Latest Updates
-
చిత్తా నక్షత్రంలోకి శుక్రుడు.. ఆగస్టు 25 నుంచి ఈ 3 రాశులకు కుప్పలుతెప్పలుగా ధనాగమం! -
సండే స్పెషల్: నోరూరించే ఎగ్ ఘీ రోస్ట్ మసాలా..నాలుకకి పండగే పండగ..వేళ్లు నాక్కుంటూ తినేస్తారు! -
బ్లాక్ కాఫీలో నిమ్మకాయ వేసి తాగితే ఏమవుతుందో తెలుసా? -
హై ప్రొటీన్, ఫైబర్ నిండిన కినోవా జంతికలు..డయాబెటిస్, వెయిట్ లాస్ ఉన్నవారికి బెస్ట్ ఆప్షన్ -
ఆదివారం రెగ్యులర్ చికెన్ కి బ్రేక్.. కేరళ మలబార్ చికెన్ గ్రేవీ ట్రై చేయండి..చపాతీ,దోసెతో అద్భుతం.. -
గ్రహాల రాశుల మార్పు: ఆగష్టు చివరి వారంలో వీరికి ఊహించని ధన లాభం -
జీర్ణ సమస్యలకు చెక్ పెట్టే సంజీవని..100% కల్తీ లేని త్రిఫల చూర్ణం ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
మీ ఇంట్లో బొద్దింకలు పదే పదే కనిపిస్తున్నాయా? అయితే ఈ దోషం ఉన్నట్లే! -
జంక్ ఫుడ్ వద్దు.. సాయంత్రం వేళ పిల్లల ఆరోగ్యానికి మేలు చేసే వేడివేడి సూప్ ఇదే! -
గ్రైండర్ అక్కర్లేదు..మిక్సీలో రుబ్బిన పిండితోనే పర్ఫెక్ట్ హోటల్ స్టైల్ మినప వడలు..ఎలా చేసుకోవాలంటే..
ఒక్కసారి ఈ గుజరాతీ స్టైల్ ఆలూ కూర వండారంటే.. చపాతీలు, పూరీలు ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే!
బంగాళదుంప (ఆలుగడ్డ) అనగానే ఎవరికైనా ముందుగా గుర్తొచ్చేవి వేడి వేడి వడలు, ఆలు పరాటాలు లేదా పిల్లలు ఎంతో ఇష్టపడే కరకరలాడే ఫ్రెంచ్ ఫ్రైస్. అయితే మీరు ఎప్పుడైనా గుజరాత్ రాష్ట్రపు అతి ప్రాచీన, సంప్రదాయ వంటకమైన కతియావాడి లసానియా బటాటా కూర రుచి చూశారా? పేరు కాస్త కొత్తగా అనిపించినా, దీని రుచి మాత్రం మీ నాలుకపై ఎప్పటికీ నిలిచిపోతుంది. ఒక్కసారి ఈ గుజరాతీ స్టైల్ బంగాళదుంప కూరను ఇంట్లో వండితే, ఆ కమ్మటి సువాసనలకే ఇంట్లో వాళ్లంతా వంటగది వైపు పరుగులు తీయడం ఖాయం.

గుజారాత్ స్టైల్ బంగాళదుంప కూర తయారీకి కావల్సినవి
ఉడికించిన చిన్న బంగాళదుంపలు (బేబీ పొటాటోస్) - 500 గ్రాములు
కాశ్మీరీ ఎర్ర కారం పొడి - 1 టీస్పూన్
పసుపు పొడి - అర టీస్పూన్
బ్లాక్ సాల్ట్ - అర టీస్పూన్
వంట నూనె - 1 టీస్పూన్
వెల్లుల్లి రెబ్బలు - 20 నుండి 30 వరకు
కాశ్మీరీ ఎర్ర కారం పొడి - 2 టీస్పూన్లు
సాధారణ కారం పొడి - 1 టీస్పూన్
ధనియాల పొడి - అర టీస్పూన్
పసుపు పొడి - అర టీస్పూన్
జీలకర్ర పొడి - అర టీస్పూన్
ఉప్పు-తగినంత
వేడి నీళ్లు - తగినంత
గ్రేవీ తయారీకి వంట నూనె - 2 టీస్పూన్లు
జీలకర్ర - చిటికెడు
ఇంగువ - చిటికెడు
ఉల్లిపాయ - 1
టమాటో - 1
గరం మసాలా - అర టీస్పూన్
వేడి నీళ్లు - తగినంత
పచ్చి కొత్తిమీర - కొద్దిగా

గుజరాత్ స్టైల్ బంగాళదుంప కూర తయారీ విధానం
-ముందుగా ఉడికించి పొట్టు తీసిన చిన్న బంగాళదుంపలను (బేబీ పొటాటోస్) ఒక గిన్నెలో తీసుకోండి. అందులో కాశ్మీరీ కారం, పసుపు, నల్ల ఉప్పు, ఒక టీస్పూన్ నూనె వేసి బాగా కలిపి కాసేపు పక్కన పెట్టండి.
-ఈ కూరకు అసలైన రుచినిచ్చేది వెల్లుల్లి చట్నీనే. ఒక రోలు తీసుకుని అందులో పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా ఉప్పు వేసి కచ్చాపచ్చాగా దంచండి. అందులోనే కాశ్మీరీ కారం, మామూలు కారం వేసి ముద్దలా బాగా నూరండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి మార్చుకుని.. అందులో ధనియాల పొడి, పసుపు, జీలకర్ర పొడి వేసి కలపండి. ఆ తర్వాత నెమ్మదిగా కొద్దికొద్దిగా వేడి నీళ్లు పోస్తూ, ఈ మిశ్రమాన్ని చిక్కటి పేస్ట్ లా కలుపుకోండి.
-ఇప్పుడు స్టవ్ వెలిగించి మందపాటి కడాయి పెట్టి నూనె వేయండి. నూనె వేడెక్కాక, ముందుగా మసాలా పట్టించి పెట్టుకున్న బంగాళదుంపలను వేయండి. పెద్ద మంట మీద ఇవి పైన కరకరలాడేంత వరకు దోరగా వేయించి, ఆ నూనెలోంచి తీసి పక్కన పెట్టుకోండి.
-అదే కడాయిలో మిగిలిన నూనెలో జీలకర్ర, ఇంగువ వేసి చిటపటలాడనివ్వండి. ఆ తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి, అవి గోల్డెన్ బ్రౌన్ మారేంత వరకు బాగా వేయించండి.
-ఉల్లిపాయలు వేగిన తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న వెల్లుల్లి మసాలా పేస్ట్, సన్నగా తరిగిన టమాటో ముక్కలు, కొద్దిగా ఉప్పు వేయండి. వెల్లుల్లిలోని పచ్చి వాసన పోయి, కమ్మటి సువాసన వచ్చే వరకు 2-3 నిమిషాల పాటు వేయించండి. ఆ తర్వాత గ్రేవీకి సరిపడా వేడి నీళ్లు పోసి, టమోటాలు పూర్తిగా మెత్తబడి నూనె పైకి తేలే వరకు 3-4 నిమిషాల పాటు మీడియం మంట మీద ఉడికించండి.
-గ్రేవీ చక్కగా ఉడికిన తర్వాత, ముందుగా వేయించి పెట్టుకున్న బంగాళదుంపలను అందులో వేసి కూరంతా కలిసేలా సున్నితంగా కలపండి. చివరగా కొద్దిగా గరం మసాలా చల్లి, రుచి చూసి ఉప్పు సరిచేసుకోండి. సన్నగా తరిగిన తాజా కొత్తిమీరను పైన చల్లి స్టవ్ ఆఫ్ చేయండి.
-అంతే నోరూరించే, స్పైసీ అండ్ టేస్టీ కతియావాడి లాసనియా బటాటా రెడీ. దీనిని వేడివేడి నాన్, చపాతీ, పూరీ లేదా అన్నంతో తింటే సూపర్ గా ఉంటారు.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications