Latest Updates
-
గుడిసెలో ఉండే బిచ్చగాడికి 21 మంది భార్యలు..ఏం బెల్లం పెట్టావ్ రా అయ్యా.. -
ఎలక్ట్రిక్ కెటిల్ ఎలా క్లీన్ చేయాలి? ఈ సింపుల్ ట్రిక్ తో నిమిషాల్లో కొత్తదానిలా మెరుస్తూ.. -
అసలు సిసలైన పల్లీ చట్నీ.. ఒక్కసారి ఇలా చేసి చూడండి, మళ్లీ మళ్లీ కావాలంటారు! -
అక్టోబర్ 9న ఉత్తరాభాద్ర నక్షత్రంలోకి శని.. ఏయే రాశుల తలరాత మారనుందంటే? -
కంటిచూపు మెరుగుపర్చి, జుట్టు రాలడం తగ్గించే అసలైన కరివేపాకు కారం పొడి..ఎలా చేసుకోవాలంటే.. -
Chanakya Niti in Telugu: ఎప్పుడు మాట్లాడాలి? ఎప్పుడు మౌనంగా ఉండాలి? -
అసలు సిసలైన నెల్లూరు పప్పులుసు..ఒక్కసారి రుచి చూస్తే వదలరు! -
Operation Firewall 2026: పాక్ ISI ని వణికించిన ఏపీ పోలీస్..దేశవ్యాప్తంగా ప్రశంసలు..వైజాగ్ లో ఏమైందంటే? -
ఎన్నో పోషకాలు, ఔషధ గుణాలను అందించే సంజీవని..పల్లెటూరి స్టైల్ నల్ల కారం పొడి చేసుకోండిలా.. -
జిమ్ లేదు, కఠినమైన డైట్ లేదు..జపనీయుల టెక్నిక్ తో ఏకంగా 40 కిలోలు తగ్గిన ఖుష్బూ.. ఆ సీక్రెట్ ఏంటంటే?
కొబ్బరి పాలతో నోరూరించే కేరళ ‘కిన్నత్తప్పం’.. గుడ్లు లేకుండా కేక్ స్టైల్‌లో
శుభకార్యాలు ఏవైనా సరే విందులో ఖచ్చితంగా డెజర్ట్ ఉండాల్సిందే. లేదంటే భోజనం పూర్తి చేసిన తృప్తి ఉండదు. స్వీట్ ఐటమ్స్‌కి అంత ప్రత్యేక స్థానం ఉంటుంది. ఇక, కేరళ వంటకాల్లో కొబ్బరి పాలు, కొబ్బరి నూనె చాలా ప్రసిద్ధి చెందాయి. అవి లేకుండా స్వీట్స్, హాట్ పూర్తవడం కష్టం. కేరళలో ముస్లిం సంప్రదాయంలో ప్రసిద్ధి చెందిన కిన్నత్తప్పం.. మన తెలుగు సంప్రదాయం స్టైల్‌లో చేస్తే ఎలా ఉంటుంది. అదెలా అనుకుంటున్నారా.. ఇక్కడ చూద్దాం..

కేరళ ముస్లిం స్టైల్‌లో కిన్నత్తప్పం తయారీలో బియ్యం, గుడ్లు ప్రముఖంగా ఉపయోగిస్తారు. ఇఫ్తార్ విందు వంటి ప్రత్యేక సందర్భాల్లో ఈ డెజర్ట్ తప్పనిసరి. అయితే గుడ్లు తిననివారు కిన్నత్తప్పం రుచి చూడాలనుకుంటే ఈ పద్ధతిలో ట్రై చేసి చూడండి. ఖచ్చితంగా ఒకటికి రెండు తినాల్సిందే..
కిన్నత్తప్పం తయారీకి కావాల్సిన పదార్థాలు
గోధుమపిండి- ఒక కప్పు
పచ్చి కొబ్బరి తురుము- ఒక కప్పు
బెల్లం- అర కప్పు
యాలకులు- 4 లేదా 5
జీలకర్ర- 1 టీ స్పూన్
నెయ్యి- 2 లేదా మూడు టీ స్పూన్లు
ఉప్పు- 1 టీ స్పూన్
కిన్నత్తప్పం తయారీ విధానం
-ముందుగా బెల్లాన్ని ఒక మట్టికుండలోకి తీసుకుని కొద్దిగా నీళ్లు పోసి చిక్కగా అయ్యే వరకు ఉడికించాలి. తర్వాత జల్లెడతో ఓ గిన్నెలోకి వడకట్టుకోవాలి. ఇప్పుడు జీలకర్ర, యాలకులని కచ్చాపచ్చాగా దంచి పెట్టుకోవాలి. అనంతరం ఒక గిన్నెలోకి తురిమిన పచ్చి కొబ్బరిని తీసుకుని అందులో కొన్ని నీళ్లు పోసి పిండుతూ పాలను సెపరేట్ చేసి వడగట్టుకోవాలి.
-ఇప్పుడు బెల్లం పాకంలోకి గోధుమ పిండిని వేసి కలుపుకోవాలి. అందులో కొబ్బరి పాలను వేసి ఉండలు లేకుండా సాఫ్ట్‌గా అయ్యేవరకు కలపాలి. అందులోనే జీలకర్ర, యాలకుల పొడి, ఉప్పు వేసి మొత్తం మళ్లీ కలిసేలా కలియతిప్పాలి.
ఆవిరిపై కిన్నత్తప్పం
ఒక వెడల్పాటి ప్లేట్‌లో కొద్దిగా నెయ్యి రాసి ఈ మిశ్రమాన్ని ఇంచు మందం వచ్చేలా ప్లేట్‌లో వత్తుకోవాలి. ఇప్పుడు ఇడ్లీ కడాయి తీసుకుని అందులో కొద్దిగా నీళ్లు పోసి ఈ ప్లేట్‌ను కడాయిలో పెట్టి మూత ఉంచి ఆవిరిపై పదినిమిషాల పాటు ఉడికించాలి. మరో 15 నిమిషాల తర్వాత చల్లారాక మూత తీసి ప్లేట్‌ను బయటకు తీసి కిన్నత్తప్పాన్ని సమానమైన ముక్కలుగా కట్ చేసుకోవాలి. మిగిలిన పిండి ముద్దను ఇదేవిధంగా ఆవిరిపై ఉడికించుకోవాలి. అంతే ఎంతో రుచికరమైన కిన్నత్తప్పం రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
