Latest Updates
-
అసలు సిసలైన పల్లీ చట్నీ.. ఒక్కసారి ఇలా చేసి చూడండి, మళ్లీ మళ్లీ కావాలంటారు! -
అక్టోబర్ 9న ఉత్తరాభాద్ర నక్షత్రంలోకి శని.. ఏయే రాశుల తలరాత మారనుందంటే? -
కంటిచూపు మెరుగుపర్చి, జుట్టు రాలడం తగ్గించే అసలైన కరివేపాకు కారం పొడి..ఎలా చేసుకోవాలంటే.. -
Chanakya Niti in Telugu: ఎప్పుడు మాట్లాడాలి? ఎప్పుడు మౌనంగా ఉండాలి? -
అసలు సిసలైన నెల్లూరు పప్పులుసు..ఒక్కసారి రుచి చూస్తే వదలరు! -
Operation Firewall 2026: పాక్ ISI ని వణికించిన ఏపీ పోలీస్..దేశవ్యాప్తంగా ప్రశంసలు..వైజాగ్ లో ఏమైందంటే? -
ఎన్నో పోషకాలు, ఔషధ గుణాలను అందించే సంజీవని..పల్లెటూరి స్టైల్ నల్ల కారం పొడి చేసుకోండిలా.. -
జిమ్ లేదు, కఠినమైన డైట్ లేదు..జపనీయుల టెక్నిక్ తో ఏకంగా 40 కిలోలు తగ్గిన ఖుష్బూ.. ఆ సీక్రెట్ ఏంటంటే? -
ఇడ్లీ, దోశల్లోకి పర్ఫెక్ట్ సైడ్ డిష్.. 15 నిమిషాల్లో అదిరిపోయే ఇడ్లీ కుర్మా..నాలుగు ఇడ్లీలు ఎక్కువే తింటారు! -
గ్యాస్ సమస్యలు రాని ఆరోగ్యకరమైన పెసరపప్పు వడ.. సింపుల్ గా ఇలా చేయండి!
ఎండల నుంచి ఇట్టే ఉపశమనం ఇచ్చే గోవా స్పెషల్ డ్రింక్..
మే నెలాఖరులోకి వచ్చేశాం. ఎండలు మండిపోతున్నాయి. ఉదయం పది గంటలు దాటితే చాలు గడప దాటి బయట అడుగుపెట్టాలంటేనే జనం భయపడిపోతున్నారు. పండ్ల రసాలు, కొబ్బరి నీళ్లు, సబ్జా వాటర్, మజ్జిగ, బార్లీ నీళ్లు, నిమ్మరసం.. ఇలా దొరికిన ప్రతి చల్లటి పానీయాన్ని తాగేస్తూ వేసవి తాపం నుంచి ఉపశమనం పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే మీరు రోజూ తాగే ఆ రొటీన్ పానీయాలకు బదులుగా కాస్త వెరైటీగా, ఆరోగ్యానికి మేలు చేసే కొత్త డ్రింక్ ట్రై చేయాలనుకుంటున్నారా? అయితే మహారాష్ట్ర, గోవా ప్రాంతాల్లో ఎంతో ఫేమస్ అయిన కులిత్ కలాన్ ట్రై చేయండి. ఉలవలు, మజ్జిగ కాంబినేషన్‌తో చేసే ఈ డ్రింక్ వేడిని క్షణాల్లో మాయం చేస్తుంది.

కులిత్ కలాన్ తయారీకి కావాల్సిన పదార్థాలు
ఉప్పు - రుచికి సరిపడా
చక్కెర- రెండు చిటికెళ్లు
ఇంగువ - చిటికెడు
నెయ్యి - తాలింపుకు సరిపడా
ఉలవలు - తగినన్ని
జీలకర్ర - ఒక చెంచా
మజ్జిగ - సరిపడా
పచ్చిమిర్చి - రెండు
కులిత్ కలాన్ తయారీ విధానం
-ఈ డ్రింక్ తయారు చేయడానికి ముందురోజు రాత్రే సన్నాహాలు మొదలుపెట్టాలి. ఒక గిన్నెలో ఉలవలను తీసుకుని శుభ్రంగా కడిగి, తగినన్ని నీళ్లు పోసి రాత్రంతా నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయం ఆ ఉలవలను మరోసారి కడిగి, ఒక గిన్నెలో ఎక్కువ నీళ్లు పోసి మెత్తగా ఉడికించుకోవాలి.
-ఉలవలు బాగా ఉడికిన తర్వాత, అందులోని నీటిని మాత్రమే వడకట్టి ఒక గిన్నెలోకి తీసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి. నీళ్లు చల్లారిన తర్వాత అందులో ముందుగా సిద్ధం చేసుకున్న మజ్జిగ, సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు, సరిపడా ఉప్పు, చిటికెడు పంచదార వేసి బాగా కలుపుకోవాలి.
-ఇప్పుడు స్టవ్ మీద ఒక చిన్న కడాయి పెట్టి, కొద్దిగా నెయ్యి వేయాలి. నెయ్యి వేడెక్కాక జీలకర్ర, ఇంగువ వేసి దోరగా వేయించాలి. పోపు వేగిన తర్వాత మంటను బాగా తగ్గించి ముందుగా కలిపి పెట్టుకున్న ఉలవల మజ్జిగ మిశ్రమాన్ని ఈ తాలింపులో పోయాలి. ఆ మిశ్రమం కాస్త గోరువెచ్చగా అయ్యేంత వరకు ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
-అంతే ఎంతో రుచికరమైన కులిత్ కలాన్ రెడీ
ఈ డ్రింక్ ఎందుకు తాగాలంటే..
ఉలవల రసం, మజ్జిగ కలవడం వల్ల ఇది అద్భుతమైన ప్రొబయాటిక్ గా
పనిచేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వేసవిలో తరచుగా వేధించే
కడుపు ఉబ్బరం, అజీర్తి, మలబద్ధకం వంటి పొట్ట సమస్యలను ఇది ఇట్టే మాయం
చేస్తుంది. ఇందులో అమైనో ఆమ్లాలు, ప్రొటీన్లు, ఐరన్ పుష్కలంగా ఉంటాయి.
ఎండ దెబ్బకు నీరసించిపోయిన శరీరానికి ఈ డ్రింక్ తక్షణ శక్తిని
అందిస్తుంది. బరువు తగ్గాలనుకునే వారికి కూడా ఇది బెస్ట్ డైట్ ఆప్షన్.
ఎండాకాలంలో శరీర ఉష్ణోగ్రతను అదుపులో ఉంచి, ఒంట్లో వేడిని
తగ్గిస్తుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
