Latest Updates
-
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.! -
సాంబార్ అమృతంలా కుదరాలంటే.. ఇంట్లోనే ఈ స్పెషల్ సాంబార్ పొడి చేసుకోండి! -
కస్టమర్లకు అలర్ట్.. ఈ నెలలో వరుసగా ఐదు రోజులు బ్యాంకులు బంద్.! -
ఈ రాశుల వారికి రెండో పెళ్లి యోగం..మీది ఉందేమో చూసుకోండి! -
వేళ్లు జుర్రుకుంటూ తినడం పక్కా.. కేవలం 20 నిమిషాల్లో నలుగురికి సరిపోయే మేథీ చమన్ కర్రీ.! -
నిద్రపోయే ముందు ఒక గ్లాసు నీళ్లు తాగితే ఆ ప్రమాదం నుంచి బయటపడొచ్చా? -
మన పూర్వీకుల బలమైన ఆహారం.. రోగాల మాటే ఉండదు.. జొన్న సంగటి ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పొట్టపై స్ట్రెచ్ మార్క్స్‌కి ఖరీదైన ప్రొడక్ట్స్ వద్దు.. ఇంట్లోనే ఇలా చేశారంటే శాశ్వతంగా చారలు మాయం.! -
పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం..కట్ చేస్తే ఫ్యాన్ కి వేలాడుతూ..మౌనిక మృతికి కారణమేంటి? -
పులిసిపోయిన పెరుగుతో ఎన్ని లాభాలో.. ఇన్ని చేయొచ్చని తెలిస్తే ఇకపై అస్సలు పారబోయరు.!
హ్యాపీ ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్ చేసుకోవల్సినవి..!
గర్భం పొందాలని కోరుకునే వారు, గర్భం పొందడానికి ముందు కొన్ని ఆరోగ్యకరంగా కొన్ని మార్పులు చేసుకోవాలి . గర్భం పొందడం సులభమే, కానీ, గర్భాధారణకు స్త్రీ , పురుషులిద్దరు రెడీ గా ఉండాలి. పాజిటివ్ రిజల్ట్ తెలుసుకోవడానికి ముందు గా పురుషులు ఎక్కువ ఎఫర్ట్ పెట్టాల్సి ఉంటుంది.
దాంపత్య జీవితంలో ప్రెగ్నెన్సీ అనే ఒక మధురమైన , ఘట్టం, పది నెలల పాటు భార్యభర్తలిద్దరు అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాల్సిన విషయం, ముఖ్యంగా గర్భం పొందిన మహిళ కొన్ని మార్పుల గురించి ఆమె బాధ్యతగా ఎక్కవ జాగ్రత్తలు తీసుకోవల్సి ఉంటుంది .
గర్భం పొందే మహిళ మానసికంగా, శారీరకంగా స్ట్రాంగ్ గా ఉండాలని నిపుణుల అభిప్రాయం. రెగ్యులర్ బరువు చెక్ చేయించుకోవడం, బ్యాలెన్స్ డైట్ ఫాలో అవ్వడం, ఈ రెండు విషయాను మహిళలు తప్పనిసరిగా గుర్తించుకోవాలి,.
అదేవిధంగా పురుషులు, స్మోకింగ్, ఆల్కహా వంటి చెడు అలవాట్లను మానుకోవల్సి ఉంటుంది . ఈ రెండు అలవాట్ల వల్ల ప్రెగ్నెన్సీలో తల్లికి మాత్రమే కాదు బిడ్డకు కూడా ఎక్కువ హాని జరుగుతుంది. ముఖ్యంగా ఈ అలవాట్ల వల్ల గర్భం పొందడం కష్టమవుతుంది. గర్భం పొందడానికి కొన్ని నెలల ముందే ఈ అలవాట్లను మానుకోవడం వల్ల మగవారి శరీరం కంట్రోల్ అవుతుంది.
అందువల్ల, ఇప్పటికే పిల్లలకోసం ప్రయత్నించే వారు , 6 నెలలపాటు డాక్టర్ సలహాలను రెగ్యులర్ గా ఫాలో అవుతుంటే తప్పకుండా గర్భం పొందడం సులభం అవుతుంది, గర్భధారణలో ఎలాంటి సమస్యలుండవు .
ఒక వేల అలాంటి అలవాట్లున్న మగవారు, బాడీ డిటాక్సిఫికేషన్ జరగకపోతే, తల్లి, బిడ్డకు సురక్షితం కాదు, ఫీటస్ మీద ఎక్కువ ప్రభావం చూపుతుంది . ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకోవాలనుకొనే వారు ముందు గా జంటలు ఆరోగ్యపరంగా కొన్ని మార్పులు చేరోవాలి. అవేంటంటే..

బరువు కంట్రోల్లో ఉంచుకోవాలి:
గర్భం పొందడానికి అధికబరువు లేదా తక్కువ బరువు ఉండటం కూడా కష్టమే. కాబట్టి, గర్భం పొందడానికి ఆరోగ్యపరంగా ఎంత బరువు ఉండాలన్న విషయాన్ని నిపుణులు సహాయంతో తెలుసుకోవాలి .మీరు ఎత్తుకు దగ్గ బరువు ఉన్నారో లేదో డాక్టర్లు సూచిస్తారు. గర్భం పొందడానికి ఇది ఒక ఆరోగ్యకరమైన మార్పు.

శారీరకంగా ఫిట్ గా ఉండాలి :
మీరు అనుకున్నట్లు సరైన బరువుతోనే ఉన్నారంటే , శారీరికంగా బరువు మాత్రమే, మానసికంగా ఫిట్ గా ఉండాలి . గర్భధారణ సమయంలో శారీరకంగా, మానసికంగా అనేక మార్పులు చోటుచేసుకుంటాయి . అందుకు మీ శరీరంను ఆరోగ్యంగా మరియు ఫిట్ గా మార్చుకోవాలి.

కాఫీ తగ్గించాలి:
గర్భధారణ సమయంలో కాఫీ సీరియస్ సైడ్ ఎఫెక్ట్స్ ను కలిగిస్తుంది. కాబట్టి, గర్భం పొందాలనుకొనే వారు, గర్భం పొందడానికి ముందునుండి కాఫీ తాగే అలవాటు మానుకోవాలి . అలాగే కార్బోనేటెడ్ డ్రింక్స్, సోడా వంటివి తాగకపోవడం మంచిది.

ఒత్తిడి తగ్గించుకోవాలి:
తల్లికావాలని కోరుకునే వారు మానసికంగా స్ట్రాంగ్ గా ఉండాలి. ఒత్తిడి వల్ల మీ కల నెరవేకపోవచ్చు . బేబీకోసం ప్లాన్ చేసుకోవాలనుకొనే వారు , ఒత్తిడి లేనిజీవితంను గడపాలి, స్టెస్ కు గురికాకుండా ఇతర మార్గాలను చూసుకోవాలి.

డైట్ లో మార్పులు:
గర్భం పొందడానికి 6నెలల ముందు నుండే డైట్ లో మార్పులు చేసుకోవాలి. ఫ్రూట్స్ , వెజిటేబుల్స్, త్రుణ ధాన్యాలు, లీన్ ప్రోటీన్స్(చికెన్, గుడ్డు, మరియు బీన్స్ )మరియు డైరీ ప్రొడక్ట్స్ ఎక్కువ తీసుకోవాలి.

ఫొల్లెట్ సప్లిమెంట్:
శరీరంలో తగినంత ఫొల్లెట్ ఉన్నట్లైతే గర్భం పొందడం సులభం. ఫొల్లెట్ వల్ల పుట్టబోయే బిడ్డలలో తల, వెన్నెముకకు ఎలాంటి సమస్యలుండవు . ఫొల్లెట్ అధికంగా ఉండే వెజిటేబుల్స్, సిట్రస్ ఫ్రూట్స్, మరియు బీన్స్ వంటి వాటిలో ఫోలిక్ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి . కాబట్టి, ఎక్కువ పోషకాలుండే ఆహారాలను అధికంగా తీసుకోవాలి.

చెడు అలవాట్లు మానుకోవాలి:
మహిళలు స్మోకింగ్ అలవాటున్న వారు, గర్భం పొందడాని6 నెలల ముందు నుండే స్మోకింగ్ అలవాటును మానుకోవాలి . స్మోకింగ్ వల్ల గర్భం పొందే అవకాశాలు 20శాతం ఎక్కువగా ఉంటాయి . కాబట్టి, ఇప్పటి నుండి స్మోక్ చేయడం మానేయాలి.

డాక్టర్ ను సంప్రదించాలి:
చివరి, గర్భం పొందడానికి ముందుగా, డాక్టర్ ను కలిసి, డాక్టర్ సలహాలను, సూచనలను తప్పనిసరిగా అనుసరించాలి. గర్భధారణలో కలిగే మార్పులను గురించి అడిగి తెలుసుకోవాలి.



Click it and Unblock the Notifications
