Latest Updates
-
Viral Video Truth: రష్యా యువతి, బీహార్ యువకుడి ప్రేమ కథలో పెద్ద ట్విస్ట్.. -
జుట్టు రాలడం తగ్గించి, ఒత్తుగా పెంచే సీడ్ లడ్డూ.. ఇంట్లోనే ఇలా తయారు చేయండి! -
రైస్, చపాతీలోకి వహ్వా అనిపించే చికెన్ మసాలా..ఎలా చేసుకోవాలంటే.. -
బరువు తగ్గాలనుకుంటున్నారా? ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా కొవ్వును కరిగించే 8 బెస్ట్ ఫుడ్స్ ఇవే! -
సూర్యుడు, బుధుడి కలయికతో బుధాదిత్య రాజయోగం..ఈ 3 రాశుల జాతకం మారబోతోంది! -
గుంటూరు స్టైల్ ఎమ్మెల్యే పెసరట్టు.. ఇంట్లోనే సులభంగా ఇలా చేసుకోండి! -
రక్తహీనతను తరిమికొట్టే, ఉక్కులాంటి బలాన్నిచ్చే నల్ల నువ్వుల పొడి..ఎలా చేసుకోవాలంటే.. -
పొట్లకాయ ఆకారం చూసి పక్కన పెడుతున్నారా? గుండె, ఎముకల ఆరోగ్యానికి ఇదే బెస్ట్..బరువు కూడా తగ్గొచ్చు! -
ఆంధ్ర స్టైల్ ఉసిరికాయ నిల్వ పచ్చడి.. పక్కా కొలతలతో ఇలా చేస్తే రుచి అద్భుతం! -
గురు గ్రహ సంచారం..ఈ 3 రాశులకు కోటీశ్వర యోగం..మీ రాశి ఇందులో ఉందా?
యమ్మీ స్పైసీతో స్ట్రీట్ ఫుడ్ స్టైల్ మసాలా నూడుల్స్.. ఈ ట్రిక్ పాటిస్తే అస్సలు విరిగిపోదు.!
సాయంత్రం కాగానే స్ట్రీట్ ఫుడ్ మీదకి మనసు లాగేస్తుంటుంది. వద్దని మనసు చెబుతున్నా.. నూడుల్స్, పునుగులు, బజ్జీలు, మంచూరియా ఇలా వీటి మీద జిహ్వ లాగేస్తుంటుంది. అయితే వర్షాకాలంలో రోడ్ సైడ్ ఫుడ్ తినడం అంత హెల్తీ కాదు. అందుకే ఆ టేస్ట్ వచ్చేలా ఇంట్లోనే రకరకాలు చేసుకోవచ్చు. ఇక రోడ్ సైడ్ నూడుల్స్‌కి ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. బయట తినడం ఇష్టం లేని వారు ఇంట్లోనే అలాంటి రుచి వచ్చేలా మసాలా నూడుల్స్ ఇలా ట్రై చేయండి.

సాధారణంగా ఇంట్లో నూడుల్స్ చేసుకునేటప్పుడు విరిగిపోతుంటాయి. రోడ్ సైడ్ వచ్చినట్లుగా పొడుగ్గా విరిగిపోకుండా రావు. కానీ ఈ ట్రిక్ పాటిస్తూ ఈ పద్ధతిలో చేశారంటే బండి మీద దొరికే టేస్ట్‌తో యమా స్పైసీగా ఉంటూ లొట్టలేసుకుంటూ తినే టేస్ట్‌తో వస్తాయి. స్ట్రీట్ ఫుడ్ స్టైల్ మసాలా నూడుల్స్ ఎలా తయారు చేయాలో చూద్దాం..
స్ట్రీట్ ఫుడ్ స్టైల్ మసాలా నూడుల్స్ తయారీకి కావాల్సిన పదార్థాలు
ఇన్‌స్టంట్ నూడుల్స్- నాలుగు
ప్యాకెట్లు
నూనె- రెండు టేబుల్ స్పూన్లు
తరిగిన వెల్లుల్లి- రెండు టీస్పూన్లు
తరిగిన అల్లం- టీస్పూన్
ఉల్లిపాయ- చిన్నది
సన్నగా తరిగిన క్యారెట్- అర కప్పు
సన్నగా తరిగిన క్యాబేజ్- అర కప్పు
పొడవుగా తరిగిన రెడ్ క్యాప్సికం- పావు కప్పు
పొడవుగా తరిగిన గ్రీన్ క్యాప్సికం- పావు కప్పు
ఉప్పు- టీస్పూన్
నల్ల మిరియాల పొడి- టీస్పూన్
జీలకర్ర పొడి- అర టీస్పూన్
కశ్మీరీ కారం- రెండు టీస్పూన్లు
చాట్ మసాలా పొడి- రెండు టీస్పూన్లు
పంచదార- టీస్పూన్
సోయాసాస్- రెండు టీస్పూన్లు
తరిగిన ఉల్లికాడలు- పావు కప్పు
స్ట్రీట్ ఫుడ్ స్టైల్ మసాలా నూడుల్స్ తయారీ కోసం ముందుగా స్టవ్‌పైన బాణలి పెట్టుకుని నీళ్లు పోసి బాగా మరిగిన తర్వాత నూడుల్స్ వేసుకుని రెండు నిమిషాల పాటు ఉడికించాలి. మధ్యలో కొద్దిగా నూనె వేసుకుంటే అతుక్కోకుండా పొడిపొడిగా వస్తాయి.
పోషకాల గని.. వర్షాకాలంలో తప్పనిసరిగా తాగాల్సిన చెట్టినాడ్ ఫ్రూట్ పాయసం.!
ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ నూడుల్స్‌ను జల్లెడ సాయంతో వేరే వెడల్పాటి బౌల్‌లో ట్రాన్స్‌ఫర్ చేసుకుని చల్లటి నీళ్లు పోసి పెట్టుకోవాలి. దీని ద్వారా విరిగిపోకుండా అతుక్కోకుండా ఉంటాయి. జల్లెడ సాయంతో మరోసారి వడగట్టుకుని నీళ్లు తీసేయండి.
స్టవ్‌పైన వెడల్పాటి కడాయి పెట్టుకుని అందులో నూనె వేసి కాగిన తర్వాత అల్లం, వెల్లుల్లి ముక్కలు వేసి వేగనివ్వండి. తర్వాత సన్నగా, పొడుగ్గా కట్ చేసిన ఉల్లిపాయ, క్యారెట్, క్యాబేజీ, రెడ్ క్యాప్సికం, గ్రీన్ క్యాప్సికం వేసి వేయించండి.

తర్వాత ఉప్పు, మిరియాల పొడి, చాట్ మసాలా, జీలకర్ర పొడి, కశ్మీరీ కారం, పంచదార, సొయాసాస్, అవసరం అనుకుంటే చిల్లీ సాస్ వేసి కాసేపు మగ్గనివ్వండి. తరిగిన ఉల్లికాడలు వేసి మరోసారి కలపండి.
బ్యూటీ సీక్రెట్.. చుక్క నీరు, మినప్పప్పు లేకుండా నిమిషాల్లో చేసుకునే కీరదోస ఇడ్లీ.!
ఇప్పుడు వడగట్టుకున్న నూడుల్స్ వేసి రెండు స్పాచులాల సాయంతో విరగకుండా స్మూత్‌గా కలపండి. నూడుల్స్ మొత్తానికి మసాలాలు బాగా కలిసి మగ్గేంత వరకు మెల్లగా కలపండి.
మూడు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కాసేపాగి సర్వ్ చేసుకోవడమే. స్ట్రీట్ ఫుడ్ స్టైల్ మసాలా నూడుల్స్ రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
