Latest Updates
-
థాయ్లాండ్ ఫేమస్ మ్యాంగో స్టిక్కీ రైస్.. మీ ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి! -
జీరా రైస్ ఇలా చేస్తే రెస్టారెంట్ రుచి గ్యారెంటీ.. 5 నిమిషాల్లో అయిపోయే సూపర్ ట్రిక్ ఇదే! -
గ్రహాల కదలికలతో ఈ రాశుల వారికి ఊహించని ధనలాభం..ఈరోజు మీ అదృష్టం ఎలా ఉందంటే! -
ఒక్క చుక్క మందు తాగకపోయినా లివర్ డ్యామేజ్.. ఈ 5 తప్పులే కారణం! -
పుల్లపుల్లగా, కారంకారంగా..నోరూరించే ఒడిశా స్పెషల్ అంబుల రాయ్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
సింహం, ధనుస్సు, మేష రాశుల వారికి రాజయోగం.. మీ జాతకం ఎలా ఉంది? - సోమవారం, 25 మే 2026 -
మిగిలిన అన్నంతో క్రీమీ రబ్డీ..తింటే మళ్లీ మళ్లీ కావాలంటారు! -
ఎండల నుంచి ఇట్టే ఉపశమనం ఇచ్చే గోవా స్పెషల్ డ్రింక్.. -
క్యారెట్ హల్వా ఇలా చేస్తే.. రెస్టారెంట్ రుచిని మించిపోతుంది! ఆ సీక్రెట్ ఏంటో తెలుసా? -
నెమ్మది నడక వెనుక ఉన్న అసలు కారణం బయటపెట్టిన సైంటిస్టులు!..
చికెన్, మటన్ కంటే బెస్ట్..ఇంట్లోనే కరకరలాడే ఫిష్ ఫ్రై చేసుకోండిలా..
నాన్ వెజ్ అనగానే చాలా మందికి ముందుగా గుర్తొచ్చేది చికెన్ లేదా మటన్. కానీ, ఆరోగ్యానికి ఎలాంటి హాని చేయకుండా, శరీరానికి పోషకాల గనిని అందించే అద్భుతమైన ఆహారం చేపలు. మెగ్నీషియం, ఫాస్ఫరస్, సోడియం, జింక్, ఐరన్, సెలీనియం వంటి ముఖ్యమైన మినరల్స్..ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ చేపల్లో మెండుగా ఉంటాయి. ఇవి మన చర్మ సౌందర్యాన్ని రెట్టింపు చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయి.
ఎర్ర మాంసం (Red Meat) ఎక్కువగా తినడం వల్ల కొన్ని ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆరోగ్య స్పృహ ఉన్న మాంసాహారులు ఎక్కువగా చేపలను ఇష్టపడతారు. ఇవి రుచికి రుచిని, ఆరోగ్యానికి ఆరోగ్యాన్ని ఇస్తాయి. సాయంత్రం వేళ ఏవైనా స్నాక్స్ తినాలనిపిస్తే, బయట దొరికే జంక్ ఫుడ్ కంటే ఇంట్లోనే వేడిగా, కరకరలాడే ఫిష్ ఫ్రై చేసుకోవడం ఒక బెస్ట్ ఆప్షన్.

ఫిష్ ఫ్రై తయారీకి కావలసిన పదార్థాలు
చేపలు - 250 గ్రాములు
ఎర్ర కారం పొడి - 1 టీస్పూన్
వెల్లుల్లి పొడి (లేదా పేస్ట్) - 1 టీస్పూన్
మిరియాల పొడి లేదా ఇతర మసాలా పొడి - అర టీస్పూన్
నిమ్మరసం - అర టీస్పూన్
ఉప్పు - రుచికి సరిపడా
నూనె - వేయించడానికి
ఫిష్ ఫ్రై తయారీ విధానం
-ముందుగా చేప ముక్కలను పసుపు, ఉప్పు వేసి నీటితో శుభ్రంగా కడగాలి. నీరంతా పోయిన తర్వాత, ఒక గిన్నెలో చేప ముక్కలను తీసుకుని, అందులో రుచికి సరిపడా ఉప్పు, నిమ్మరసం, వెల్లుల్లి పొడి, కారం, మసాలా పొడి వేసి అన్నీ చేప ముక్కలకు బాగా పట్టేలా సున్నితంగా కలపాలి.
-ఇలా మసాలా పట్టించిన చేప ముక్కలను కనీసం ఒక గంట పాటు ఫ్రిజ్ లో ఉంచి మ్యారినేట్ చేయాలి. ఇలా చేయడం వల్ల మసాలాలు చేపల లోపలికి వెళ్లి, వేయించినప్పుడు ముక్కలు కరకరలాడుతూ ఎంతో రుచిగా ఉంటాయి.
-ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టి అందులో వేయించడానికి సరిపడా నూనె పోయాలి. నూనె బాగా వేడెక్కిన తర్వాత ఫ్రిజ్ లో ఉంచిన చేప ముక్కలను ఒక్కొక్కటిగా నూనెలో వేయాలి. మంటను మీడియంలో ఉంచి, రెండు వైపులా బాగా ఉడికేలా వేయించాలి.
-చేప ముక్కలు రెండు వైపులా అద్భుతమైన బంగారు గోధుమ రంగులోకి మారి, కరకరలాడేంత వరకు వేయించి ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి. అంతే నోరూరించే ఫిష్ ఫ్రై రెడీ.
-ఈ వేడి వేడి ఫిష్ ఫ్రైని మీరు నేరుగా లాగించేయవచ్చు లేదా మీకు ఇష్టమైన సాస్ తో కలిపి తినవచ్చు. దీనిపై కాస్త నిమ్మరసం పిండుకుని తింటే ఆ రుచి మరింత అద్భుతంగా ఉంటుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications