Latest Updates
-
నోరూరించే ఆమ్లెట్ పులుసు.. పుల్లపుల్లగా, కారంకారంగా రుచి అదరహో! -
దీపావళికి ముందే ధ్వజ యోగం.. ఈ 4 రాశుల జాతకులు కోటీశ్వరులు కావడం ఖాయమా? -
నల్ల పాలు తాగుతున్న తెలుగు హీరోయిన్..ప్రయోజనాలేంటో,ఎలా చేసుకోవాలో తెలుసా? -
మటన్ సాంబార్ వండేటప్పుడు ఈ మసాలా పడితే ఆ రుచే వేరు..రాగి సంగటి, చపాతీ,అన్నంలోకి కేక -
రోగనిరోధక శక్తిని పెంచే జామకాయ పచ్చడి.. ఊరనివ్వాల్సిన పనే లేకుండా అప్పటికప్పుడే రెడీ! -
Viral Video Truth: రష్యా యువతి, బీహార్ యువకుడి ప్రేమ కథలో పెద్ద ట్విస్ట్.. -
జుట్టు రాలడం తగ్గించి, ఒత్తుగా పెంచే సీడ్ లడ్డూ.. ఇంట్లోనే ఇలా తయారు చేయండి! -
రైస్, చపాతీలోకి వహ్వా అనిపించే చికెన్ మసాలా..ఎలా చేసుకోవాలంటే.. -
బరువు తగ్గాలనుకుంటున్నారా? ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా కొవ్వును కరిగించే 8 బెస్ట్ ఫుడ్స్ ఇవే! -
సూర్యుడు, బుధుడి కలయికతో బుధాదిత్య రాజయోగం..ఈ 3 రాశుల జాతకం మారబోతోంది!
కృష్ణాష్టమి స్పెషల్: చిన్ని కన్నయ్యకి ఎంతో ప్రీతికరమైన అటుకుల లడ్డూ.. చక్కెర లేకుండా భలే రుచిగా.!
ఈ నెల 4న శ్రీ కృష్ణాష్ణమి. కృష్ణాష్టమి అనగానే చిన్నారుల వేషధారణలు, ముద్దులొలికే స్టెప్పులు, నవ్వులు ఇలా ఎన్నో మధురానుభూతులు ఉంటాయి. వీటన్నిటికి ముందుగా చిన్ని కన్నయ్యకి పూజ చేసేటప్పుడు ఇష్టమైన నైవేద్యాలు సమర్పిస్తాం. కృష్ణయ్యకి అటుకులు ఎంతో ఇష్టం. ఈ పండుగ సందర్భంగా అటుకుల లడ్డూ నైవేద్యం సమర్పించండి. రుచికరంగా ఉండటమే కాదు ఆరోగ్యానికి మేలు చేసే పోహా లడ్డూను ఎలా చేయాలో చూద్దాం..

అటుకుల లడ్డూ తయారీకి కావాల్సిన పదార్థాలు
అటుకులు- రెండు కప్పులు
నెయ్యి- రెండు టేబుల్ స్పూన్లు
తాజా కొబ్బరి తురుము- కప్పు
వేరుశనగ గుండ్లు- పావు కప్పు
వేయించిన శనగపప్పు- పావు కప్పు
తురిమిన బెల్లం- ఒకటిన్నర కప్పు
ఏలకుల పొడి- అరటీస్పూన్
అటుకుల లడ్డూ తయారీ విధానం
పోహా లడ్డూ కోసం మందపాటి అటుకులను తీసుకోవాలి. స్టవ్‌పైన పాన్ పెట్టుకుని అటుకులను దోరగా వేయించుకోవాలి. వేరే బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకుని చల్లారనివ్వాలి.
యమ్మీ స్పైసీతో స్ట్రీట్ ఫుడ్ స్టైల్ మసాలా నూడుల్స్.. ఈ ట్రిక్ పాటిస్తే అస్సలు విరిగిపోదు.!
ఇప్పుడు అదే పాన్‌లో నెయ్యి వేసి కరిగిన తర్వాత తాజా కొబ్బరి తురుము వేసి పచ్చివాసన పోయే వరకు వేయించాలి. మిక్సీ జార్‌లో వేసుకుని అటుకులు, కొబ్బరి తురుమును వేసి బరకగా గ్రైండ్ చేసుకోవాలి.
అదే పాన్‌లో వేరుశనగ పల్లీలు వేసి దోరగా వేయించుకోవాలి. తర్వాత వేయించిన శనగపప్పు వేసి వేయించిన తర్వాత చల్లారనివ్వాలి. ఈ రెండింటినీ మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి. ఈ పౌడర్‌ను అటుకులు, కొబ్బరి తురుము మిశ్రమంలో వేసుకోవాలి.

స్టవ్‌పైన పాన్ పెట్టుకుని తురిమిన బెల్లం వేసుకుని కాసిన్ని నీళ్లు పోసి కరగనివ్వాలి. బెల్లం పానకం చిక్కగా అవుతున్నప్పుడు ఏలకుల పొడి వేసుకుని కలపాలి.
తర్వాత ఈ పాకంలో పొడి మిశ్రమాన్ని వేసి కలిపి కాసేపు చిన్న మంటపైన ఉడికించాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని లడ్డూ మిశ్రమాన్ని చల్లారనివ్వాలి.
చల్లారిన తర్వాత మీడియం సైజు లడ్డూల మాదిరిగా చేసుకోవాలి. ఇలా మిశ్రమం మొత్తాన్ని లడ్డూలుగా చేసుకోవాలి. అంతే అటుకుల లడ్డూలు రెడీ.
Sorakaya Payasam Recipe: పైదరాబాదీ వెడ్డింగ్ స్టైల్ సొరకాయ పాయసం..రుచిలో లేదు దీనికి సాటి..
కృష్ణయ్యకి ఎంతో ఇష్టమైన అటుకులతో లడ్డూలను ఈ విధంగా చేసి నైవేద్యంగా సమర్పించండి. ఈ లడ్డూలు కేవలం టేస్ట్ కోసం మాత్రమే కాదు.. ఆరోగ్యానికి చాలా బలం కూడా. రక్తహీనతని తగ్గిస్తుంది. తక్షణ శక్తిని అందిస్తుంది. సులభంగా జీర్ణం కావడంతో జీర్ణక్రియకు మేలు చేస్తుంది. ఎముకల పుష్టికి, బలానికి మంచిది. గ్లూటెన్ ఫ్రీగా ఉండటంతో డయాబెటిస్ రోగులు నిరభ్యంతరంగా తినవచ్చు. జంక్ ఫుడ్‌కి బదులు వీటిని తీసుకుంటే చాలా మేలు చేస్తుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
