For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నిమ్మకాయ రైస్ రెసిపీ | ఇంటి వద్ద చిత్రాన్న రైస్ తయారుచేయటం ఎలా

నిమ్మకాయ రైస్ ఒక సాంప్రదాయిక దక్షిణ భారతీయ రైస్ వంటకం. దీనిని రెగ్యులర్ గా భోజనంలోను మరియు పండగలలో తయారుచేస్తారు.

Posted By: Lakshmi Perumalla
|

నిమ్మకాయ రైస్ ఒక సాంప్రదాయిక దక్షిణ భారతీయ రైస్ వంటకం. నిమ్మకాయ రైస్ ని ఎలా సిద్ధం చేసుకోవాలో ఇక్కడ వివరణాత్మక దశల వారీ విధానం ఉంది.

దక్షిణ భారతీయ ఆలయాలలో చిత్రాన్న రైస్ ని నైవేద్యంగా పెడతారు. కర్ణాటకలో చిత్రాన్న రైస్ అని పిలుస్తారు. నిమ్మకాయ రైస్ ని దీపావళి, వరలక్ష్మి పూజ వంటి పండుగలలో ప్రధానంగా తయారుచేస్తారు.

పెరుగన్నం,కూరగాయల బాత్, బిసిబిలే బాత్ వంటి ఇతర వంటకాలను గమనించండి.

నిమ్మకాయ రైస్ స్పైసి మరియు పుల్లగా ఉండి నూనె ఎక్కువగా ఉంటుంది. ఈ రెసిపీని ఇంటిలో చాలా తక్కువ సమయంలో మరియు చాలా సులభంగా తయారుచేసుకోవచ్చు.

సాధారణంగా నిమ్మకాయ రైస్ ని గది ఉష్ణోగ్రత వద్ద వడ్డిస్తారు. అన్నం చల్లారిన తర్వాతే నిమ్మరసం కలుపుతారు. అలాగే చిత్రాన్న రైస్ కలిపే సమయంలో కూడా అన్నం చల్లారాలి.

నిమ్మకాయ రైస్ పాపడ్ మరియు విజిటెబుల్ సలాడ్స్ తో కలిపి వడ్డిస్తారు. మీకు వైవిధ్యం కావాలని అనుకుంటే పైనాపిల్ గుజ్జుతో ప్రయత్నించవచ్చు. వీడియో రెసిపీని చూడండి మరియు నిమ్మకాయ రైస్ తయారుచేసే స్టెప్ బై స్టెప్ ప్రక్రియను కూడా అనుసరించండి.

నిమ్మకాయ రైస్ వీడియో రెసిపీ

నిమ్మకాయ రైస్ రెసిపీ | చిత్రాన్న రైస్ రెసిపీ తయారి | దక్షిణ భారతీయ నిమ్మకాయ రైస్ | నిమ్మకాయ ఫ్లేవర్ రైస్ రెసిపీ
నిమ్మకాయ రైస్ రెసిపీ | చిత్రాన్న రైస్ రెసిపీ తయారి | దక్షిణ భారతీయ నిమ్మకాయ రైస్ | నిమ్మకాయ ఫ్లేవర్ రైస్ రెసిపీ
Prep Time
10 Mins
Cook Time
40M
Total Time
50 Mins

Recipe By: అర్చన V

Recipe Type: ప్రధాన కోర్సు

Serves: 2

Ingredients
  • నూనె - 8 టేబుల్ స్పూన్లు

    వేరు శనగ - ½ కప్పు

    ఆవాలు - 1 స్పూన్

    జీలకర్ర - 1 స్పూన్

    ఉల్లిపాయలు (సన్నగా మరియు పొడవైన ముక్కలు) - 1 కప్పు

    పచ్చి మిరపకాయలు (చీరికలుగా కోయాలి) - 4

    పచ్చి శనగ పప్పు - 2 స్పూన్

    కాప్సికమ్ (క్యూబ్ ఆకారంలో కోయాలి) - 1 కప్పు

    రుచికి సరిపడా - ఉప్పు

    పసుపు పొడి - ½ స్పూన్

    కొత్తిమీర (తరిగినది ) - ½ కప్పు

    నిమ్మ రసం - అర చెక్క

    రైస్ - ½ బౌల్

    నీరు - 1 బౌల్

How to Prepare
  • 1. కుక్కర్ లో బియ్యం పోయాలి.

    2. నీరు మరియు రెండు స్పూన్ల ఉప్పు కలపాలి.

    3. రెండు విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి.

    4. పాన్ పొయ్యి మీద పెట్టి నూనె పోయాలి.

    5. దానిలో వేరుశనగ గుళ్ళు వేసి మంచి వాసన, రంగు వచ్చేవరకు వేగించాలి.

    6. పాన్ నుండి వేగిన వేరుశనగ గుళ్లను ప్లేట్ లోకి తీసుకోవాలి.

    7. మిగిలిన నూనెలో ఆవాలు వేసి చిటపట లాడేవరకు వేగించాలి.

    8. ఆ తర్వాత జీలకర్ర మరియు ఉల్లిపాయ ముక్కలు వేయాలి.

    9. ఒక నిమిషం వేగించాలి.

    10. ఇప్పుడు చీరికలుగా కోసిన పచ్చి మిరప ముక్కలు,శనగపప్పు వేయాలి.

    11. ఉల్లిపాయ ముక్కలు గోల్డ్ కలర్ వచ్చే వరకు వేగించాలి.

    12. ఆ తర్వాత కాప్సికం వేసి బాగా కలపాలి.

    13. ఉప్పు మరియు పసుపు పొడి కలపాలి.

    14. 5 నుంచి 6 నిమిషాల వరకు వేగించాలి. అంటే కాప్సికం సగం ఉడికే వరకు వేగించాలి.

    15. వేగించి పక్కన పెట్టుకున్న వేరుశనగ గుళ్ళు మరియు తరిగిన కొత్తిమీర వేయాలి.

    16. బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేయాలి.

    17. 15 నుంచి 20 నిమిషాల పాటు బాగా చల్లారబెట్టాలి.

    18. నిమ్మరసం వేసి బాగా కలపాలి.

    19. ఉడికించి పెట్టుకున్న అన్నం వేసి బాగా కలపాలి.

    20. సర్వింగ్ బౌల్ లోకి తీసుకోని సర్వ్ చేయండి.

Instructions
  • 1. నిమ్మకాయ మిశ్రమాన్ని మూడు రోజులు నిల్వ చేసుకోవచ్చు.
  • 2. కాప్సికం కేవలం రుచి కోసమే. అవసరం అనుకుంటే వేసుకోవచ్చు లేకపోతె మానేయవచ్చు.
Nutritional Information
  • సర్వింగ్ సైజు - 1 కప్పు
  • కేలరీలు - 300 కేలరీలు
  • కొవ్వు - 20 గ్రాములు
  • ప్రోటీన్ - 14 గ్రాములు
  • కార్బోహైడ్రేట్లు - 94 గ్రాములు
  • షుగర్ - 1 గ్రాములు
  • డైటరీ ఫైబర్ - 4 గ్రాములు

స్టెప్ బై స్టెప్ - నిమ్మకాయ రైస్ ఎలా తయారుచేయాలి

1. కుక్కర్ లో బియ్యం పోయాలి.

2. నీరు మరియు రెండు స్పూన్ల ఉప్పు కలపాలి.

3. రెండు విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి.

4. పాన్ పొయ్యి మీద పెట్టి నూనె పోయాలి.

5. దానిలో వేరుశనగ గుళ్ళు వేసి మంచి వాసన, రంగు వచ్చేవరకు వేగించాలి.

6. పాన్ నుండి వేగిన వేరుశనగ గుళ్లను ప్లేట్ లోకి తీసుకోవాలి.

7. మిగిలిన నూనెలో ఆవాలు వేసి చిటపట లాడేవరకు వేగించాలి.

8. ఆ తర్వాత జీలకర్ర మరియు ఉల్లిపాయ ముక్కలు వేయాలి.

9. ఒక నిమిషం వేగించాలి.

10. ఇప్పుడు చీరికలుగా కోసిన పచ్చి మిరప ముక్కలు,శనగపప్పు వేయాలి.

11. ఉల్లిపాయ ముక్కలు గోల్డ్ కలర్ వచ్చే వరకు వేగించాలి.

12. ఆ తర్వాత కాప్సికం వేసి బాగా కలపాలి.

13. ఉప్పు మరియు పసుపు పొడి కలపాలి.

14. 5 నుంచి 6 నిమిషాల వరకు వేగించాలి. అంటే కాప్సికం సగం ఉడికే వరకు వేగించాలి.

15. వేగించి పక్కన పెట్టుకున్న వేరుశనగ గుళ్ళు మరియు తరిగిన కొత్తిమీర వేయాలి.

16. బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేయాలి.

17. 15 నుంచి 20 నిమిషాల పాటు బాగా చల్లారబెట్టాలి.

18. నిమ్మరసం వేసి బాగా కలపాలి.

19. ఉడికించి పెట్టుకున్న అన్నం వేసి బాగా కలపాలి.

20. సర్వింగ్ బౌల్ లోకి తీసుకోని సర్వ్ చేయండి.

[ 3.5 of 5 - 81 Users]
English summary

Lemon Rice Recipe | How To Make Chitrana Rice | South Indian Lemon Rice Recipe | Lemon Flavoured Rice Recipe

Lemon rice is a popular South Indian recipe that can be prepared as a main course. Watch the video on how to make chitrana rice. Read the step-by-step
Desktop Bottom Promotion