Latest Updates
-
కేవలం 10 నిమిషాల్లో రవ్వ బన్ దోస,స్పెషల్ టమాటా చట్నీ.. ఈ రహస్యం తెలిస్తే రోజూ ఇదే కావాలంటారు! -
అక్టోబర్ 3న భయంకరమైన గ్రహం నక్షత్ర మార్పు.. ఈ మూడు రాశుల వారికి కష్టాల కడలి.! -
రోజుకు ఎన్ని కప్పుల టీ తాగొచ్చు? -
శృంగారం తర్వాత దంపతులు చేసే తప్పులు.. ఆరోగ్యానికి ఎంత ప్రమాదమో తెలుసా? -
నవరాత్రి స్పెషల్..ఉపవాసాల కోసం కరకరలాడే సగ్గుబియ్యం పాపడ్.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా -
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.! -
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
ఆయుర్వేద రహస్యం: పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే ఇన్ని లాభాలా? -
గుండె పోటు, కార్డియాక్ అరెస్ట్, ఫెయిల్యూర్ ఒకటేనా.. తేడాలు తెలియకుంటే రిస్క్‌లో పడినట్లే.!
కర్ణాటక స్పెషల్ ఉల్లి చట్నీ..ఈ ఒక్క చట్నీ ఉంటే ప్లేట్ల కొద్దీ ఇడ్లీలు,దోశలు లాగించేస్తారు!
రోజూ అవే పల్లీల చట్నీ, కొబ్బరి చట్నీ, లేదా టమాటా చట్నీలు తిని తిని మీ నాలుకకు బోర్ కొట్టిందా? ఉదయం బ్రేక్ ఫాస్ట్ లోకి రొటీన్ రుచులకు భిన్నంగా, ఏదైనా కొత్తగా, కమ్మగా ట్రై చేయాలనిపిస్తోందా? అయితే అద్భుతమైన రుచినిచ్చే కర్ణాటక స్టైల్ ఉల్లిపాయ చట్నీని తయారు చేసుకోండి. సాధారణంగా మనం ఇంట్లో చేసుకునే ఉల్లిపాయ చట్నీకి, ఈ కర్ణాటక స్టైల్ చట్నీకి చాలా తేడా ఉంటుంది. ఏ టిఫిన్ లోకైనా సరే అమృతంలా సరిపోతుంది.

కర్ణాటక స్టైల్ ఉల్లి చట్నీ తయారీకి కావలసిన పదార్థాలు
సాంబార్ ఉల్లిపాయలు) - 25
టమాటా - 1 (మధ్యస్థ సైజు)
ఎండు మిరపకాయలు - 4 (కారాన్ని బట్టి చూసి వేసుకోవాలి)
పచ్చి శనగపప్పు - 2 టేబుల్ స్పూన్లు
మినప పప్పు - 2 టేబుల్ స్పూన్లు
సన్నగా తరిగిన కొత్తిమీర - 1 టేబుల్ స్పూన్
కరివేపాకు - 1 రెమ్మ
పసుపు - చిటికెడు
బెల్లం - ఒక చిన్న ముక్క
ఉప్పు - రుచికి తగినంత
నూనె - 2 టేబుల్ స్పూన్లు
పోపు (తాలింపు) కోసం:
నూనె - 1 టీస్పూన్
ఎండు మిరపకాయ - 1
ఆవాలు - అర టీస్పూన్
మినప పప్పు - అర టీస్పూన్
కరివేపాకు - 1 రెమ్మ
కర్ణాటక స్టైల్ ఉల్లి చట్నీ తయారీ విధానం
-ముందుగా చిన్న ఉల్లిపాయల పొట్టు తీసి శుభ్రం చేసుకోవాలి. అలాగే టమాటాను కడిగి చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి.
-ఇప్పుడు స్టవ్ వెలిగించి, ఒక మందపాటి బాండీ పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్ల నూనె వేయాలి. నూనె వేడెక్కాక ఎండు మిరపకాయలు, పచ్చి శనగపప్పు, మినపపప్పు వేసి సన్నటి మంటపై దోరగా వేయించుకోవాలి. పప్పులు మాడిపోకుండా, చక్కటి బంగారు రంగులోకి మారి కమ్మటి వాసన వచ్చే వరకు వేయించాలి.
-తర్వాత పొట్టు తీసి పెట్టుకున్న చిన్న ఉల్లిపాయలు, కరివేపాకు, కొత్తిమీర తురుము స్టవ్ మీద బాండీలో వేసి బాగా కలుపుతూ వేయించాలి. ఉల్లిపాయలు మెత్తబడి, పారదర్శకంగా మారే వరకు మగ్గనివ్వాలి. ఉల్లిపాయలు మగ్గిన తర్వాత, టమాటా ముక్కలను వేసి కలపాలి. ఇందులోనే చిటికెడు పసుపు,రుచికి సరిపడా ఉప్పు, అలాగే ఒక చిన్న బెల్లం ముక్కను జత చేయాలి. బెల్లం వేయడం వల్లే చట్నీకి అసలైన కర్ణాటక రుచి వస్తుంది.
-టమాటా ముక్కలు బాగా గుజ్జులా ఉడికి, నూనె పైకి తేలే వరకు సన్నటి మంటపై మగ్గనివ్వాలి. ఆ తర్వాత స్టవ్ ఆపేసి, ఈ మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి.
-మిశ్రమం చల్లారిన తర్వాత మిక్సీ జార్ లోకి తీసుకుని అవసరమైతే కొద్దిగా నీళ్లు చిలకరించి మెత్తని పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి. ఈ చట్నీని ఒక గిన్నెలోకి తీసుకోవాలి.
ఒక బాండీలో ఒక టీస్పూన్ నూనె వేడి చేయాలి. నూనె కాగాక ఆవాలు వేసి చిటపటలాడనివ్వాలి. ఆ తర్వాత మినపపప్పు, ఎండు మిరపకాయ, కరివేపాకు వేసి దోరగా వేయించుకోవాలి. పప్పులు ఎర్రగా వేగి కమ్మటి వాసన వస్తున్నప్పుడు, ఆ పోపును తీసుకువెళ్లి చట్నీలో వేసి బాగా కలుపుకోవాలి.
అంతే ఎంతో గుమగుమలాడే, నోరూరించే కర్ణాటక స్టైల్ ఉల్లి చట్నీ రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
