కేవలం వారం రోజుల్లో బరువు తగ్గడం ఎలా? ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే చాలు..

Posted By:

జస్ట్ రోజుల్లో బరువు తగ్గడం సాధ్యమా అని చాలామంది సందేహిస్తుంటారు. ఒకే వారంలో భారీగా కొవ్వు కరగకపోయినా, కొన్ని శాస్త్రీయ పద్ధతులను పాటించడం ద్వారా శరీరంలో పేరుకుపోయిన అదనపు నీటిని, కొంత కొవ్వును కచ్చితంగా తగ్గించుకోవచ్చు.

చాలాసార్లు శరీరంలో అధిక నీరు నిలిచిపోవడం వల్లే బరువు పెరిగి, పొట్ట ముందుకు వచ్చినట్లు కనిపిస్తుంది. చేతులు, పాదాలు, చీలమండలు, ముఖం అసాధారణంగా ఉబ్బినట్లు ఉంటాయి. వైద్య శాస్త్రంలో దీనిని వాటర్ రిటెన్షన్ అంటారు. అధిక బరువు ఉన్నవారిలో చాలామందికి ఈ సమస్య ఉంటుంది. కొన్ని నియమాలను దశలవారీగా పాటిస్తే వారంలోనే ఈ అదనపు నీటిని వదిలించుకుని, ఆ తర్వాత క్రమంగా కేలరీలు, కొవ్వు కరిగేలా చేయవచ్చు.

How to Lose Weight in 1 Week 5 Science-Backed Tips That Work

నీరు ఎక్కువగా తాగండి

శరీరంలో నీరు నిలిచిపోవడానికి ప్రధాన కారణం అధిక ఉప్పు. ఇది సోడియం సమతుల్యతను దెబ్బతీసి శరీరాన్ని ఉబ్బినట్లు చేస్తుంది. కాబట్టి ఆహారంలో ఉప్పును తగ్గించి, రోజుకు కనీసం 3 లీటర్ల నీరు తాగండి. సోడాలు, ప్యాక్ చేసిన డ్రింక్స్, ప్రాసెస్ చేసిన ఆహారాలకు పూర్తిగా దూరంగా ఉండండి.

పస్తులు వద్దు

బరువు తగ్గడానికి ఉపవాసాలు ఉండాల్సిన అవసరం లేదు. మితంగా బ్యాలెన్స్డ్ తీసుకోండి. ఒక కప్పు తెల్ల లేదా బ్రౌన్ రైస్, ఎర్ర పిండి రొట్టె, ఓట్స్, దాలియా, క్వినోవా వంటివి తినండి. ప్రోటీన్ కోసం కొవ్వు లేని చికెన్, గుడ్లు, చేపలు, సోయాబీన్స్, పప్పులు, తక్కువ కొవ్వు ఉన్న పాలు తీసుకోండి. వంటల్లో ఆవ నూనె లేదా ఆలివ్ నూనె వాడండి. రోజుకు 3 నుండి 4 టీస్పూన్ల ఆరోగ్యకరమైన కొవ్వు అవసరం. కానీ నెయ్యి రోజుకు 1 నుండి 2 టీస్పూన్లకు మించకూడదు. వివిధ రకాల నట్స్, విత్తనాలను మార్చి మార్చి తినండి.

చక్కెర డ్రింక్స్ కి బ్రేక్ వేయండి

ప్యాక్ చేసిన జ్యూస్‌ లు, చక్కెర కలిగిన ఎనర్జీ డ్రింక్స్‌ కు దూరంగా ఉండండి. షాపుల్లో కొనే ప్రోటీన్ షేక్‌ లు, హెల్త్ డ్రింక్స్ కూడా ఆరోగ్యానికి మంచివి కావు. మద్యం వాడకాన్ని తగ్గించి, చక్కెర వినియోగానికి వెంటనే గుడ్‌ బై చెప్పండి.

కీళ్ల నొప్పులకు చెక్.మందులు లేకుండా ఉపశమనం ఇచ్చే ఆయుర్వేద నూనె మీ ఇంట్లోనే చేసుకోండిలా..

డిటాక్స్ డ్రింక్స్ తో రోజును ప్రారంభించండి

రోజూ అధికంగా టీ, కాఫీలు తాగడం మానేయండి. వీటికి బదులుగా గ్రీన్ టీ లేదా మితంగా చక్కెర లేకుండా నెయ్యితో బ్లాక్ కాఫీ తీసుకోవచ్చు. ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో హెర్బల్ టీలు, డిటాక్స్ పానీయాలు తాగడం వల్ల శరీరంలోని విషపదార్థాలు బయటకు పోయి, వేగంగా బరువు తగ్గుతారు.

యాక్టివ్ వ్యాయామాలతో కొవ్వు కరిగించండి

శరీరాన్ని ఫిట్‌గా మార్చడానికి హై ఇంటెన్సిటీ ఇంటర్వెల్ ట్రైనింగ్ చేయాలి. స్క్వాట్స్, జంప్ స్క్వాట్స్, కొండలు ఎక్కడం, బర్పీస్, పుష్ అప్స్ వంటి వ్యాయామాలు క్రమం తప్పకుండా చేయండి. నిలబడి జాగింగ్ చేయడం, రెండు చేతుల్లో బరువైన బాటిల్‌తో స్క్వాటింగ్ చేయడం వల్ల అదనపు కేలరీలు కరిగి త్వరగా బరువు తగ్గుతారు.

[ of 5 - Users]
Story first published: Tuesday, November 17, 2026, 18:30 [IST]
Desktop Bottom Promotion