రాత్రి పూట స్వీట్ తినాలనిపిస్తుందా? ఓవెన్ అక్కర్లేకుండానే ఇంట్లోనే బేకరీ స్టైల్ బనానా బ్రెడ్ చేసుకోండిలా..

Posted By:

సాధారణంగా చాలామంది రాత్రి సమయంలో ఏదైనా తీయగా, స్వీట్ తినాలని అనిపిస్తుంటది. ఆ సమయంలో బయటకు వెళ్లి తెచ్చుకోవడం కష్టం, అలాగని ఆ కోరికను చంపుకోలేం. ఇలాంటి సమయాల్లో మీ మనసుకు, కడుపుకు తృప్తినిచ్చే బెస్ట్ ఆప్షన్ బనానా బ్రెడ్. బేకరీలో దొరికే మృదువైన, కమ్మటి బనానా బ్రెడ్‌ ను మనం ఇంట్లోనే చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. దీనిలో ఉన్న అతిపెద్ద ప్రత్యేకత ఏమిటంటే.. దీన్ని తయారు చేయడానికి మీకు ఓవెన్ అస్సలు అవసరం లేదు.మన వంటగదిలో ఉండే సాధారణ పాన్‌ తోనే బేకరీ స్టైల్ బ్రెడ్‌ ను తయారుచేసుకోవచ్చు.

Midnight Sweet Cravings Try This Easy No Oven Banana Bread Recipe at Home in Telugu

నోట్లో వేస్తే కరిగిపోయే బేకరీ స్టైల్ బాదుషా.. ఇంట్లోనే పర్ఫెక్ట్‌ గా ఇలా చేయండి!

బనానా బ్రెడ్ తయారీకి కావలసిన పదార్థాలు

బాగా పండిన అరటిపండ్లు - 5
చక్కెర - 180 గ్రాములు
పెరుగు - 180 గ్రాములు
కరిగించిన వెన్న - 60 గ్రాములు
వెనిలా ఎక్స్‌ట్రాక్ట్ - 2 టీస్పూన్లు
మైదా పిండి - 180 గ్రాములు
బేకింగ్ పౌడర్ - అర టీస్పూన్
బేకింగ్ సోడా - అర టీస్పూన్
దాల్చినచెక్క పొడి (సినమన్ పౌడర్) - 1 టేబుల్ స్పూన్
వాల్‌నట్స్ - గుప్పెడు
బటర్ పేపర్ - 1 షీట్

పప్పుచారులోకి బెస్ట్ సైడ్ డిష్.. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్ గా ఉండే ఎగ్ వడ.. 10 నిమిషాల్లో చేసేయండిలా

Midnight Sweet Cravings Try This Easy No Oven Banana Bread Recipe at Home in Telugu

బనానా బ్రెడ్ తయారీ విధానం

-ముందుగా 5 బాగా పండిన అరటిపండ్లను తీసుకుని తొక్క తీసి, చిన్న ముక్కలుగా కోసి ఒక మిక్సీ జార్‌ లో వేయండి. ఇందులోనే చక్కెర, పెరుగు, వెన్న, వెనిలా ఎక్స్‌ట్రాక్ట్ వేయండి. ఈ మిశ్రమాన్ని ఎక్కడా ముక్కలు లేకుండా క్రీమ్ లాగా, మెత్తని పేస్ట్‌ లా బ్లెండ్ చేసుకోండి. ఈ పేస్ట్‌ను ఒక పక్కన పెట్టుకోండి.

-ఇప్పుడు ఒక పెద్ద మిక్సింగ్ బౌల్ తీసుకోండి. అందులో జల్లెడ ఉంచి మైదా పిండిని వేయండి.

-ఇప్పుడు జల్లించిన పిండిలో బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, దాల్చినచెక్క పొడి వేసి బాగా కలపండి. తర్వాత సన్నగా తరిగిన వాల్‌ నట్ ముక్కలను వేసి పిండిలో కలిసేలా తిప్పండి. తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న అరటిపండు పేస్ట్‌ ను ఈ పొడి పిండి మిశ్రమంలో వేసి అన్నీ ఒకదానితో ఒకటి బాగా కలిసేలా మృదువుగా గిలకొట్టండి. ఇప్పుడు ఒక బ్రెడ్ మౌల్డ్ (కేక్ పాన్) తీసుకుని, అడుగున బటర్ పేపర్ పరిచి ఈ బ్యాటర్‌ ను అందులోకి మార్చుకోండి. అందంగా కనిపించడానికి పైన కొన్ని వాల్‌ నట్ ముక్కలు, అరటిపండు స్లైసెస్ తో అలంకరించండి.

-గ్యాస్ స్టవ్ వెలిగించి ఒక మందపాటి పాన్ లేదా కడాయి ఉంచండి. దాని అడుగు భాగంలో మందంగా ఉప్పు పోయండి. ఇది వేడిని సమానంగా పంచడానికి సహాయపడుతుంది. మంటను హై ఫ్లేమ్‌ లో పెట్టి 15 నిమిషాల పాటు పాన్‌ ను వేడి చేయండి.

-పాన్ బాగా వేడెక్కిన తర్వాత, మంటను మీడియంకు తగ్గించండి. ఉప్పు పైన ఒక చిన్న స్టాండ్ లేదా ప్లేట్ పెట్టి, దాని మీద మన బ్రెడ్ మౌల్డ్‌ ను జాగ్రత్తగా ఉంచండి. పాన్‌ కు గాలి బయటకు పోకుండా గట్టిగా మూత పెట్టేయండి. ఇలా మీడియం మంట మీద సుమారు ఒక గంట పాటు బేక్ అవ్వనివ్వండి.

-గంట తర్వాత మూత తీసి చూడండి. ఒక టూత్‌ పిక్‌ తో బ్రెడ్ మధ్యలో గుచ్చి చూడండి, దానికి పిండి అంటకుండా శుభ్రంగా బయటకు వస్తే మీ బనానా బ్రెడ్ పర్ఫెక్ట్‌ గా బేక్ అయినట్లే. స్టవ్ ఆపేసి, మౌల్డ్‌ను బయటకు తీసి కాసేపు చల్లారనివ్వండి. ఆ తర్వాత బ్రెడ్‌ను మౌల్డ్ నుండి తీసి, మధ్యలోకి కోసి ఆస్వాదించండి.

[ of 5 - Users]
Story first published: Friday, July 17, 2026, 12:59 [IST]
Desktop Bottom Promotion