Latest Updates
-
అసలు సిసలైన పల్లీ చట్నీ.. ఒక్కసారి ఇలా చేసి చూడండి, మళ్లీ మళ్లీ కావాలంటారు! -
అక్టోబర్ 9న ఉత్తరాభాద్ర నక్షత్రంలోకి శని.. ఏయే రాశుల తలరాత మారనుందంటే? -
కంటిచూపు మెరుగుపర్చి, జుట్టు రాలడం తగ్గించే అసలైన కరివేపాకు కారం పొడి..ఎలా చేసుకోవాలంటే.. -
Chanakya Niti in Telugu: ఎప్పుడు మాట్లాడాలి? ఎప్పుడు మౌనంగా ఉండాలి? -
అసలు సిసలైన నెల్లూరు పప్పులుసు..ఒక్కసారి రుచి చూస్తే వదలరు! -
Operation Firewall 2026: పాక్ ISI ని వణికించిన ఏపీ పోలీస్..దేశవ్యాప్తంగా ప్రశంసలు..వైజాగ్ లో ఏమైందంటే? -
ఎన్నో పోషకాలు, ఔషధ గుణాలను అందించే సంజీవని..పల్లెటూరి స్టైల్ నల్ల కారం పొడి చేసుకోండిలా.. -
జిమ్ లేదు, కఠినమైన డైట్ లేదు..జపనీయుల టెక్నిక్ తో ఏకంగా 40 కిలోలు తగ్గిన ఖుష్బూ.. ఆ సీక్రెట్ ఏంటంటే? -
ఇడ్లీ, దోశల్లోకి పర్ఫెక్ట్ సైడ్ డిష్.. 15 నిమిషాల్లో అదిరిపోయే ఇడ్లీ కుర్మా..నాలుగు ఇడ్లీలు ఎక్కువే తింటారు! -
గ్యాస్ సమస్యలు రాని ఆరోగ్యకరమైన పెసరపప్పు వడ.. సింపుల్ గా ఇలా చేయండి!
సండే స్పెషల్: నోరూరించే ఎగ్ ఘీ రోస్ట్ మసాలా..నాలుకకి పండగే పండగ..వేళ్లు నాక్కుంటూ తినేస్తారు!
రోజూ తినే కోడిగుడ్డు కూరలతో విసుగొచ్చిందా? అయితే కాస్త భిన్నంగా, రెస్టారెంట్ స్టైల్ రుచితో ఉండే ఎగ్ ఘీ రోస్ట్ మసాలాను ట్రై చేయండి. మధ్యాహ్నం లంచ్ అయినా, రాత్రి డిన్నర్ అయినా సరే.. వేడి వేడి అన్నం, రోటీ లేదా చపాతీలోకి ఇది పర్ఫెక్ట్ కాంబినేషన్.
కమ్మటి నెయ్యి వాసనతో, ఘాటైన మసాలాల కలయికతో తయారయ్యే ఈ వంటకం మీ కుటుంబ సభ్యులందరినీ కచ్చితంగా ఆకట్టుకుంటుంది.

ఎగ్ ఘీ రోస్ట్ మసాలా తయారీకి కావాల్సిన పదార్థాలు
మసాలా పేస్ట్ కోసం
నూనె - 2 టీస్పూన్లు
బ్యాడ్గి ఎండుమిర్చి (లేదా కశ్మీరీ ఎండుమిర్చి) - 10
ధనియాలు - 2 టేబుల్ స్పూన్లు
మిరియాలు - 1 టీస్పూన్
సోంపు - 1 టీస్పూన్
జీలకర్ర - 1 టీస్పూన్
మెంతులు - పావు టీస్పూన్
చింతపండు - చిన్న ముక్క
వెల్లుల్లి రెబ్బలు - 8
గుడ్లకు పట్టించడానికి
ఉడికించిన కోడిగుడ్లు
ఉప్పు - ఒకటిన్నర టీస్పూన్
పసుపు - అర టీస్పూన్
కాశ్మీరీ కారం - 2 టీస్పూన్లు
గ్రేవీ (ఘీ రోస్ట్) కోసం
నెయ్యి - 2 టేబుల్ స్పూన్లు
ఉల్లిపాయలు - 4 (సన్నగా తరిగినవి)
టమాటాలు - 3 (సన్నగా తరిగినవి)
కరివేపాకు - కొద్దిగా
నీళ్లు - 1 కప్పు
బెల్లం తరుగు - 2 టీస్పూన్లు
ఉప్పు - రుచికి సరిపడా
కొత్తిమీర - కొద్దిగా
ఆదివారం రెగ్యులర్ చికెన్ కి బ్రేక్.. కేరళ మలబార్ చికెన్ గ్రేవీ ట్రై చేయండి..చపాతీ,దోసెతో అద్భుతం..
ఎగ్ ఘీ రోస్ట్ మసాలా తయారీ విధానం
-ముందుగా స్టవ్ వెలిగించి ఒక పాన్ లో అర టీస్పూన్ నూనె వేడి చేయండి. అందులో 10 బ్యాడ్గి ఎండుమిర్చి, ధనియాలు, మిరియాలు, సోంపు, జీలకర్ర వేసి మంచి సువాసన వచ్చే వరకు వేయించాలి. ఆ తర్వాత అందులో మెంతులు, చిన్న చింతపండు ముక్క వేసి మరో రెండు నిమిషాలు వేయించి స్టవ్ ఆఫ్ చేయండి. దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి.
-చల్లారిన మసాలా దినుసులను మిక్సీ జార్ లో వేసి, ముందుగా ఎండుమిర్చిని గ్రైండ్ చేయాలి. ఆ తర్వాత మిగిలిన దినుసులు, వెల్లుల్లి రెబ్బలు వేసి నీళ్లు పోయకుండా మిక్సీ పట్టుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా నీళ్లు జోడించి మెత్తటి పేస్ట్ లా రుబ్బుకుని పక్కన పెట్టుకోవాలి.
-ఒక ప్లేట్ లో ఉప్పు, పసుపు, కాశ్మీరీ కారం వేసి బాగా కలపాలి. ఉడికించిన కోడిగుడ్లకు చాకుతో చిన్నగా గాట్లు పెట్టి, ఈ డ్రై మసాలా పొడిని గుడ్ల చుట్టూ బాగా పట్టించి పక్కన ఉంచండి.
-ఇప్పుడు ఒక వెడల్పాటి పాన్ తీసుకుని అందులో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి వేడి చేయండి. సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి బ్రౌన్ కలర్ వచ్చేలా వేయించాలి. ఉల్లిపాయలు వేగిన తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న మసాలా పేస్ట్, కొద్దిగా కరివేపాకు వేసి పచ్చివాసన పోయేంతవరకు వేయించాలి.
-మసాలా వేగిన తర్వాత టమాటా ముక్కలు, కొద్దిగా ఉప్పు వేసి టమాటాలు మెత్తబడే వరకు ఉడికించాలి. తర్వాత 1 కప్పు నీళ్లు పోసి, మూతపెట్టి సన్నటి మంటపై 10 నిమిషాల పాటు ఉడకనివ్వాలి.
-గ్రేవీ చిక్కబడుతున్నప్పుడు ముందుగా మసాలా పట్టించి పెట్టుకున్న కోడిగుడ్లను అందులో నెమ్మదిగా వేయాలి. గుడ్ల పైన మసాలా గ్రేవీని వేస్తూ, మరో 3 నిమిషాల పాటు ఉడికించాలి. చివరగా సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకుని స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది.
-అంతే ఎంతో గుమగుమలాడే, నోరూరించే ఎగ్ ఘీ రోస్ట్ మసాలా రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
