and Unblock the Notifications
