Latest Updates
-
చిత్తా నక్షత్రంలోకి శుక్రుడు.. ఆగస్టు 25 నుంచి ఈ 3 రాశులకు కుప్పలుతెప్పలుగా ధనాగమం! -
సండే స్పెషల్: నోరూరించే ఎగ్ ఘీ రోస్ట్ మసాలా..నాలుకకి పండగే పండగ..వేళ్లు నాక్కుంటూ తినేస్తారు! -
బ్లాక్ కాఫీలో నిమ్మకాయ వేసి తాగితే ఏమవుతుందో తెలుసా? -
హై ప్రొటీన్, ఫైబర్ నిండిన కినోవా జంతికలు..డయాబెటిస్, వెయిట్ లాస్ ఉన్నవారికి బెస్ట్ ఆప్షన్ -
ఆదివారం రెగ్యులర్ చికెన్ కి బ్రేక్.. కేరళ మలబార్ చికెన్ గ్రేవీ ట్రై చేయండి..చపాతీ,దోసెతో అద్భుతం.. -
గ్రహాల రాశుల మార్పు: ఆగష్టు చివరి వారంలో వీరికి ఊహించని ధన లాభం -
జీర్ణ సమస్యలకు చెక్ పెట్టే సంజీవని..100% కల్తీ లేని త్రిఫల చూర్ణం ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
మీ ఇంట్లో బొద్దింకలు పదే పదే కనిపిస్తున్నాయా? అయితే ఈ దోషం ఉన్నట్లే! -
జంక్ ఫుడ్ వద్దు.. సాయంత్రం వేళ పిల్లల ఆరోగ్యానికి మేలు చేసే వేడివేడి సూప్ ఇదే! -
గ్రైండర్ అక్కర్లేదు..మిక్సీలో రుబ్బిన పిండితోనే పర్ఫెక్ట్ హోటల్ స్టైల్ మినప వడలు..ఎలా చేసుకోవాలంటే..
ఉదయం చట్నీ టెన్షన్ వద్దు.. ఈ టొమాటో తొక్కు ఉంటే ఇడ్లీ, దోసెల్లోకి పండుగే..ఒక్కసారి చేస్తే వారం రోజులు నిల్వ
రోజూ తినే పల్లీల చట్నీ, కొబ్బరి చట్నీలు తిని బోర్ కొట్టిందా? ఇడ్లీ, దోసెలకు ఏ సైడ్ డిష్ చేయాలో అర్థం కావడం లేదా? అయితే ఇక ఏమాత్రం ఆలోచించకండి. మీ ఇంట్లో టొమాటోలు ఎక్కువగా ఉన్నాయా? అయితే వాటితో ఎంతో రుచికరమైన, నోరూరించే టొమాటో తొక్కు తయారు చేసుకోండి. ఈ టొమాటో తొక్కు కేవలం ఇడ్లీ, దోసెల్లోకే కాకుండా.. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని కలుపుకుని తింటే అమృతంలా ఉంటుంది. దీన్ని ఒక్కసారి చేసి పెట్టుకుంటే, వారం రోజుల పాటు ఫ్రిజ్‌లో నిల్వ ఉంటుంది. ఉరుకుల పరుగుల జీవితంలో సమయం ఆదా చేసుకోవడానికి ఇది బెస్ట్ రెసిపీ.

టొమాటో తొక్కు తయారీకి కావలసిన పదార్థాలు
నువ్వుల నూనె (లేదా ఆలివ్ నూనె) - 3 టేబుల్ స్పూన్లు (నువ్వుల నూనె
వాడితే రుచి, నిల్వ ఉండే గుణం పెరుగుతుంది)
ఆవాలు - 1/2 టీస్పూన్
మినప పప్పు - 1 టీస్పూన్
పెద్ద ఉల్లిపాయలు - 250 గ్రాములు (సన్నగా తరుగుకోవాలి)
కరివేపాకు - 1 కట్ట
వెల్లుల్లి - 25 రెబ్బలు (సన్నగా తరుగుకోవాలి)
టొమాటోలు - అర కేజీ (1/2 kg సన్నగా తరుగుకోవాలి)
కారం - 3 నుండి 4 టేబుల్ స్పూన్లు (మీరు తినే స్పైస్ బట్టి)
గరం మసాలా - 1/2 టీస్పూన్
ఉప్పు - రుచికి సరిపడా
చివరిలో తాలింపు కోసం:
నూనె - 1 టేబుల్ స్పూన్
కరివేపాకు - 2 కట్టలు

టొమాటో తొక్కు తయారీ విధానం
-ముందుగా స్టవ్ వెలిగించి, మందపాటి కడాయి లేదా బాండీ పెట్టుకోవాలి. అందులో నువ్వుల నూనె వేసి వేడి చేయాలి. నూనె కాస్త కాగాక ఆవాలు, మినప పప్పు వేసి దోరగా వేయించుకుని తాలింపు పెట్టుకోవాలి.
-ఆవాలు చిటపటలాడాక.. అందులో సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేయాలి. మంటను మీడియం ఫ్లేమ్ లో ఉంచి, ఉల్లిపాయలు పచ్చివాసన పోయి, కాస్త మెత్తబడే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు సన్నగా తరిగిన వెల్లుల్లి రెబ్బలను ఇందులో కలపాలి. తర్వాత రుచికి సరిపడా ఉప్పు చల్లి అన్నీ కలిసేలా బాగా వేయించాలి.
-ఉల్లిపాయలు, వెల్లుల్లి బాగా మగ్గిన తర్వాత.. ముందుగా కట్ చేసి పెట్టుకున్న టొమాటో ముక్కలను వేసి గరిటెతో బాగా కలపండి. కాసేపటికి టొమాటోల నుండి సహజంగానే నీరు బయటకు వస్తుంది. ఆ సమయంలో కారం వేసి బాగా కలిపి, కడాయిపై మూత పెట్టి సుమారు 5 నిమిషాల పాటు ఉడికించండి.
-తర్వాత మూత తీసి చూసి, అడుగు అంటకుండా ఒకసారి కలపండి. మళ్ళీ మూతపెట్టి మంటను పూర్తిగా తక్కువలో ఉంచి 10 నిమిషాలు ఉడికించాలి. మాడిపోకుండా మధ్యమధ్యలో మూత తీసి కలుపుతూ ఉండటం మర్చిపోవద్దు.
-పది నిమిషాల తర్వాత చూస్తే.. టొమాటో గుజ్జు మెత్తగా ఉడికిపోయి, దాని నుండి నూనె పైకి తేలి పక్కలకు వస్తుంది. తొక్కు పర్ఫెక్ట్ గా ఉడికిందనడానికి ఇదే గుర్తు.
-ఇప్పుడు అందులో అర టీస్పూన్ గరం మసాలా చల్లి బాగా కలిపి, మరో 2-3 నిమిషాల పాటు సన్నని మంటపై ఉడికించి స్టవ్ కట్టేయండి.
-ఈ తొక్కుకు మరింత కమ్మటి రుచిని జోడించడానికి.. స్టవ్ పై ఒక చిన్న పాన్ పెట్టి ఒక టేబుల్ స్పూన్ నూనె వేడి చేయండి. అందులో రెండు కట్టల కరివేపాకు వేసి కరకరలాడేలా వేయించి, ఆ మిశ్రమాన్ని సిద్ధంగా ఉన్న టొమాటో తొక్కులో కలుపుకోండి.
-అంతే గుమగుమలాడే ఎంతో రుచికరమైన టొమాటో తొక్కు రెడీ. పూర్తిగా చల్లారాక దీన్ని గాలి చొరబడని గాజు సీసాలో భద్రపరుచుకుంటే వారం రోజుల పాటు వాడుకోవచ్చు
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications