Latest Updates
-
ఇడ్లీ, దోశలు కాదు.. చుక్క నూనె లేకుండా ఆవిరిపై ఉడికే సొరకాయ కడుబు.. బరువు తగ్గడానికి పర్ఫెక్ట్ బ్రేక్ ఫాస్ట్! -
ఐరన్ గని, ఎనర్జీకి కేరాఫ్ అడ్రస్.. ఎన్నో లాభాలున్న హలీమ్ సీడ్స్ లడ్డూ ఎలా చేసుకోవాలంటే.. -
గుండెల్ని పిండేస్తున్న విశాఖ చిన్నారి ఉదంతం..డాక్టర్ చెప్పిన షాకింగ్ విషయాలు! -
చిత్తా నక్షత్రంలోకి శుక్రుడు.. ఆగస్టు 25 నుంచి ఈ 3 రాశులకు కుప్పలుతెప్పలుగా ధనాగమం! -
సండే స్పెషల్: నోరూరించే ఎగ్ ఘీ రోస్ట్ మసాలా..నాలుకకి పండగే పండగ..వేళ్లు నాక్కుంటూ తినేస్తారు! -
బ్లాక్ కాఫీలో నిమ్మకాయ వేసి తాగితే ఏమవుతుందో తెలుసా? -
హై ప్రొటీన్, ఫైబర్ నిండిన కినోవా జంతికలు..డయాబెటిస్, వెయిట్ లాస్ ఉన్నవారికి బెస్ట్ ఆప్షన్ -
ఆదివారం రెగ్యులర్ చికెన్ కి బ్రేక్.. కేరళ మలబార్ చికెన్ గ్రేవీ ట్రై చేయండి..చపాతీ,దోసెతో అద్భుతం.. -
గ్రహాల రాశుల మార్పు: ఆగష్టు చివరి వారంలో వీరికి ఊహించని ధన లాభం -
జీర్ణ సమస్యలకు చెక్ పెట్టే సంజీవని..100% కల్తీ లేని త్రిఫల చూర్ణం ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే..
ఇంట్లోనే కొరియన్ క్రీమ్ చీజ్ బన్స్..ఈజీగా చేసుకోండిలా..
ప్రపంచవ్యాప్తంగా ఆహార ప్రియులను విశేషంగా ఆకట్టుకుంటున్న వంటకాల్లో కొరియన్ స్ట్రీట్ ఫుడ్ ఒకటి. గత కొన్నేళ్లుగా కొరియన్ డ్రామాలు, కొరియన్ పాప్ మ్యూజిక్ ప్రపంచాన్ని ఎలా ఉర్రూతలూగిస్తున్నాయో, అలాగే కొరియన్ ఆహార పదార్థాలు కూడా మన దేశంలో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నాయి. వాటిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది కొరియన్ క్రీమ్ చీజ్ గార్లిక్ బన్స్ గురించి. ఈ బన్స్ చూడగానే నోరూరించేలా ఉండటమే కాకుండా, ఒకేసారి తీపి, ఉప్పదనం, వెల్లుల్లి ఘాటు, వెన్న కమ్మదనం కలగలిపి అద్భుతమైన రుచిని అందిస్తాయి. ఇంట్లోనే వీటిని ఈజీగా తయారుచేసుకోవచ్చు.

కొరియన్ క్రీమ్ చీజ్ బన్స్ తయారీకి కావాల్సిన పదార్థాలు
-పర్మేసాన్ చీజ్
-వెల్లుల్లి తరుగు
-క్రీమ్ చీజ్
-ఫ్రెష్ క్రీమ్
-షుగర్ పౌడర్
-ఉప్పు
-పార్స్లే తరుగు
-బర్గర్ బన్స్
-బటర్
కొరియన్ క్రీమ్ చీజ్ బన్స్ తయారీ విధానం
-ముందుగా ఫిల్లింగ్ తయారుచేసుకోవాలి.ఇందుకోసం ఒక గిన్నెలో ఒకటిన్నర కప్పులు రూమ్ టెంపరేచర్ లో ఉన్న క్రీమ్ చీజ్, అరకప్పు ఫ్రెష్ క్రీమ్, మూడున్నర టేబుల్ స్పూన్ల షుగర్ పౌడర్, పావు టీస్పూన్ ఉప్పు, 4 టేబుల్ స్పూన్ల పార్స్లే తరుగు(చూసేందుకు కొత్తీమరలా ఉంటది కానీ సోంపు వాసనతో ఉంటుంది) వేసి బాగా కలపాలి. మొత్తం కలిసి బాగా మెత్తగా అయ్యాక దాన్ని పక్కన పెట్టుకోండి.
-ఇప్పుడు మరో గిన్నెలో 1/3 కప్పు వెల్లుల్లి తరుగు, పావు కప్పు పర్మేసాన్ చీజ్, 4 టేబుల్ స్పూన్ల సన్నని పార్స్లే తరుగు, 1/3 కప్పు కరిగించిన బటర్ వేసి బాగా కలపండి. కావాలనుకుంటే ఇందులోనే సగం గుడ్డు పగలకొట్టినది కూడా వేసుకోవచ్చు.
-ఇప్పుడు మెత్తగా,ఫ్లఫీగా ఉంటే 6 ఫ్రెష్ బర్గర్ బన్స్ తీసుకోండి. వీటిని స్టార్ షేపులో 80 శాతం వరకు మాత్రమే చాకుతో పీసులుగా కట్ చేసినట్లు చేయండి.
-ఇప్పుడు ముందుగా కలిపి ఉంచుకున్న క్రీమ్ చీజ్ ని రౌండ్ నాజల్ వేసిన పైపింగ్ బ్యాగ్ లో ఫిల్ చేయండి.
-ఇప్పుడు ఆ క్రీమ్ చీజ్ ని 80 శాతం చాకుతో కట్ చేసుకున్న బన్స్ లోపల నింపండి.
-బన్స్ లో క్రీమ్ చీజ్ అంతా నింపుకున్నతర్వాత ఈ బన్స్ ని కలిపి ఉంచుకున్న బటర్ మిశ్రమంలో బాగా ముంచి తీసి బేకింగ్ ట్రేలో పెట్టుకోండి.
-ఇప్పుడు బన్స్ ఉన్న బేకింగ్ ట్రేని ప్రీ హీట్ చేసుకున్న ఒవెన్ లో పెట్టి 200 డిగ్రీల దగ్గర జస్ట్ 7-8 నిమిషాలు లేదా బన్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బేక్ చేసి బయటకు తీసుకోవాలి.
-బన్స్ ని ఓవెన్ నుంచి బయటకు తీసిన వెంటనే బన్స్ మీద గార్లిక్ బటర్ ని స్ప్రెడ్ చేయండి. అప్పుడు బన్ ఇంకా మెత్తగా, గార్లిక్(వెల్లుల్లి)ప్లేవర్ తో చాలా చాలా బాగుంటుంది. అంతే కొరియన్ స్టైల్ క్రీమ్ చీజ్ బన్స్ రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications