Latest Updates
-
అసలు సిసలైన పల్లీ చట్నీ.. ఒక్కసారి ఇలా చేసి చూడండి, మళ్లీ మళ్లీ కావాలంటారు! -
అక్టోబర్ 9న ఉత్తరాభాద్ర నక్షత్రంలోకి శని.. ఏయే రాశుల తలరాత మారనుందంటే? -
కంటిచూపు మెరుగుపర్చి, జుట్టు రాలడం తగ్గించే అసలైన కరివేపాకు కారం పొడి..ఎలా చేసుకోవాలంటే.. -
Chanakya Niti in Telugu: ఎప్పుడు మాట్లాడాలి? ఎప్పుడు మౌనంగా ఉండాలి? -
అసలు సిసలైన నెల్లూరు పప్పులుసు..ఒక్కసారి రుచి చూస్తే వదలరు! -
Operation Firewall 2026: పాక్ ISI ని వణికించిన ఏపీ పోలీస్..దేశవ్యాప్తంగా ప్రశంసలు..వైజాగ్ లో ఏమైందంటే? -
ఎన్నో పోషకాలు, ఔషధ గుణాలను అందించే సంజీవని..పల్లెటూరి స్టైల్ నల్ల కారం పొడి చేసుకోండిలా.. -
జిమ్ లేదు, కఠినమైన డైట్ లేదు..జపనీయుల టెక్నిక్ తో ఏకంగా 40 కిలోలు తగ్గిన ఖుష్బూ.. ఆ సీక్రెట్ ఏంటంటే? -
ఇడ్లీ, దోశల్లోకి పర్ఫెక్ట్ సైడ్ డిష్.. 15 నిమిషాల్లో అదిరిపోయే ఇడ్లీ కుర్మా..నాలుగు ఇడ్లీలు ఎక్కువే తింటారు! -
గ్యాస్ సమస్యలు రాని ఆరోగ్యకరమైన పెసరపప్పు వడ.. సింపుల్ గా ఇలా చేయండి!
ముద్దపప్పు, వేడి వేడి అన్నంలోకి అమృతంలాంటి మామిడికాయ పచ్చి పులుసు..ఇలా చేస్తే రుచి అద్భుతం!
పచ్చళ్ళు, పప్పుల తర్వాత మామిడికాయతో చేసే అత్యంత రుచికరమైన, పల్లెటూరి వంటకం మామిడికాయ పచ్చి పులుసు. నిప్పుల మీద కాల్చిన మామిడికాయల నుండి వచ్చే ఆ పొగ వాసన, నోరూరించే పులుపు, కొద్దిగా కారం, మధ్యలో తగిలే బెల్లం తీపి కలగలిసి అమృతంలా ఉంటుంది.
ఉక్కబోసే ఎండాకాలంలో శరీరానికి ఎంతో చలువచేసే ఈ పచ్చి పులుసును వేడి వేడి అన్నం, ముద్దపప్పుతో కలిపి తింటే ఆ మజానే వేరు. ఇంట్లొనే ఈజీగా మామిడికాయ పచ్చి పులసు ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.

మామిడికాయ పచ్చి పులుసు తయారీకి కావాల్సిన పదార్థాలు
పచ్చి మామిడికాయలు - 2
పచ్చిమిర్చి - 2
ఎండుమిర్చి - 2
వెల్లుల్లి రెబ్బలు - 4
జీలకర్ర - 1 టీస్పూన్
ఉల్లిపాయ ముక్కలు - పావు కప్పు
బెల్లం తురుము - 2 టేబుల్ స్పూన్లు
ఉప్పు - రుచికి సరిపడా
నీళ్లు - అర కప్పు నుండి ఒక కప్పు వరకు
కొత్తిమీర - 2 టేబుల్ స్పూన్లు
నూనె - 2 టీస్పూన్లు
ఆవాలు - అర టీస్పూన్
జీలకర్ర - అర టీస్పూన్
ఎండుమిర్చి - 2
కరివేపాకు - రెండు రెమ్మలు
మామిడికాయ పచ్చి పులుసు తయారీ విధానం
-ముందుగా స్టవ్ ఆన్ చేసి (లేదా నిప్పుల మీద), పచ్చి మామిడికాయలను నేరుగా మంట మీద కాల్చాలి. కాయల మీద ఉన్న చెక్కు (తోలు) నల్లగా మాడి, లోపల గుజ్జు మెత్తబడే వరకు అటూ ఇటూ తిప్పుతూ సమానంగా కాల్చుకోవాలి. అదే మంట మీద పచ్చిమిర్చి, ఎండుమిర్చిని కూడా కాస్త నల్లబడే వరకు కాల్చి పక్కన పెట్టుకోవాలి. కాయలు బాగా కాలిన తర్వాత వాటిని పూర్తిగా చల్లారనివ్వాలి.
-ఇప్పుడు ఒక చిన్న రోలు తీసుకుని.. అందులో జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, మనం ముందుగా కాల్చి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఎండుమిర్చి వేసి కచ్చాపచ్చాగా దంచుకోవాలి. దీన్ని మిక్సీలో వేసి మెత్తని పేస్ట్ లా చేయకూడదు. రోట్లో బరకగా దంచుకుంటేనే అసలైన రుచి వస్తుంది.
-మామిడికాయలు పూర్తిగా చల్లారిన తర్వాత, వాటిపైన ఉన్న నల్లటి మాడిన చెక్కును నిదానంగా వలిచేయాలి. లోపల మెత్తగా ఉడికిన గుజ్జును ఒక వెడల్పాటి గిన్నెలోకి తీసుకుని, చేత్తో బాగా మెదుపుకోవాలి. మామిడి టెంకకు ఉన్న గుజ్జును కూడా వదలకుండా తీసుకోండి.
-ఇప్పుడు ఈ మామిడికాయ గుజ్జులో మనం ముందుగా రోట్లో దంచి పెట్టుకున్న వెల్లుల్లి-మిర్చి పేస్ట్, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, బెల్లం, రుచికి సరిపడా ఉప్పు వేసి చేత్తోనే బాగా కలపాలి. ఇందులో మీ రుచికి తగినట్లుగా నీళ్లు పోసి పల్చటి పులుసులా కలుపుకోవాలి.
-ఆ తర్వాత సన్నగా తరిగిన తాజా కొత్తిమీరను కూడా వేసి మరోసారి బాగా కలుపుకోవాలి. ఒకసారి రుచి చూసుకుని అవసరమైతే ఉప్పు లేదా బెల్లం కలుపుకోవచ్చు.
-ఇప్పుడు పులుసుకు ప్రాణం పోసే తాలింపు రెడీ చేసుకోవాలి. ఇందుకోసం స్టవ్ మీద చిన్న కడాయి పెట్టి, నూనె వేడి చేయాలి. నూనె వేడెక్కాక ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలాడనివ్వాలి. ఆ వెంటనే ఎండుమిర్చి, కరివేపాకు వేసి దోరగా వేయించాలి.
-గ్యాస్ ఆఫ్ చేసి ఈ వేడి వేడి తాలింపును నేరుగా సిద్ధం చేసి పెట్టుకున్న మామిడికాయ పచ్చి పులుసులో వేసి గరిటతో నెమ్మదిగా కలుపుకోవాలి.
-అంతే ఘుమఘుమలాడే పల్లెటూరి మామిడికాయ పచ్చి పులుసు రెడీ. ఈ పులుసును వేడి వేడి అన్నంలో, ముద్దపప్పు, కొద్దిగా కరిగించిన నెయ్యి వేసుకుని కలుపుకుని తింటే.. ప్రతి ముద్దా అమృతంలా గొంతులోకి జారిపోతుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
