Latest Updates
-
నవరాత్రి మొదటి రోజే ప్రమాదకర వైధృతి యోగం.. ఈ 3 రాశుల వారికి బ్యాడ్ టైమ్ షురూ! -
శవాల ముక్కు, చెవుల్లో దూది ఎందుకు పెడతారో తెలుసా? గరుడ పురాణం ఏం చెబుతోంది? -
ఆరోగ్యానికి మేలు చేసే మునగకాయ పచ్చడి ..ఇలా చేస్తే ఏడాది అయినా అస్సలు పాడవదు! -
అక్టోబర్ 11న చిత్త నక్షత్రంలోకి సూర్యుడు.. ఈ 3 రాశుల వారు జర భద్రం! -
బిర్యానీ కూడా దీని ముందు బలాదూర్.. తెలంగాణ స్టైల్ బగారా రైస్, పనీర్ కర్రీ ఇలా చేసి తింటుంటే స్వర్గమే! -
ఉద్యోగులూ అలర్ట్..మెడ, వెన్ను నొప్పులతో నరకం చూస్తున్నారా? విముక్తి కోసం ఏం చేయాలంటే? -
రైస్, చపాతీలోకి అద్దిరిపోయే బంగాళదుంప ముద్ద కూర.. ఇలా చేస్తే మళ్లీ మళ్లీ అడుగడం గ్యారెంటీ! -
గుడిసెలో ఉండే బిచ్చగాడికి 21 మంది భార్యలు..ఏం బెల్లం పెట్టావ్ రా అయ్యా.. -
ఎలక్ట్రిక్ కెటిల్ ఎలా క్లీన్ చేయాలి? ఈ సింపుల్ ట్రిక్ తో నిమిషాల్లో కొత్తదానిలా మెరుస్తూ.. -
అసలు సిసలైన పల్లీ చట్నీ.. ఒక్కసారి ఇలా చేసి చూడండి, మళ్లీ మళ్లీ కావాలంటారు!
జస్ట్ 10 నిమిషాల్లో పూరీ కర్రీ..ఇలా చేశారంటే ఎన్ని పూరీలైనా అలా తినేస్తుంటారు!
పొద్దున్నే మనదేశంలో ఎక్కువ మంది తినే బ్రేక్ ఫాస్ట్ లలో పూరీ ఒకటి. కశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఎక్కడికి వెళ్లినా ఉదయం పూట చాలా ఇళ్లల్లో, హోటల్స్ లో పూరీ ఘుమఘుమలు వస్తాయి. అయితే పూరీ ఎంత టేస్టీగా ఉన్నా సరే అందులో సరైన కూర లేకుంటే మాత్రం తినాలన్న ఇంట్రెస్ట్ పోతుంది.
అందుకే అస్సలు పెద్దగా కష్టపడకుండా పూరీలోకి చాలా సింపుల్ గా 10 నిమిషాల్లోనే కర్రీ ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి. దీని తయారీకి పెద్దగా ఎక్కువ పదార్థాలు కూడా అవసరం లేదు. బ్యాచిలర్స్ కి కూడా ఇది ఈజీ. వీకెండ్స్ లో సరదగా పూరీ చేసుకుంటే ఈ కర్రీని ఈజీగా చేసుకొని ఎంజాయ్ చేయవచ్చు. ఈజీగా 10 నిమిషాల్లో పూరీ కర్రీ చేసుకోవడం ఎలానో ఇప్పుడు చూద్దాం.

పూరీ కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలు
-నూనె
-తాలింపు గింజలు
-ఉల్లిపాయలు
-బంగాళదుంపలు
-పచ్చిమిరపకాయలు
-కరివేపాకు
-ఉప్పు
-పసుపు
పూరీ కర్రీ తయారీ విధానం
-స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ పెట్టుకోండి. అందులో నూనె పోసి వేడి చెయ్యాలి. వేడెక్కిన ఆయిల్ లో 1 టీస్పూన్ తాలింపె గింజలు(ఆవాలు, శెనగపప్పు, జీలకర్ర)వేసి వేయించాలి.
-తాలింపు గింజలు వేగిన తర్వాత అందులోనే సన్నగా, పొడవుగా తరిగిన 2 ఉల్లిపాయల చీలికలు, పొడవుగా చీరిన 3 పచ్చిమిరపకాయల ముక్కలు, కొంచెం కరివేపాకు, రుచికి సరిపడా ఉప్పు వేసి వేయించుకోవాలి.
-ఉల్లిపాయలు కొంచెం లైట్ గా వేగిన తర్వాత అందులో అర టీస్పూన్ పసుపు వేసి కలుపుకోవాలి. తర్వాత ఉల్లిపాయల్లో పావు గ్లాసు నీళ్లు పోసుకొని కలుపుకోవాలి. మూత పెట్టి 5 నిమిషాలు ఉల్లిపాయలను మీడియం మంట మీద ఉడకనివ్వాలి.
-5 నిమిషాల తర్వాత ఉల్లిపాయలు బాగా మెత్తగా ఉడికిపోయి ఉంటాయి. అప్పుడు అందులో పావు కిలో పొట్టు తీసేసిన బంగాళదుంపలను అందులో వేసి గరిటతో వాటిని అదుముతూ మ్యాష్ చేసుకుంటూ బాగా కలిసేలా కలుపుకుంటూ ఉండాలి. కూర దగ్గరపడి, సరైన కన్సిస్టెన్సీలోకి రాగానే స్టవ్ ఆపేయండి.
-అంతే పూరీ కర్రీ రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
