Latest Updates
-
ఎండలు మండిపోతున్నాయి: గర్భిణీలు, PCOS ఉన్నవారు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
భరణం కట్టలేక లోన్ ఈఎంఐల సాకు చెబుతున్నారా? సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పు ఇదే! -
సీతా నవమి 2026: దంపతులు ఈ పూజ చేస్తే వైవాహిక జీవితంలో అద్భుతమైన మార్పులు! -
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం
Nellore Chepala Pulusu: నెల్లూరు చేపల పులుసు, దీని రుచికి దాసోహం అనాల్సిందే
నెల్లూరు చేపల పులుసును లొట్టలేసుకు మరీ తినేస్తుంటారు. దీని రుచికి మైమరిచిపోని వారంటూ ఉండరు. కొంత మందికి నెల్లూరు చేపల పులుసు అంటే పిచ్చి ఉంటుంది.
తెలుగు వారు భోజన ప్రియులు. ప్రాంతమని తేడా లేకుండా రకరకాల వంటకాలు నోరూరిస్తుంటాయి. ఆంధ్ర వంటకాలతో దేశవ్యాప్తంగా మంచి క్రేజ్ ఉంది. ఆ జాబితాలో నెల్లూరు చేపల పులుసు తప్పనిసరిగా ఉంటుంది. చేపలు అనగానే ప్రతి ఒక్కరికీ ముందుగా గుర్తొచ్చే పేరు, ఊరు నెల్లూరు.

నెల్లూరు చేపల పులుసును లొట్టలేసుకు మరీ తినేస్తుంటారు. దీని రుచికి మైమరిచిపోని వారంటూ ఉండరు. కొంత మందికి నెల్లూరు చేపల పులుసు అంటే పిచ్చి ఉంటుంది.

నెల్లూరు వాసులకు చేపలకు విడదీయరాని అనుబంధం ఉంది. నదుల్లో, చెరువుల్లో, సముద్రంలోని చేపలు తినడానికి చాలా రుచిగా ఉంటాయి. కొర్రమీను, పండుగప్ప, సొర, బొచ్చ, చందమామ, బొమ్మిడాయి ఇలా ఎన్నో రకాల చేపలు నెల్లూరులో దొరుకుతాయి. ఇక్కడ చేపలకు విపరీతమైన డిమాండ్ ఉండటంతో ఆక్వా కల్చర్ లో కూడా చేపలు పెంచుతుంటారు.

నెల్లూరులో దొరికే చేపల పులుసుకు చాలా మంది ఫ్యాన్స్. నెల్లూరుకు వెళ్తే తప్పకుండా స్పెషల్ బొమ్మిడాయి పులుసు తినందే రారు. ఈ చేపలు పులుసు కూరకు విపరీతమైన అభిమానఘనం ఉంటుంది. మంచిగా మాగిన చేపల పులుసును వేడి వేడి అన్నంలో వేసుకుంటే తింటే అద్భుతం అనేస్తారు. నోట్లో వేసే కరిగిపోయే నెల్లూరు చేపల పులుసు మళ్లీ మళ్లీ కావాలంటారు.

నెల్లూరులో ఈ ప్రాంతాల్లో చేపల పులుసు అదిరిపోతుందంతే..
1. మురళీ కృష్ణ 70ఏసీ రెస్టారెంట్
2. సీ బాక్స్
3. అమరావతి ఫ్యామిలీ రెస్టారెంట్
4. స్వాతి మల్టీక్యూజిన్ రెస్టారెంట్
5. రాయలసీమ రెస్టారెంట్
6. నిర్వాణ రెస్టారెంట్
7. పరివార్ ప్యారెడైజ్

చేపల్లోని పోషకాలు:
* కాల్షియం
* ఐరన్
* మెగ్నీషియం
* కాపర్
* జింక్
చేపలు తినడం వల్ల కంటి వ్యాధులు, గుండె సంబంధిత సమస్యలు, ఆస్తమా వంటి రోగాలు రాకుండా ఉంటాయి.

నెల్లూరు చేపల పులుసు ఎలా చేస్తారంటే:
అన్ని ప్రాంతాల్లో చేపల పులుసు తయారు చేస్తుంటారు. ఎవరి శైలి వారిది. ఒక్కొక్కరు ఒక్కోలా చేపల పులుసు వండుతారు. అయితే నెల్లూరులో బొమ్మిడాయిల చేపల పులుసు తయారీ విధానం మిగతా ప్రాంతాల్లో ఉన్నట్లుగా కాకుండా భిన్నంగా ఉంటుంది. అదే నెల్లూరు చేపల పులుసుకు అసలు సిసలైన టేస్ట్ ను తీసుకువస్తుంది.
ముందుగా బొమ్మిడాయిలను బాగా శుభ్రం చేసుకోవాలి. మొదటతో గిన్నెలో తీసుకున్న నీటిలో కళ్లుప్పు వేసుకోవాలి. అందులో బొమ్మిడాయిలను వేసి జిగురు మొత్తం తొలగిపోయే వరకు బాగా కడుక్కోవాలి.
చేపలు చక్కగా శుభ్రం చేసుకున్న తర్వాత ఉల్లిపాయను పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. కొన్ని లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, వెల్లుల్లి రెబ్బలు తీసుకుని వాటిని అన్నింటిని మిక్సీలో బాగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి.
ఇప్పుడు మందం పాటి గిన్నె తీసుకోవాలి. దానిని స్టవ్ మీద ఉంచి కొద్దిగా ఎక్కువే నూనె పోసుకోవాలి. నూనె ఎక్కువగా వేసుకుంటే పులుసు మంచి టేస్టీగా ఉంటుంది. నూనె వేడెక్కిన తర్వాత మిర్చి, ఉల్లిపాయల పేస్టు, పసుపు, ఉప్పు వేసుకుని వేయించుకోవాలి. దోరగా అయ్యాక కారం వేసుకుని, అందులో చింతపండు గుజ్జు, కరివేపాకు, కొత్తిమీర వేసి మరిగించాలి. తర్వాత బొమ్మిడాయిలు వేసుకుని బాగా మరగనివ్వాలి. ఆ తర్వాత దించేసుకుని కొద్దిగా చల్లగా అయిన తర్వాత తింటే మధురంగా ఉంటుంది.



Click it and Unblock the Notifications