Latest Updates
-
పాలు వద్దు, పంచదార వద్దు.. పటిక బెల్లంతో 10 నిమిషాల్లో సూపర్ టేస్టీ రవ్వ లడ్డు! -
ఏప్రిల్ 27 రాజయోగం: ఈ రాశుల వారికి ధన యోగం.. ఇక తిరుగులేదు! -
ఈ చేప మగాళ్లకు సర్వరోగ నివారిణి..ఒకేసారి బలం,ఓపిక వచ్చేస్తుంది! -
రాఘవ్ చద్దా స్పెషల్ మ్యాంగో షేక్.. ఐదు నిమిషాల్లో ఈజీగా చేసుకోండిలా..బరువు పెరిగే టెన్షన్ లేదు! -
వడగాల్పుల ఎఫెక్ట్: ఎండల నుంచి ప్రాణాలను కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
మోహిని ఏకాదశి రోజున ఈ తప్పులు చేస్తున్నారా? వ్రత ఫలితం దక్కాలంటే ఈ నియమాలు తప్పనిసరి! -
కన్యా రాశిలోకి చంద్రుడు: ఈ రాశుల వారికి ఇక పట్టిందల్లా బంగారమే, పనుల్లో వేగం! -
మేషం, సింహం, ధనుస్సు రాశుల వారికి రాజయోగం.. ధనలాభం ఖాయం! - సోమవారం, 27 ఏప్రిల్ 2026 -
ఎండలకు నోటికి ఏదీ రుచించడంలేదా? అయితే కమ్మటి మునక్కాడ రసం'ట్రై చేయండి -
ఎండలు మండిపోతున్నాయి.. గర్భిణీలు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమేనా?
Chicken Soup: చికెన్ సూప్ తయారీ
Chicken Soup: బయట వాతావరణం చల్లగా ఉన్నప్పుడు వేడి వేడి చికెన్ సూప్ తాగితే చాలా బాగుంటుంది. దీని వల్ల శరీరానికి పోషకాలు అందడంతో పాటు చికెన్ సూప్ మంచి ఆహారం కూడా. చికెన్ సూప్‌ను ఇంట్లో చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు.

చికెన్ సూప్ తయారీకి కావాల్సిన పదార్థాలు:
1. బోన్ ఉన్న చికెన్ - 250 గ్రాములు
2. క్యారెట్ - 1
3. స్వీట్ కార్న్ - సగం కప్పు
4. ఆలు - ఒకటి(ఆప్షనల్)
5. ఏదైనా కూరగాయలు - ఒక కప్పు(ఆప్షనల్)
6. నిమ్మరసం - 2 టేబుల్ స్పూన్లు
7. సన్నగా తరిగిన అల్లం - 1 టేబుల్ స్పూన్
8. సన్నగా తరిగిన వెల్లుల్లి - 1 టేబుల్ స్పూన్
9. నూనె - 1 స్పూన్
10. బగారా ఆకు - 1
11. మిరియాలు - 4
12. దాల్చిన చెక్క - 2 అంగుళాలు

చికెన్ సూప్ తయారీ:
1. మొదట చికెన్‌ను నీటితో శుభ్రంగా కడుక్కోవాలి. బోన్స్ చికెన్ సూప్‌కు మంచి రుచిని అందిస్తాయి. చికెన్‌ను బోన్‌తో పాటే ఉంచుకోవాలి.
2. కడిగిన చికెన్‌ను ప్రెషర్ కుక్కర్‌లో తరిగిన ఉల్లిపాయ, వెల్లుల్లి, తరిగిన క్యారెట్, బగారా ఆకు, కొన్ని నీళ్లు వేసుకోవాలి.
3. రుచికి సరిపడా ఉప్పు వేసుకుని ఒక విజిల్ వచ్చే వరకు ఉంచాలి.
4. ఇప్పుడు స్టవ్ తగ్గించి 10-12 నిమిషాలు ఉడికించాలి.
5. స్టవ్‌పై నుండి ప్రెజర్ కుక్కర్‌ను తీసి పక్కన పెట్టుకోవాలి.
6. కుక్కర్ ప్రెజర్‌ను మెల్లిగా వెళ్లిపోయే వరకు పక్కన ఉంచుకోవాలి.
7. చికెన్ సూప్ నుండి బోన్స్ తీసేయాలి. పెద్ద పెద్ద చికెన్ ముక్కలను చిన్నగా కట్ చేసుకోవాలి.
8. వేడి వేడిగా చికెన్ సూప్ సర్వ్ చేసుకుంటే సరి.



Click it and Unblock the Notifications