Latest Updates
-
వృషభం, సింహం, కుంభ రాశుల వారికి ఈ వారం ధన యోగం.. మీ రాశి ఉందా? - 03 నుండి 09 మే 2026 వరకు -
సింహం, ధనుస్సు, మేష రాశుల వారికి ఆదివారం అదృష్ట యోగం..! - ఆదివారం, 03 మే 2026 -
వేసవి స్పెషల్.. ఎవరూ ఊహించని పుచ్చకాయ తొక్క హల్వా.. వావ్ అనాల్సిందే! -
రొటీన్ మామిడికాయ పచ్చళ్లతో బోర్ కొట్టిందా? అయితే క్యారెట్ మామిడి పచ్చడి ట్రై చేయండి..వేడి అన్నంలోకి నెయ్యితో.. -
నీట్ పరీక్ష రోజు పీరియడ్స్ వస్తున్నాయా? కంగారు వద్దు.. ఈ చిట్కాలు మీకోసమే! -
తెలంగాణలో మండుతున్న ఎండలు: గర్భిణులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
పొయ్యి వెలిగించే పనే లేదు.. నోట్లో వెన్నలా కరిగిపోయే పచ్చి కొబ్బరి పాయసం -
భార్య వేధింపులు భరించలేక టెక్కీ ఆత్మహత్య: అసలేం జరిగింది? -
సమ్మర్ లో దొరికే అరుదైన పండు..బీపీ కంట్రోల్, జీర్ణక్రియ నుంచి కాలేయ సంరక్షణ వరకు బోలెడు ప్రయోజనాలు -
వ్యతీపాత యోగంతో ఈ రాశుల వారికి రాజయోగం.. ఈ తప్పులు అస్సలు చేయకండి!
గర్భిణీ స్త్రీలకు 10 హెల్తీ అండ్ టేస్టీ...టేస్టీ స్నాక్స్ ..!
సాధారణంగా మహిళలు గర్బం పొందిన తర్వాత ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను కలిగి ఉండాలి. బ్రేక్ ఫాస్ట్, లంచ్, డిన్నర్ కు తీసుకొనే ఆహారంతో పాటు మద్యమద్యలో తీసుకొనే స్నాక్స్ కూడా చాలా ఆరోగ్యకరమైనవై ఉండాలి. మహిళ మొత్తం గర్భధారణ కాలంలో తీసుకొనే ఆహారం పొట్టలో పెరిగే శిశువు యొక్క ఆరోగ్యం మీద కూడా ఆధారపడి ఉన్నది. మహిళ గర్భం పొందిన తర్వాత, శిశువుకు హాని కలిగించే ఆల్కహాల్, బెవరేజస్ మరియు ఇతర ఆహారాలకు దూరంగా ఉండాలని డాక్టర్స్ సూచిస్తున్నారు. ఇక చిప్స్, ఫ్రెంచ్ ఫ్రైస్, మరియు సాఫ్ట్ డ్రింక్స్ మరియు ఇతర స్నాక్స్ మాటేంటి అంటారా? ఇవి గర్భిణీలకు మరియు పొట్టలో పెరిగే శిశువుకు సురక్షితమా కాదా? అనేదేగా మీ సందేహం?ఇలాంటి ఆహారాలను పరిమితంగా తీసుకోవడం వల్ల ఎటువంటి ప్రమాదం ఉండదు.
గర్భధారణ సమయంలో బ్రేక్ ఫాస్ట్, లంచ్ మరియు డిన్నర్ కే పరిమితం కాకుడదు. అప్పుడప్పుడు హెల్తీ ప్రెగ్నెన్సీ స్నాక్స్ ను కూడా తీసుకోవడం వల్ల బేబీ హెల్తీ సహాయపడే న్యూట్రీషియన్స్ ను అందివ్వడంలో సహాయపడుతుంది. గర్భిణీ డైట్ ప్లాన్ లో హెల్తీ స్నాక్స్ ను తీసుకోవడం వల్ల బేబీ ఆరోగ్యానికి అవసరం అయ్యే న్యూట్రీషియన్స్ మరియు ఎనర్జీ అందివ్వవచ్చు.
ఒక హెల్తీ ప్రెగ్నెన్సీ డైట్ ను అనుసరించడానికి, తరచూ తక్కువ మోతాదులో ఆహారంను తీసుకుంటుండాలి. ఒకే సారి ఎక్కువ ఆహారాన్ని తీసుకోవడానికి బదులుగా, రోజులో నాలుగైదు సార్లు, మితాహారాన్ని తీసుకోవడం ఇటు తల్లి, అటు శిశువు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఇది చాలా ఎఫెక్టిగా పనిచేస్తుందని నిర్ధారించబడినది. వీటితో పాటు గర్భాధారణ కాలంలో గర్భిణీ స్త్రీలకు అవసరమయ్యే ప్రెగ్నెన్సీ స్నాక్స్ ఈ క్రింది విధంగా ఉన్నాయి..

1. పండ్లు :
గర్భిణీలకు ఫ్రూట్స్ సురక్షితమైనవి మరియు గర్భిణీ స్త్రీలకు బెస్ట్ చాయిస్. ఫ్రూట్స్ లో ఆపిల్, అరటి, ఆరెంజ్, పియర్స్ వంటివి చేర్చుకోవాలి. వీటితో పాటు మరికొన్ని ఫ్రూట్స్ కూడా ఉన్నాయి. గర్భిణీ డైలీ డైట్ లో ఫ్రూట్ అండ్ వెజిటేబుల్స్ ఒకభాగం.

2. ట్రైల్ మిక్స్ :
మీకు క్రంచీ స్టఫ్ ఇష్టపడుతున్నట్లైతే మీరే ఇంట్లో ఓన్ గా తయారుచేసుకోండి,. సెరల్స్, డ్రై ఫ్రూట్స్ మరియు నట్స్ వంటివి రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలి. ఈ క్రించీ స్నాక్స్ గర్భిణీకి స్వీట్ టేస్ట్ అందిస్తుంది. మరియు ఆకలి తగ్గిస్తుంది. ఇది హైప్రోటీన్ ఫుడ్. మీకు ఎప్పుడైనా క్రంచీ స్టఫ్ ను తీనాలని కోరిక కలిగినప్పుడు, బంగాలదుంపను స్లైస్ గా కట్ చేసి, వాటి మీద కొద్దిగా దాల్చిన చెక్క మరియు పంచదార చిలకరించి 250డిగ్రీల్లో ఒక గంట పాటు వాటిని బేక్ చేయాలి. రెగ్యులర్ చిప్స్ తో పోల్చితే హోం మేడ్ పొటాటో చిప్స్ లో సోడియం మరియు ఫ్యాట్ చాలా తక్కువగా ఉంటుంది.

3. సలాడ్స్ :
గర్భిణీలకు సలాడ్స్ బెస్ట్ ఆప్షన్. ఇది న్యూట్రీషియన్స్ ను అందిస్తుంది. చాలా వరకూ రెస్టారెంట్స్ లో గ్రేట్ సలాడ్ బార్స్ ఉంటాయి. వీటిలో వివిధ రకాల సలాడ్స్ ఉంటాయి. ఇవే కాకుండా ఇంట్లోనే తయారుచేసుకోచ్చు. పీనట్ బటర్ లేదా కాటేజ్ చీజ్ వంటివి జోడించి ఒక బౌల్ సలాడ్స్ ను తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది.

4. పెరుగు:
గర్భిణీలకు క్యాల్షియం ఎక్కువగా అవసరమవుతుంది. తల్లికి మాత్రమే కాదు, బిడ్డకు కూడా. పొట్టలో పెరిగే బేబీ బోన్ హెల్త్ మరియు దంతాలు ఏర్పడుటకు గ్రేట్ గా సమాయపడుతుంది. పెరుగులో మీకు ఇష్టమైన పదార్థాలను జోడించి స్మూతీస్ రూపంలో తీసుకోవచ్చు. వీటిలో ప్రోబయోటిక్స్ ఎక్కువగా ఉంటాయి . ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.

5. బేబీ క్యారెట్ :
క్యారెట్ లో ఫైబర్ మరియు విటమిన్ ఎ ఎక్కువగా ఉంటుంది. మీకు ప్లెయిన్ బేబీ క్యారెట్స్ నచ్చకపోతే , వీటిని పెరుగులో డిప్స్ చేసి సలాడ్ డ్రెస్సింగ్ గా తయారుచేసి తీసుకోవచ్చు. వీటిని ఫ్రై చేసి తీసుకోవచ్చు. అంతే టేస్టీ స్నాక్ రిసిపి రెడీ.

6.గుడ్డు:
ఇది పూర్తిగా హైప్రోటీన్ ఫుడ్. హార్డ్ బాయిల్డ్ ఎగ్స్ ఫర్ఫెక్ట్ స్నాక్. ఈ స్నాక్ శిశువు యొక్క మెదడు డెవలప్ మెంట్ కు మరియు నరాలా ఆరోగ్యానికి చాలా ఆరోగ్యకరమైనది. పెప్పర్ మరియు సాల్ట్ చిలకరించి తీసుకోవడం మరీ మంచిది

7. సెరల్స్ మరియు పాలు:
సెరల్స్ లో మనకు అవసరం అయ్యే విటమిన్స్ మరియు మినిరల్స్ తో నిండి ఉంటాయి. కాబట్టి, వీటిని సింపుల్ స్నాక్స్ గా తీసుకోవచ్చు . ఎప్పుడైతే మీరు సెరల్స్ ను కొనుగోలు చేయాలనుకుంటారో, అప్పుడు అధిక ఫైబర్ ఉన్న వాటిని ఎంపిక చేసుకోవాలి . చికెన్ కు ప్రత్యామ్నాయంగా సెరెల్స్ తీసుకోవడం వల్ల తల్లికి మరియు బిడ్డకు అవసరం అయ్యే క్యాల్షియంను అందివ్వవచ్చు. విటమిన్ సి మరియు యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండే సెరెల్స్ ను మీ రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం చాలా అవసరం.సెరల్స్ కు పాలు మిక్స్ చేసి తీసుకుంటే ప్రయోజనాలు మరింత ఎఫెక్టివ్ గా ఉంటాయి.

8. స్మూతీస్ :
మరో హెల్తీ ప్రెగ్నెన్సీ డైట్ స్మూతీస్. దీన్ని పండ్లు మరియు పెరుగుతో తయారుచేసుకోవచ్చు . దీన్ని మీరు మీ ఇంట్లోనే తయారుచేసుకోవచ్చు . నాన్ ఫ్యాట్ పెరుగు మరియు మీకు నచ్చిన పండ్లతోటి స్మూతీస్ ను తయారుచేసుకోవాలి. ఇది ఖచ్చితంగా హెల్తీ ప్రెగ్నెన్సీ స్నాక్. ఎందుకంటే గర్భిణీ స్త్రీకి అవసరం అయ్యే ప్రోటీన్, క్యాల్షియం, మరియు ఇతర న్యూట్రీషియన్స్ ను కలిగి ఉన్నది.

9. మల్టీ గ్రెయిన్ క్రాకర్స్:
మల్టీ గ్రెయిన్ క్రాకర్స్ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. వీటిని మీరు కొనాలనుకొన్నప్పుడు, చీజ్ తో తయారుచేసి క్రాకర్స్ ను ఎంపిక చేసుకోవాలి. ఎందుకంటే వీటిలో ఫైబర్, క్యాల్షియం మరియు ప్రోటీన్స్ తో నిండి ఉంటాయి. గర్భిణీతో పాటు బేబీకి కూడా ఆరోగ్యకరం.

10. హోల్ వీట్ బ్యాగెల్స్:
మీరు మీ ఇంట్లో సాండ్విచ్ తయారుచేయాలని కోరుకున్నప్పుడు. వైట్ బ్రెడ్ కు బదులుగా బ్రైన్ లేదా మల్టీ గ్రైయిన్ బ్రెడ్ ను ఉపయోగించాలి . కీరదోస, ముల్లంగి, బంగాళదుంప లేదా టమోటో మరియు ఉల్లిపాయను శాండ్విచ్ తయారుచేయడానికి ఉపయోగించాలి. ఇంకా మీరు చీజ్ మరియు చికెన్ ప్యాటీ రెడీ చేసి బ్రైడ్ స్లై మద్య ఉంచి సర్వ్ చేయాలి.



Click it and Unblock the Notifications