Latest Updates
-
వినాయక చవితి స్పెషల్ బెల్లం ఆవిరి కుడుములు..చాలా ఈజీగా చేసుకోండిలా.. -
జీర్ణశక్తిని పెంచే సూపర్ ఫుడ్..మిగిలిపోయిన అన్నంతో టేస్టీ కొత్తిమీర రైస్..లంచ్ బాక్స్ కి పర్ఫెక్ట్! -
ప్రోటీన్లు, ఫైబర్ పుష్కలం.. ఉదయాన్నే తినాల్సిన హెల్తీ మల్టీగ్రెయిన్ దోస ఇదే! -
చికెన్, మటన్ కాదు.. ఎప్పుడైనా కమ్మటి మునగకాయ బిర్యానీ ట్రై చేశారా? -
మనిషికి పంది కిడ్నీ.. ఏకంగా 271 రోజులు.. వైద్య చరిత్రలో మహాద్భుతం! -
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా..
పెళ్లి భోజనాల స్టైల్లో పాలకూర పప్పు చేసుకుందామా..? చాలా సింపుల్..!
పెళ్లో భోజనాల్లో పెట్టే పాలకూర పప్పు రుచి ఎలా వుంటుందో మనకు తెలిసిందే. ఫంక్షన్ హాల్లో పెళ్లి జరుగుతున్నా ఆ వాసన పందిరి వద్దకు వస్తుంది. ఎప్పుడు పెళ్లి భోజనం చేయాలా అని మనకు నోట్లో లాలా జలం ఊరుతూనే వుంటుంది. పాలకూర పప్పు లేనిదే పెళ్లి భోజనాలు కూడా పూర్తి కావు. అంటే పెళ్లి వంటకాల మెన్యూలో ఖచ్ఛితంగా పాలకూర పప్పు వుండాల్సిందే. ఆ రుచి ఇంట్లో రావడం చాలా కష్టం. కేవలం అప్పుడప్పుడు మాత్రమే ఆ రుచి మనకు వస్తుంది. అలాంటి టేస్టీ పాలకుర పప్పును ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. పాలకూర పప్పు రెసిపీని మీ ముందుకు తీసుకొని వచ్చాము. పాలకూర పప్పుతో టేస్ట్ మాత్రమే కాదు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. మరి పాలకూర పప్పు ఎలా తయారు చేస్తారో తెలుసుకుందామా.
పాలకూర పప్పు తయారు చేయడానికి కావాల్సిన వంట సామాగ్రి
కందిపప్పు. పాలకూర, పసుపు, కారం, ఉప్పు, మంచి నూనె, వెల్లుల్లి ముక్కలు, ఆవాలు, జిలకర, ఎండి మిరకపకాయలు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, దనియాల పొడి, చింతపండు రసం.
పాలకూర పప్పును తయారు చేసే విధానం
కుక్కర్లో ఒక కప్పు కందిపప్పును తీసుకొని బాగా కడగాలి. ఏ కప్పుతో అయితే కందిపప్పు తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పుల నీళ్లను పోసి కుక్కర్లో అరగంట పాటు నానబెట్టాలి. ఇలా పప్పును నానబెట్టడం వల్ల పప్పు మరింత బాగా ఉడుకుతుంది. అరగంట తరువాత పప్పు బాగా నానిన తరువాత అందులో అర టీస్పూన్ పుసుపును యాడ్ చేసుకోవాలి. రెండు టీ స్పూన్ల ఆయిల్ ను వేసుకొని కొన్ని కరివేపాకులను వేసుకొని కుక్కర్ మూత పెట్టుకోవాలి.కుక్కర్లో మూడు నుంచి నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించాలి.

పప్పు బాగా ఉడికిన తరువాత పప్పు గొట్టంతో పప్పును బాగా రుబ్బుకోవాలి. దీంట్లో ఒక కప్పు నీళ్లను పోసుకొని మళ్లీ కలుపుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్‌ను తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ల మంచి నూనెను యాడ్ చేసుకోవాలి. అందులో సన్నగా కట్ చేసిన 5 నుంచి 6 వెల్లుల్లి ముక్కలను యాడ్ చేసుకోవాలి. అరటీస్పూన్ ఆవాలు, అరటీస్పూన్ జిలకరను కూడా తీసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే రెండు ఎండి మిరపకాయ ముక్కలను, మూడు నుంచి నాలుగు పచ్చిమిరపకాయలను యాడ్ చేసుకోవాలి.
ఫ్రై చేస్తూనే అందులో ఒక ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకోవాలి. అందులో తగినంత ఉప్పును, ఒక టీ స్పూన్ ధనియాల పొడిని యాడ్ చేసుకోవాలి. ఒక టీ స్పూన్ కారం పొడిని కూడా యాడ్ చేసుకోవాలి. మంటను లో ఫ్లేమ్‌లో పెట్టి బాగా ఫ్రై చేసుకోవాలి. సన్నగా తరిగిన పాలకూరను రెండు కప్పుల వరకు ప్యాన్‌లో యాడ్ చేసుకోవాలి. పోప్లో కలిపి పాలకూరను కూడా ఫ్రై చేసుకోవాలి. మూడు నిమిషాల వరకు నూనెలోనే ఫ్రై చేసుకోవాలి.
ఇందులో ఉడికించిన పప్పును యాడ్ చేసుకోవాలి. ఒక కప్పు నీళ్లను కూడా యాడ్ చేసుకోవాలి. రెండు టీస్పూన్ల చింతపండు రసాన్ని యాడ్ చేసుకోవాలి. పది నిమిషాల వరకు ఈ పప్పును బాగా మరిగించాలి. ఇక పాలకూర పప్పు రెడీ అయినట్టే. ఈ పాలకూర పప్పులో కొంచెం నెయ్యి వేసుకొని తింటే ఆహా ఏమి రుచి అని అనాల్సిందే.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
