Latest Updates
-
క్యాన్సర్ ముప్పును 80 శాతం తగ్గించే ఒకే ఒక్క పండు ఇదే -
అద్దిరిపోయే రుచితో కీమా చికెన్ సల్నా.. ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ కావాలంటారు! -
మిగిలిపోయిన అన్నంతో అద్భుతమైన టమాటా వెల్లుల్లి రైస్..బ్యాచిలర్స్ కు పండగే పండగ -
ముల్లంగి ఆకులతో ఇలా పకోడీ చేసి చూడండి..లొట్టలేసుకుంటూ తింటారు! -
భారతదేశంలో తొలి సూర్యోదయం ఎక్కడ కనిపిస్తుందో తెలుసా? -
ఉల్లి, వెల్లుల్లి లేకుండానే అద్భుతమైన రుచి..హిమాచల్ ప్రదేశ్ స్పెషల్ మటర్ పనీర్ మీ ఇంట్లోనే చేసుకోండిలా.. -
పొట్ట ఉబ్బరం, గ్యాస్ట్రిక్ నొప్పి ఉన్నప్పుడు.. ఇవి తీసుకుంటే చిటికెలో రిలీఫ్ -
రెస్టారెంట్ స్టైల్ చికెన్ వెల్లుల్లి రైస్.. తక్కువ సమయంలోనే అద్భుతమైన రుచి -
టిక్కెట్ లేకుండా ప్రయాణం..చెకింగ్ కి భయపడి డోర్ లాక్..కదులుతున్న రైలు బయట వేలాడిన టీటీఈ! -
20 నిమిషాల్లో చక్కెర, ప్రిజర్వేటివ్స్ లేని పీనట్ బటర్..ప్రోటీన్, పోషకాలతో నిండిన ఆరోగ్యకరమైన అల్పాహారం
రోజుకు 2 స్పూన్లు చాలు..చలికాలంలో ఉక్కులాంటి బలాన్నిచ్చే డ్రై ఫ్రూట్స్,సీడ్స్ పౌడర్ ఎలా చేసుకోవాలంటే..
చలికాలం వచ్చేసిందంటే చాలు, మన శరీరాన్ని వెచ్చగా ఉంచి, శక్తినిచ్చే పోషకాహారం ఎంతో అవసరం. అందుకే చలికాలంలో బాదం, జీడిపప్పు వంటి నట్స్ తో పాటు అవిసె, పొద్దుతిరుగుడు, గుమ్మడి గింజలు, నువ్వులు వంటి ఆరోగ్యకరమైన విత్తనాలను తప్పకుండా ఆహారంలో చేర్చుకోవాలి.
అయితే రోజూ ఇన్ని రకాలను విడివిడిగా తినడం చాలా మందికి కష్టంగా అనిపించవచ్చు. దీనికి సులభమైన, రుచికరమైన పరిష్కారమే హోమ్ మేడ్ డ్రై ఫ్రూట్ సీడ్స్ పౌడర్. బలాన్నిచ్చే ఈ పొడిని తయారు చేయడం చాలా సులభం, ఒక నెల పాటు నిల్వ చేసుకోవచ్చు. డ్రై ఫ్రూట్ సీడ్స్ పౌడర్ ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.

కావలసిన పదార్థాలు
బాదం- 100 గ్రాములు
జీడిపప్పు- 100 గ్రాములు
వాల్ నట్- 100 గ్రాములు
మఖానా- 100 గ్రాములు
గుమ్మడి గింజలు- 100 గ్రాములు
పొద్దుతిరుగుడు గింజలు- 100 గ్రాములు
అవిసె గింజలు- 100 గ్రాములు
తెల్ల నువ్వులు- 100 గ్రాములు
తయారీ విధానం
-ముందుగా ఒక బాండీలో కొద్దిగా నెయ్యి వేసి, మఖానాలను మీడియం మంటపై కరకరలాడేంత వరకు వేయించాలి. అవి మాడిపోకుండా కలుపుతూ ఉండండి.
-ఆ తర్వాత అదే బాండీలో ఎలాంటి నూనె లేదా నెయ్యి వేయకుండా గుమ్మడి, పొద్దుతిరుగుడు గింజలను దోరగా వేయించి పక్కన పెట్టుకోండి. తర్వాత నువ్వులు, అవిసె గింజలను కూడా నూనె లేకుండా తేలికగా వేయించాలి.
-ఇప్పుడు బాదం, జీడిపప్పు, వాల్ నట్ లను విడివిడిగా పొడిగా వేయించండి. వీటిలో సహజసిద్ధమైన నూనెలు ఉంటాయి కాబట్టి వేయించడానికి అదనపు నూనె అవసరం లేదు.
-వేయించిన పదార్థాలన్నీ పూర్తిగా చల్లారిన తర్వాత ఒక పెద్ద గిన్నెలో వేసి బాగా కలపండి. ఆ తర్వాత మిక్సర్ జార్ లో కొద్దికొద్దిగా వేస్తూ, ముందుగా ముతక పొడిగా చేసి, ఆ తర్వాత పూర్తిగా మెత్తబడే వరకు మధ్యమధ్యలో స్పూన్ తో కలుపుతూ గ్రైండ్ చేసుకోండి.
-తయారైన ఈ పొడిని గాలి చొరబడని సీసాలో భద్రపరిస్తే ఒక నెల వరకు పాడవకుండా ఉంటుంది.
-ప్రతిరోజూ ఉదయం 2 నుండి 3 టీస్పూన్ల ఈ డ్రై ఫ్రూట్ సీడ్స్ పౌడర్ ను తీసుకుని, అరకప్పు పాలలో వేసి కాసేపు నాననివ్వండి. రుచి కోసం తగినంత తేనె, బెల్లం లేదా చక్కెర కలుపుకుని సేవించవచ్చు. క్రమం తప్పకుండా రోజూ రెండు టీస్పూన్ల ఈ పొడిని తీసుకోవడం వల్ల శరీరానికి పుష్కలమైన శక్తి అందడమే కాకుండా రోజంతా ఉత్సాహంగా ఉంటారు.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
