Latest Updates
-
ఇడ్లీ, దోశలు కాదు.. చుక్క నూనె లేకుండా ఆవిరిపై ఉడికే సొరకాయ కడుబు.. బరువు తగ్గడానికి పర్ఫెక్ట్ బ్రేక్ ఫాస్ట్! -
ఐరన్ గని, ఎనర్జీకి కేరాఫ్ అడ్రస్.. ఎన్నో లాభాలున్న హలీమ్ సీడ్స్ లడ్డూ ఎలా చేసుకోవాలంటే.. -
గుండెల్ని పిండేస్తున్న విశాఖ చిన్నారి ఉదంతం..డాక్టర్ చెప్పిన షాకింగ్ విషయాలు! -
చిత్తా నక్షత్రంలోకి శుక్రుడు.. ఆగస్టు 25 నుంచి ఈ 3 రాశులకు కుప్పలుతెప్పలుగా ధనాగమం! -
సండే స్పెషల్: నోరూరించే ఎగ్ ఘీ రోస్ట్ మసాలా..నాలుకకి పండగే పండగ..వేళ్లు నాక్కుంటూ తినేస్తారు! -
బ్లాక్ కాఫీలో నిమ్మకాయ వేసి తాగితే ఏమవుతుందో తెలుసా? -
హై ప్రొటీన్, ఫైబర్ నిండిన కినోవా జంతికలు..డయాబెటిస్, వెయిట్ లాస్ ఉన్నవారికి బెస్ట్ ఆప్షన్ -
ఆదివారం రెగ్యులర్ చికెన్ కి బ్రేక్.. కేరళ మలబార్ చికెన్ గ్రేవీ ట్రై చేయండి..చపాతీ,దోసెతో అద్భుతం.. -
గ్రహాల రాశుల మార్పు: ఆగష్టు చివరి వారంలో వీరికి ఊహించని ధన లాభం -
జీర్ణ సమస్యలకు చెక్ పెట్టే సంజీవని..100% కల్తీ లేని త్రిఫల చూర్ణం ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే..
పైన కరకర.. లోపల కరిగే చీజ్.. ఆహా అనిపించే పొటాటో చీజ్ బాల్స్..ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా
ఆకాశం మేఘావృతమై, చల్లని చిరుజల్లులు పడుతున్నప్పుడు సాయంత్రం పూట మన మనసు ఆటోమేటిక్‌గా ఏదైనా వేడివేడిగా, కరకరలాడే స్నాక్ తినాలని కోరుకుంటుంది కదా? అలాంటి అందమైన సాయంత్రాల్లో ఒక కప్పు వేడివేడి టీ లేదా కాఫీతో పాటు కమ్మని, చీజ్ తో నిండిన స్నాక్ ఉంటే ఆ మజాయే వేరు. బయట కరకరలాడుతూ, లోపల నోట్లో వేసుకోగానే కరిగిపోయేంత మెత్తగా ఉండే పొటాటో చీజ్ బాల్స్ ఈ సీజన్ కు పర్ఫెక్ట్ ఛాయిస్. వీటిని ఇంట్లోనే చాలా సులభంగా, తక్కువ సమయంలో తయారు చేసుకోవచ్చు.

పొటాటో చీజ్ బాల్స్ తయారీకి కావలసిన పదార్థాలు
ఉడికించిన బంగాళదుంపలు - 5
ఉల్లిపాయ ముక్కలు - అర కప్పు
క్యాప్సికమ్ - అర కప్పు
కొత్తిమీర తురుము - 2 టేబుల్ స్పూన్లు
బ్రెడ్ క్రంబ్స్ (రొట్టె పొడి) - అర కప్పు
సన్నగా తరిగిన పచ్చిమిర్చి - 2
ఒరేగానో - 1 టీస్పూన్
చిల్లీ ఫ్లేక్స్ (ఎండుమిర్చి పలుకులు) - 1 టీస్పూన్
మిరియాల పొడి - అర టీస్పూన్
చీజ్ క్యూబ్స్ - 5
రుచికి సరిపడా ఉప్పు
మైదా పిండి - అర కప్పు
కార్న్‌ఫ్లోర్- అర కప్పు
బ్రెడ్ క్రంబ్స్ - 1 కప్పు (పైన కోటింగ్ కోసం)
నూనె-డీప్ ఫ్రైకి
పొటాటో చీజ్ బాల్స్ తయారీ విధానం
-ముందుగా ఉడకబెట్టిన బంగాళదుంపలను పొట్టు తీసి, ఒక పెద్ద గిన్నెలో ఉండలు లేకుండా మెత్తగా మాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికమ్, పచ్చిమిర్చి, కొత్తిమీర వేయాలి. ఆ తర్వాత రుచికి సరిపడా ఉప్పు, ఒరేగానో, చిల్లీ ఫ్లేక్స్, మిరియాల పొడి, అరకప్పు బ్రెడ్ క్రంబ్స్ వేసి అంతా బాగా కలిసేలా చేత్తో ముద్దలా కలుపుకోవాలి.
-ఇప్పుడు ఈ బంగాళదుంప మిశ్రమాన్ని చిన్న చిన్న నిమ్మకాయ సైజు ఉండలుగా తీసుకోవాలి. ఆ ఉండను చేతిలో కొద్దిగా వెడల్పుగా అద్ది, దాని మధ్యలో చిన్న చీజ్ ముక్కను ఉంచాలి. చీజ్ బయటకు రాకుండా అన్ని వైపులా జాగ్రత్తగా మూసివేసి, అరచేతిలో పెట్టి ఎక్కడా పగుళ్లు లేకుండా స్మూత్ గా గుండ్రని బాల్స్ లాగా చుట్టుకోవాలి.
-కోటింగ్ కోసం ఒక గిన్నెలో అర కప్పు మైదా, అర కప్పు కార్న్‌ఫ్లోర్ వేసి, కొద్దికొద్దిగా నీళ్లు పోస్తూ ఉండలు లేకుండా బజ్జీల పిండి లాగా కలుపుకోవాలి. ఇప్పుడు సిద్ధం చేసుకున్న బాల్స్ ను ఒక్కొక్కటిగా ఈ పిండి మిశ్రమంలో ముంచి, వెంటనే బ్రెడ్ క్రంబ్స్ ఉన్న ప్లేట్ లో వేసి అన్ని వైపులా పట్టేలా బాగా దొర్లించాలి. దీనివల్లే బాల్స్ కు మంచి క్రిస్పీనెస్ వస్తుంది.
-స్టవ్ మీద కడాయి పెట్టి నూనె వేడి చేయాలి. నూనె వేడెక్కిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్ లో ఉంచి, బాల్స్ ను నెమ్మదిగా నూనెలో వదలాలి. వెంటనే కదపకుండా, అవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అన్ని వైపులా తిప్పుతూ కరకరలాడేలా డీప్ ఫ్రై చేసుకోవాలి.
-అంతే ఎంతో రుచికరమైన, వేడివేడి క్రిస్పీ పొటాటో చీజ్ బాల్స్ రెడీ. టొమాటో కెచప్ లేదా గ్రీన్ చట్నీతో వీటిని వడ్డిస్తే రుచి అద్భుతంగా ఉంటుంది. నోట్లో వేసుకోగానే లోపల కరిగిన చీజ్ సాగుతూ ఉంటే... ఆహా అనాల్సిందే.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications